Wednesday, September 2, 2009

కంప్యూటర్ కు తెలుగు నేర్పడం ...

మామూలుగా కంప్యూటర్లలో ఇంగ్లీషు వాడకం ఎక్కువగా ఉంటుంది.  ఈ కంప్యూటర్లలో  అంటే తెలుగు చదవాలంటే డబ్బాలుగా కనిపిస్తుంది. తెలుగు  చదవాలన్నా ,రాయాలన్నా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.  ఇప్పుడు Windows XP  లో తెలుగు ఎనేబుల్ చేయడం తెలుసుకుందాం.

 Start Menu లోకి వెళ్లి Control Panel క్లిక్ చేయండి.


 
ఇప్పుడు Control Panel లో Regional and Languages ఆప్షన్ క్లిక్ చేయండి. 
 
 
ఇప్పుడు Regional and Languages Dialogue Box లో Languages ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని Install files complex scripts అన్న ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు అది XP సిడి అడుగుతుంది. సిడిని డ్రైవర్ లో పెట్టండి. అందులోనుండి కావలసిన ఫైల్స్ దించుకున్న తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన కంప్యూటర్లో తెలుగు ఇంచక్కా కనిపిస్తుంది.

అర్ధం కాకపోతే ఇది చూడండి ..


మీ దగ్గర  XP సిడి లేదా. ఐనా పర్లేదు.  ఈ క్రింది సైటునుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
http://omicronlab.com/download/tools/iComplex_2.0.0.exe  .. ఇక్కడినుండి  ''iComplex_2.0.0.exe'''  ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకుని మీ సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. అంతే. దీనికోసం మొదటి  సోపానాలు పాటించాల్సిన పనిలేదు.

2 వ్యాఖ్యలు:

EESWARA AGENCIES said...

ఈ విధానము తెలుగు భాషాభిమనులకు
మరియు ఆంగ్లములో సంపూర్ణ జ్ఞ్యనము లేని నాబోటి వారలకు ఎంతో
ఉపయుక్తము ,Sm.Jyothi Vallaboju గారికి ఎక్కడ ,ఎన్నిసార్లు కృతజ్ఞ్యతలు తెలుపుకున్నా
తక్కువేనని నా అభిప్రాయము
మరొక్కసారి వారికి హృదయ పూర్వక ధన్యవాదములు
-మంచికంటి శ్రీనివాస రామకృష్ణ .

EESWARA AGENCIES said...

Madam గారు మీరు చేస్తున్నసహాయం లలో మరొక్కటి కలసినది ,
పై కామెంట్ పెట్టటానికి నాకు తెలియకుండానే నా పేరున ఒక బ్లాగ్
creat చేయగలిగాను....మరళా ధన్యవాదములు
_మంచికంటి శ్రీనివాస రామకృష్ణా .

Post a Comment