Saturday, September 12, 2009

బ్లాగు అంతర్గత సెట్టింగులు


బ్లాగులో తప్పనిసరిగా కొన్ని అంతర్గత సెట్టింగులు చేయాల్సి ఉంటుంది. ముందుగా లాగిన్ అయ్యాక New Post క్లిక్ చేసి Settings సెలెక్ట్ చేసుకోండి .అందులో ముందుగా మీ బ్లాగు టైటిల్ లేదా శీర్షిక ఇవ్వండి. దానికింద మంచి ఉపశీర్షిక లేదా ట్యాగ్ లైన్ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వలన మీ బ్లాగుకు మంచి ఆకర్షణ ఉంటుంది.


తరవాత క్రిందకు వెళితే మీరు బ్లాగులో రాయాలనుకున్న భాషను ఎంచుకోండి. దాని ఉపయోగమేంటంటే మీరు బ్లాగులోనే నేరుగా తెలుగులోరాసుకోవచ్చు. మీరు ఇంగ్లీషులో రాస్తుంటే అది తెలుగులోకి మారిపోతుందన్నమాట. ఇలా ఎంచుకున్నాక సేవ్ చేయడం మర్చిపోకండి.




తరవాత Formatting సెలెక్ట్ చేసుకోండి. మీ బ్లాగులో మొదటి పేజీలో 3-5 టపాలు ఉంఢేట్టుగా చూడండి. ఎక్కువ టపాలు ఉంటే బ్లాగు తెరుచుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక టపాలలో కనపడే సమయం, తేదీ, సంవత్సరం ఇలా చూపించినట్టుగా మార్చుకోండి. టైమ్ జోన్ లో GMT +5.30 ఇస్తే అది ఖచ్చితంగా భారతీయ సమయం ప్రకారం టపాలను చూపిస్తుంది.



ఇక మీరు రాసిన టపాలకు పాఠకులు ఇచ్చే స్పందన కామెంట్లు లేదా వ్యాఖ్యలు. వాటిని కూడా నియంత్రించుకోవచ్చు. వ్యాఖ్యల పెట్టె ఎలా ఉండాలి, ఎవరెవరు వ్యాఖ్యానించేలా చేయాలి అనేది మీ ఇష్టం.



ఇక కామెంట్ల మోడరేషన్ గురించి.. మీరు ప్రతి కామెంటును పరిశీలించి ప్రచురించబడేలా చేయవచ్చు. ఎందుకంటే అప్పుడప్పుడు పనికిరాని వ్యాఖ్యలు కూడా వస్తుంటాయి. అలా మోడరేషన్ పెట్టుకున్నప్పుడు ఆ వ్యాఖ్య మీ మెయిల్ ఐడికి వచ్చేలా చేయండి. మీరు అంగీకరించాకే అది ప్రచురితమవుతుంది. బ్లాగులో వచ్చిన ప్రతి కామెంటు మీకు తెలియాలంటే మీ మెయిల్ ఐడి ఇవ్వండి. సేవ్ చేయండి.



మీ బ్లాగు మీరొక్కరే కాక వేరే వాళ్ళు కూడా రాయొచ్చు. కనీసం వంద మంది. కాని అందరు ఒకే లాగిన్ ఐడితో కాకుండా ఎవరి మెయిల్ ఐడి తో వాళ్లు రాసేలా చేయాలంటే బ్లాగ్ పర్మిషన్ ఇస్తే సరి. అలాగే మీ బ్లాగు అందరు చూడకుండా మీరు మాత్రమే, మీకు ఇష్టమైన వాళ్లు మాత్రమే లేదా అందరూ చూసేలా మార్పులు చేయొచ్చు

2 వ్యాఖ్యలు:

Unknown said...

చాలా ఉపయోగకరంగా ఉంది.

chantiblogs said...

categerios(వర్గాలు) widget ekkada untundi mam.

Post a Comment