Friday, September 11, 2009

బ్లాగు సెట్టింగులు

బ్లాగు మొదలెట్టేసాం కదా.. ఇక దానికి రంగులు, హంగులు చేర్చుదాం.



మీరు మెయిల్ ఐడి తో బ్లాగర్ లో కి లాగిన్ కాగానే dashboard వస్తుంది. అక్కడ layout అన్న లింకుమీద క్లిక్ చేస్తే వచ్చే పేజిలో fonts and colors క్లిక్ చేయండి. అప్పుడు మీరు మీ బ్లాగులోని వివిధభాగాలలోని రంగులు, ఫాంట్ సైజ్ అవి మీకిష్టమైన రీతిలోమార్చుకుని సేవ్ చేసుకోండి.



ఇప్పుడు మనం బ్లాగు టపా, రచయిత వివరాలను సరిచేద్దాం. మళ్లీ layout పేజికి వెళ్లండి. బ్లాగు టపాలో edit క్లిక్ చేసి రచయిత, వ్యాఖ్యలు, వగైరా మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు.




ఇప్పుడు మన బ్లాగులో అవసరమైన బొత్తాములు, హంగులు ఎలా చేర్చాలో తెలుసుకుందాం. layout లోadd a widget క్లిక్ చేసి వచ్చే బాక్స్ లో మనకు నచ్చిన, ఇష్టమొచ్చిన విడ్జెట్లు పెట్టుకోవచ్చు.

Followers : ఈ విడ్జెట్టును మన బ్లాగులో పెట్టడంవల్ల మన బ్లాగును ఇష్టపడేవారెందరో తెలుస్తుంది. కాని ఎవరైనా మన బ్లాగుకు Followers గా చేరొచ్చు. అలా చేరినవారికి మనం కొత్త టపా రాయగానే మెయిల్ వెడుతుంది. మన టపాలు క్రమం తప్పకుండా చదవాలనుకునేవారు ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చు. మనం ఈ విడ్జెట్ పెట్టడం వల్ల వారందరి పేర్లు కనిపిస్తాయి. ఎవరు? ఎంతమంది? అని.

Search Box: ఇది చేర్చడం వల్ల మన బ్లాగు చదివేవారు తమకు నచ్చిన , కావలసిన టపాలు వెతుక్కోవడానికి ఉపకరిస్తుంది.

Html/ Javascript : మన బ్లాగులో ఏదైనా కోడ్, లేదా థర్డ్ పార్టీ విడ్జెట్స్ పెట్టుకోవాలంటే ఉపయోగించాలి. సైట్ మీటర్, లేదా ఇతర్ బొత్తాములు..

Text : మన బ్లాగుకు ఏదైనా స్వాగత వచనం లేదా మంచిమాట ఇవ్వాలనుకుంటే ఇది చేర్చవచ్చు.

Adsense :మన బ్లాగులో గూగుల్ వాడి ప్రకటనలు పెట్టుకోవచ్చు. అదృష్టముంటే డబ్బులు రావొచ్చు..



Picture : ఈ విడ్జట్ సాయంతో మనకు నచ్చిన చిత్రం బ్లాగులో పెట్టుకోవచ్చు.
Slide show : మీ ఫోటోలతో స్లైడ్ షో బ్లాగులో పెట్టుకోవాలంటే ఈ విడ్జెట్ చేర్చండి.
Video bar : వీడియోలు పెట్టుకోవడానికి
Poll : మీరు రాసే టపాలకు పోలింగ్ కూడా పెట్టుకోవచ్చు.
Blog list : మీకు నచ్చిన, ఇష్టమైన బ్లాగుల లిస్ట్ , వాటితో పాటు అందులో రాసిన కొత్త టపాల వివరాలు తెలిసేలా మన బ్లాగులో పెట్టుకోవడానికి ఈ విడ్జెట్




Link list : మీకు నచ్చిన వెబ్ సైట్లు, లింకులు బ్లాగులో పెట్టుకోవడానికి
List : మీకు ఇష్టమైన సినిమాలు, పుస్తకాల లిస్టు పెట్టుకోవడానికి
RSS feed : ఇతర సైట్ల ఫీడ్ మీ బ్లాగులో చేర్చుకోవడానికి
Newsreel: ఆటోమెటిక్ గా గూగుల్ వార్తలు మీ బ్లాగులోనే చదువుకోవచ్చు
Labels : మీ బ్లాగు టపాలకు మీరు ఇచ్చే వర్గాలు, క్యాటగరీల పేర్లు చూపిస్తుంది

5 వ్యాఖ్యలు:

Amar said...

nice work ..keep it..

కెక్యూబ్ వర్మ said...

చాలా విపులంగా, ఓపికగా చెపారు. థాంక్స్ మేడం.

మాలా కుమార్ said...

కొన్ని బ్లాగ్స్ లలో వచ్చే పోస్ట్లను చదవటానికి ఫాలోవర్స్ కి ఆడ్ చేస్తే వాళ్ళ పొస్ట్లు డాష్ బోర్డ్ మీద కనిపిస్తున్నాయి.అలా కనపడకుండా వుండాలంటే టెంప్లెట్ లో మార్చటానికి వీలుందా ? నాకు అలా కనిపిస్తుంటే నచ్చటము లేదు .

జ్యోతి said...

మాల గారు,

మీరు డ్యాష్ బోర్డ్ కి వెళ్ళి మీరు చూస్తున్న బ్లాగ్స్ దగ్గర Manage > Manage blogs i am following > settings > stop following ఇవ్వండి..ఆ బ్లాగు వివరాలు మీకుకనిపించవు.

రవి said...

ఇదంత అరీబురీగా చూసే వ్యవహారం కాదు. ఒక్కొక్క టాపిక్ నూ ఈ వారం చూసి, నా బ్లాగులో పొందుపరుస్తాను.

Post a Comment