మన సిస్టంలో తెలుగు ఎనేబుల్ చేసినా కూడా వార్తాపత్రికలు చదవాలంటే కష్టమే. దీనికి కారణం యూనికోడ్ లో మనమందరం వాడేది గౌతమి ఫాంట్. పత్రికల వాళ్ళకి తమకంటూ ఒక ప్రత్యేకమైన ఫాంట్ వాడతారు. దానిని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది.. లేకపోతె పైన చూపినట్టు తెలుగు పిచ్చి పిచ్చిగా కనిపిస్తుంది.
అలా కాకుండా ఉండాలంటే అదే పేపర్ లో font help క్లిక్ చేసి వాళ్ళు ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ని అన్ జిప్ చేసుకోవాలి.
ఇదే విధంగా మిగతా పత్రికలూ, సైట్లలో తెలుగు చదవడంలో ఇబ్బంది ఉంటే వారి ఫాంట్ హెల్ప్ తీసుకోవాలి. పైన చెప్పిన పధ్ధతి పాటిస్తే సరి.
భారతీయ భాషలలోని వార్తా పత్రికలను చదవడానికి మరో సులభమైన సౌకర్యం ఉంది.. ఈ సైట్ కి వెళ్లి మీకిస్తమైన పత్రికను తెరవండి..
http://uni.medhas.org/
0 వ్యాఖ్యలు:
Post a Comment