Tuesday, December 29, 2009

జి మెయిల్ లో బొమ్మలు

జిమెయిల్ లో మన ఉత్తరంతో పాటు అప్పుడప్పుడు బొమ్మలు పంపిస్తుంటాము కదా. అలా ఎన్నివిధాలుగా చిత్రాలు పంపవచ్చో తెలుసుకుందాం.
మామూలుగా అందరికి తెలిసినది, ఎంతోకాలంగా ఉపయోగిస్తున్న పద్ధతి... మన సిస్టమ్ లో ఉన్న బొమ్మలను attachment లా పంపిస్తాము. అది అందుకున్నవారు డౌన్లోడ్ చేసుకుని చూస్తారు.

కాని చిత్రాలను విడిగా కాకుండా మెయిల్ లోనే ఎంబెడ్ చేయవచ్చు. గూగులమ్మని బొమ్మలు చూపమని దాని పెద్దసైజు సెలెక్ట్ చేసుకోండి. google images . view full size ... ఆ చిత్రాన్ని మొత్తంగా సెలెక్ట్ చేసుకుని copy (మాత్రమే) చేయాలి.


కాపీ చేసిన చిత్రాన్ని మీ మెయిల్ లో రాసుకునే పెట్టెలో పేస్ట్ చేయండి. అంతే ఆ చిత్రం అచ్చంగా మెయిల్ లో వచ్చేస్తుంది. కాని ఈ పద్ధతి నెట్ లో ఉన్న చిత్రాలకే వీలవుతుంది.మరి మన సిస్టమ్ లో ఉన్న చిత్రాలను అలా పంపాలంటే?? ఎలా??
ఇప్పుడు మెయిల్ లో బొమ్మను ఎంబెడ్ చేసే మరో పద్ధతి చూద్దాం. ఇది మన సిస్టమ్ లో ఉన్న ఏ బొమ్మనైనా పంపవచ్చు. ముంధుగా జిమెయిల్ లో Settings>Labs> లి వెళ్లి ఒక్కో ఆప్షన్ చూసుకుంటూ క్రిందకు వెళ్లండి. అక్కడ Insert image అనే ఆప్షన్ ని enable చేయండి. దీనివల్ల మన మెయిల్ లో బ్లాగుకు మళ్లే బొమ్మలను ఎంబెడ్ చేసే సదుపాయం వస్తుందన్నమాట. మీరు మెయిల్ compose చేసేటప్పుడు Add image అనే ఆప్షన్ (icon) ఉంటుంది. అది క్లిక్ చేసి మీ సిస్టమ్ లో ఉన్న చిత్రాన్ని అప్లోడ్ చేయండి.(బ్లాగులో చేసినట్టే)

ఇలా అప్లోడ్ చేసిన చిత్రం మెయిల్ పెట్టెలో పూర్తిగా వస్తుంది. బావుంది కదా. ఇంకెందుకు ఆలస్యం. ప్రయత్నించండి.

Sunday, December 27, 2009

జల్లెడ - బ్లాగులను జల్లించండి...

తెలుగు బ్లాగుల మరో అగ్రిగేటర్ జల్లెడ. బ్లాగు టపాలు రాయగానే ఇక్కడ అది లింకులతో ప్రత్యక్షమవుతుంది. దాని లంకె పట్టుకుని ఆ బ్లాగుల తలుపు తడతారు నెటిజన్లు. అత్యంత ప్రాముఖ్యం కలిగి, ఎన్నో విశిష్ట ఫీచర్లతో మనకు సేవలందిస్తున్న జల్లెడ గురించి తెలుసుకుందాం.ఈ జల్లెడలో బ్లాగులు విభాగాల వారిగా జల్లించబడి సులువైన క్యాటగరీలలో మనకు అందించబడతాయి. మనం బ్లాగు టపా రాయగానే ఇచ్చే లేబుల్స్ ఆధారంగా సదరు టపాలు ఇక్కడి వివిధ విభాగాలలో చేరిపోతాయి. ఇందులో ఉన్న విభాగాలు చూద్దాం .. అన్నీ.. కబుర్లు, హాస్యం, రాజకీయం, కవితలు, సాహిత్యం, ఆధ్యాత్మికం, కొత్తబాబులు (కొత్త బ్లాగులు) , స్త్రీ (మహిళా బ్లాగులు మాత్రమే) , సాంకేతికం, సినిమా, పత్రికలూ (అంతర్జాల పత్రికలు).. అంటే కాక ఇందులో తాజా వ్యాఖ్యలు, తాజా టపాలు విడివిడిగా చూడవచ్చు. అంతే కాదు తెలుగు బ్లాగుల జాబితా కూడా లింకులతో సహా ఇందులో చూడవచ్చు. జల్లెడలో ఉన్న మరో విశేషం .. ఇందులో మనం బ్లాగు రచయిత పేరు ఆధారంగా, మనం రాసిన కామెంట్ల ఆధారంగా కూడా టపాలు, బ్లాగులను జల్లించవచ్చు(చూడవచ్చు). దీని ఇంగ్లీషు వెర్షన్ కూడా ఉండండి. భారతీయుల ఇంగ్లీషు బ్లాగులు ఇక్కడ చేర్చబడ్డాయి. జల్లెడను తెలుగులోనే కాక RTS లో కూడా చదవగలిగే అవకాశం ఉంది.


మీరు జల్లెడను ఉపయోగించుకుని అలాగే వెళ్ళిపోకుండా అక్షింతలు వేయాలని ఉందా? తిట్లు, పొగడ్తలు, సలహాలు వగైరా. ఆ అవకాశం కూడా ఉంది..


ఇక ఇన్ని ప్రత్యేకతలు కలిగిన జల్లెడ ఆగ్రిగేటర్లో మీ బ్లాగును చేర్చాలా? అక్కడే ఉన్న ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ అడిగిన వివరాలు ఇచ్చేయండి . అంతే మీ బ్లాగును , చిరునామాను సరిచూసుకుని జల్లెడలో చేర్చేస్తారు నిర్వాహకులు.. ఇక హాయిగా రాసుకోండి.. జల్లెడలో మీ టపా లింక్ చూసి చదువరులు ఆ తీగ పట్టుకుని మీ బ్లాగుకు వచ్చేస్తారు..

Thursday, November 26, 2009

కూడలి కబుర్లు - అంతర్జాతీయ బ్లాగర్ల సమావేశం

కూడలిలో కబుర్లు అనే ఆప్షన్ ఉంది చూసారా? బ్లాగర్లు ఎవరికీ వారు బ్లాగులు రాసుకుంటూ ఉన్నారు.హ్యాపీస్. కాని ఒకరికొకరు కామెంట్ల ద్వారానే పరిచయం, ముచ్చట జరుగుతుంది. కాని బ్లాగర్లు ఒక చోట చేరి చెప్పుకోవడానికి ఒక వేదిక కూడలి కబుర్లు. బ్లాగులకు సంబంధించిన సమస్యలైనా, మీ టపాలకు సంబందించిన సలహాలు, చర్చలు ఇక్కడ చేయవచ్చు. ఎవరికీ వీలైన సమయంలో వారు వచ్చి ఇతరులకు కూడా సాయం చేయవచ్చు.మరి ఈ కబుర్లు ఎక్కడ? ఎలా ? అంటారా? ఇది కూడలి కబుర్లు చిరునామా. http://chat.koodali.org/ ఈ చిరునామాకు వెళ్లి మీపేరు ఇచ్చి లోపలకు వెళ్లండి. కబుర్లు మొదలెట్టండి. కబుర్లకు ఒక ప్రాంగణం ఉంది కదా అని ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్లను నిషేదించబడతారు. వారి ఐ.పి అడ్రస్ తో కంప్లెయింటు చేసే సదుపాయం నిర్వాహకులకు ఉంది. ఈ సదుపాయం దుర్వినియోగం కాకూడదనే సదుద్దేశ్యంతో ఈ ఏర్పాటు చేయబడింది.

ముఖ్య ప్రకటన ::

ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండవ ఆదివారం బ్లాగర్ల దినోత్సవం గా జరుపబడుతుంది. అది హైదరాబాదులో ఘనంగా ఏర్పాటు చేయబడి, హైదరాబాదులో ఉన్నా బ్లాగర్లు వ్యక్తిగతంగా కలిసే అవకాశం కూడా ఈ సందర్భంగా కలుగుతుంది. కాని వేర్వేరు రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న తెలుగు బ్లాగర్ల సంగతేంటి ? అందుకే ఈ కూడలి కబుర్ల ప్రాంగణంలో అంతర్జాతీయ తెలుగు బ్లాగర్ల సమావేశం నిర్వహించబడుతుంది. గత సంవత్సరం విశేషాలు చూడండి.

ఈ సంవత్సరం డిసెంబర్ రెండవ ఆదివారం 13.12.09 హైదరాబాదులో బ్లాగర్ల సమావేశం నిర్వహించబడుతుంది.దానికి బ్లాగర్లు, చదువరులు, తెలుగు భాషాభిమానులు హాజరు కావొచ్చు.

అలాగే డిసెంబర్ నెలలో రెండవ శనివారం 12.12.09 కూడలి కబుర్లలో సాయంత్రం ఆరు గంటలకు (భారతీయ కాలమానం ప్రకారం) అంతర్జాతీయ తెలుగుబ్లాగర్ల సమావేశం ఏర్పాటు చేయడమైనది. అందరూ హాజరు కాగలరు.

Monday, November 23, 2009

కూడలి


కూడలి అంటే తెలీని బ్లాగరులు, బ్లాగులు చదివేవాళ్ళు ఉండరేమో. తెలుగు బ్లాగులు 2005 నుండి మొదలయ్యాయి అని చెప్పవచ్చు. కాని ఎవరు ఏ బ్లాగులో ఎప్పుడు రాసారు అని తెలియడం ఎలా?.. ఈ ప్రశ్నకు సమాధానంగా వీవెన్ మహాశయుడు (లేఖిని సృష్టికర్త) 21.6.06 రోజు బ్లాగులన్నీ ఒకచోట ఉండేలా ఒక సంకలిని (aggregator) మొదలుపెట్టారు.

ఇప్పుడు కూడలి విశేషాల గురించి తెలుసుకుందాం..
కూడలిలో వివిధ విభాగాల ఏర్పాటు చేయబడ్డాయి. బ్లాగులు, వార్తా పత్రికలూ, ఫోటో బ్లాగులు, సేకరణలు రాసే బ్లాగులు, చివరిలో తెలుగుబ్లాగర్ల ఇంగ్లీషు బ్లాగులు. అదేవిధంగా అన్నిబ్లాగులలో మరిన్ని విభాగాలు మనకు లభ్యమవుతాయి. సినిమా విశేషాల బ్లాగులు, సాహిత్యానికి సంబంధించిన బ్లాగులు, హాస్యం, సాంకేతికం, రాజకీయాల గురించి తరచూ రాసే బ్లాగులు . మనకు నచ్చిన విభాగంలోని బ్లాగులను చాలా సులువుగా చదవవచ్చు.
కూడలిలో ఉన్నా మరో ప్రత్యేకత ..ఫోటో బ్లాగులు. తెలుగు వారి ఫోటో బ్లాగులు ఇందులో పొందుపరచబడ్డాయి. కూడలి మొదటి పేజీలో ఈ ఫోటో బ్లాగులలోని ఏదో ఒక యాదృచ్చిక చిత్రం కనిపిస్తుంది. దానంతట అదే మారుతుంది కూడా.
ఈ మధ్య బ్లాగర్లందరూ ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారంగా అందించిన కూడలి నిర్వహణ గురించి తెలుసుకుందాం. కూడలి టైటిల్ దగ్గరలో నిర్వహణ అనే బటన్ క్లిక్ చేసి మీకు నచ్చని , చదవడానికి ఇష్టపడని బ్లాగుల చిరునామాలు చేర్చండి. మళ్ళీ మీరు కూడలి తెరిచినపుడు సదరు బ్లాగులు మీకు కూడలిలో కనపడవు. మీకు నచ్చిన బ్లాగులు మాత్రమే మీ కూడలిలో చూడవచ్చు.
మీరు బ్లాగు మొదలెట్టగానే దానిగురించి అందరికి తెలియాలి. మీరు టపా రాసినప్పుడు అందరూ వచ్చి చదవాలిగా.దానికి మీ బ్లాగు చిరునామాను కూడలిలో చేర్చండి. "కొత్త బ్లాగు చేర్చండి" ఆన్న చోట క్లిక్ చేసి అక్కడ చెప్పినట్టు ఫాలో అవ్వండి.


కూడలికి సంబంధించిన వివరాలకు ఇక్కడ చూడండి.

Saturday, November 7, 2009

పి.డి.ఎఫ్./ PDFPDF అంటే Portable Document Format.
మన దగ్గరున్న ఏదైనా సమాచారం కాని డాక్యుమెంట్ కాని భద్రపరుచుకోవడానికి ,సులువుగా పంపిణీ చేయడానికి ఆ సమాచారాన్ని పి.డి.ఎఫ్ చేస్తాము.అంటే ప్రతీ పేజీని ఒక చిత్రంలా భద్రపరచడం. దాన్ని పుస్తకంలా తయారు చేయడం. ఇలా చేయడం వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం.

* మన సమాచారాన్ని చిత్రంలా బంధించి , భద్రపరిచాము కాబట్టి అవతలి వారి కంప్యూటర్లో సులువుగా చూడగలుగుతారు. వాళ్లు ఎటువంటి సాఫ్ట్ వేర్,ఆపరేటింగ్ సిస్టం వాడినా సరే.

* మన ఫైలులో వాడిన బొమ్మలు,గుర్తులు,ఫాంట్లు ..ఎలాగున్నవి అలాగే మార్పులేకుండా చూడొచ్చు.మామూలు డాక్యుమెంట్ లా పంపిస్తే కొంచం కష్టమవుతుంది.

* ఈ పద్ధతిలో పంపిన సమాచారం ఎటువంటి ప్రింటర్ లో అయినా ప్రింట్ చేసుకోవచ్చు.

* ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్, పుస్తకాల పబ్లిషింగ్ కోసం పిడిఎఫ్ చేయడాం చాలా ఉపయోగకరమైనది.

* అంతర్జాలంలో ముఖ్యమైన సమాచారాన్ని పిడిఎఫ్ రూపంలో పెడితే దానిని కాపీ చేసుకోవడం కుదరదు.అదే మామూలుగా డాక్యుమెంట్ లా ఉంటే సులువుగా కాపీపేస్ట్ చేసుకోవచ్చు. కష్ట పడి తయారు చేసిన సమాచారాన్ని భద్రపరుచుకోవడానికి ఇది సులువైన మార్గం.

* ఇక తెలుగు విషయానికొస్తే... పుస్తకాలు,పత్రికలవాళ్ళు ఉపయోగించేది అను,శ్రీలిపి ఫాంట్లు.అవి యూనికోడ్ లో సరిగ్గా కనిపించవు.మళ్ళీ యునికోడ్ లో రాయాలంటే కష్టం.లేదా అవతలి వారి సిస్టంలో కూడా ఆ సాఫ్ట్ వేర్ ఉండాలి.అదే వ్యాసాలూ పిడిఎఫ్ చేసి పంపిస్తే ఎలాటి ఇబ్బంది లేకుండా చూడగలం. అందుకే పత్రిక రంగంలోని వారికి ఈ పధ్ధతి చాలా ఉపయోగకరమైనది.

* ఎక్స్.పి తర్వాత అన్ని ఆపరేటింగ్ సిస్టంలలో వాడే ఫాంట్ గౌతమి. కాని అంతకు ముందు వాడే ఆపరేటింగ్ సిస్టంలలో ఇది కనిపించదు. మరి ఎలా. మన వ్యాసం కాని ఉత్తరం కాని సమాచారం కాని వాళ్లు చదవాలంటే ఎలా. పిడిఎఫ్ చేసి పంపిస్తే చాలు. ఇందులో రాత మొత్తం బొమ్మలా మార్చబడుతుంది కాబట్టి ఇంచక్కా తెలుగులోనే కనిపిస్తుంది.

* మీరు బ్లాగులో ఒక విషయంపై పది టపాలు రాసారనుకోండి. వాటిని ఒక దగ్గర ప్రోగు చేసి ఒక డాక్యుమెంట్ లా లేదా పుస్తకం లా చేసి పెడితే బావుంటుంది కదా.ఎవరికైనా పంపించవచ్చు. డాక్యుమెంట్ పెద్దగా ఉంటుంది .చదవడం కష్టంగా ఉంటుంది.అదే పిడిఎఫ్ చేసి పంపితే పుస్తకంలా చదువుకుంటారు.

ఈ పిడిఎఫ్ ఎలా చేయాలి. ఎలా చదవాలి అనే విషయాలు ఇపుడు చూద్దాం.

మనకు ఒక పిడిఎఫ్ ఫైల్ వచ్చింది.లేదా చదవాలి . దానికోసం రీడర్ కావాలి. ఇది డౌన్లోడ్ చేసి మీ సిస్టం లో భద్రపరుచుకోండి.


Adobe Reader

Foxit Reader


పిడిఎఫ్ చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి.
1. Microsoft Word లో చిన్న యాడ్ ఆన్ చేరిస్తే మన డాక్యుమెంట్ తయారుకాగానే పిడిఎఫ్ లా వెంటనే చేసుకోవచ్చు.

2. Openoffice లో కూడా మన డాక్యుమెంట్ కాగానే పిడిఎఫ్ లా మార్చుకుని సేవ్ చేసుకోవచ్చు.

౩. Cute PDF writer

3. PDF converter

4. PDF995

5. Primo PDF

6.DoPDF


పిడిఎఫ్ గురించి మరికొన్ని ఉపయోగాలు

Wednesday, November 4, 2009

విస్టా, విండోస్ 7 లో తెలుగు సమస్య

నిన్న మామూలుగా జిమెయిల్ ఓపన్ చేయగానే అయోమయంలో పడ్డాను. అయ్యో తెలుగుకు ఏమైంది. తల, ముక్కు, కాళ్ళు , చేతులు అన్ని విడిపోయి కనిపిస్తున్నాయి. కొంపదీసి మంటనక్కతో ఈ జిమెయిల్ గొడవ పడిందా అని గూగులమ్మని అడిగి Flock తెచ్చుకుని వాడినా అలాగే కనిపిస్తుంది. మెయిల్ తప్ప మిగతా అన్నిచోట్లా తెలుగు బానే కనిపిస్తుంది. ఇదేం గొడవరా అనుకుని .. ఎందుకైనా మంచిది అని IE లో చూసా ( నాకు ఇదంటే అస్సలు పడదు.. నా స్పీడ్ కి తట్టుకోదు .సతాయిస్తుంది) సేమ్ ప్రాబ్లం. ఇప్పుడేంటి దారి. నేను వాడేది విండోస్ 7 , ఈ సమస్య నాకేనా, అది వాడేవారికి అందరికి వస్తుందా అని కొందరిని బుర్ర తినేసి , గెలికేస్తే అసలు సంగతి తెలిసింది.( ఎవరెట్లా పొతే నాకేంటి? నాకు తెలుగు కనపడాలి అంతే) XP లో ఎటువంటి సమస్య లేదు. ఇదిగోండి విస్టా, విండోస్ 7 లో తెలుగు సంబంధించి వస్తున్న సమస్యకు పరిష్కారం..


జీమెయిల్ వాడు తన Stylesheetలో "Arial Unicode MS" ఖతిని వాడటం మెదలుపెట్టాడు. ఆ ఖతిలో తెలుగు పాఠ్యానికి హల్లులు మరియు వత్తులూ విడిపోయి కనిపిస్తాయి.

పరిష్కారాలు:
 • మీ కంప్యూటరు నుండి Arial Unicode MS ఖతిని తొలగించండి. Delete Arial Unicode MS font from your computer.
  1. Type fonts in the Run Command (Windows Key + R or Click on Start menu then click on Run command)
  2. Delete font name Arial Unicode MS (True Type).
 • లేదా, మీ విహారిణికి మీరు చెప్పిన ఖతలను మాత్రమే వాడమని చెప్పండి. Firefoxలో అయితే ఇలా:
  • Goto Tools meu and then click on Options...
  • In the Content tab, click on the Advanced... button under the Fonts & Colors section.
  • From the Fonts For drop down select Telugu.
  • Then, select fonts of your choice from serif, sans-serif, etc dropdowns.
  • Uncheck the "Allow pages to choose their own [..]" check box


Veeven.


ఇది బ్లాగులకు సంబంధించిన విషయం కాకున్నా,మనం వాడే జిమెయిల్ కి తెలుగు సంబందించి వచ్చిన చిన్న తెగులు.

Thursday, October 29, 2009

మీకు కావలసిన టైంలో టపా పబ్లిష్ కావాలా??

మీ బ్లాగులో టపా రాయాలంటే దానికి సమయం కేటాయించి కూర్చుని రాయాలి.పబ్లిష్ చేయాలి. ఒక్కోసారి అలా కుదరకపోవచ్చు. ఇపుడు రాసి పెట్టి ,రెండు రోజుల తర్వాత లేదా మీకు కావలసిన రోజు పబ్లిష్ అయ్యేలా చేస్తే ఎలా ఉంటుంది. బావుంటుంది కదా. సౌకర్యంగా కూడా ఉంటుంది. ఒకేసారి పది టపాలు కూడా అలా సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఒక్కో టపా ఒక్కో నిర్ధారిత సమయంలో,తేదీలో ప్రచురింపబడేట్టు.. దానికోసం చిన్న చిట్కా బ్లాగులోనే దొరుకుతుంది.


మామూలుగా మనం బ్లాగులోకి లాగిన్ కావాలంటే http://www.blogger.com/ కి వెళతాము కదా. ఇలా మన టపాను మరో రోజు,సమయంలో పబ్లిష్ చేయాలంటే http://www.draft.blogger.com/లో లాగిన్ కావాలి. ఎప్పటిలాగే మీ టపాను రాసుకుని క్రింద ఎడమవైపు post options అని ఉంటుంది.అది క్లిక్ చేసి మీకు కావలసిన తేది, సమయం ఇచ్చి పబ్లిష్ చేయండి. ఆగండాగండి.. మీ టపా వెంటనే పబ్లిష్ కాదు. ఫలానా టైం కి మనం schedule చేసి పెట్టామన్నమాట. అది సరిగ్గా టైం కి పబ్లిష్ అవుతుంది మీరు కంప్యూటర్ ముందు లేకున్నా. మీ కంప్యూటర్ ఆఫ్ చేసి ఉన్నాకూడా. ఇలా సెట్ చేసి నిశ్చింతగా మీ పనులు చేసుకోవచ్చు. అలారం పెట్టినట్టు మీరు ఇచ్చిన సమయానికి మీ టపా బ్లాగులో ప్రత్యక్షమవుతుంది.. భలే ఉంది కదూ..

Sunday, October 18, 2009

యూట్యూబ్ ట్రిక్కులు

గత టపాలో యూట్యూబ్ నుండి వీడియోలు మన బ్లాగులో ఎలా పెట్టాలో తెలుసుకున్నాము కదా. ఇపుడు యూట్యూబ్ గురించి మరి కొన్ని ట్రిక్కులు, టిప్పులు తెలుసుకుందాం.


యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చూస్తాము.అందులో మనకు కొన్ని చాలా నచ్చుతాయి. వాటిని ఆ సైట్ నుండి నేరుగా డౌన్లోడ్ చేసుకోలేము. కాని కొన్నిఉపకరణాల సాయంతో అది కూడా సులువే..

http://kissyoutube.com/

Youtube downloader


dvdvideosoft


చిన్న ఉదాహరణ ఇక్కడ చూడండి.


మీ వీడియో URL ఇవ్వండి.

మీ సిస్టం లో కావలసిన చోట సేవ్ చేసుకోండి.ఇక మీకు నచ్చిన వీడియోనుండి ఆడియో మాత్రమే కావాలంటే ఎలా.. దానికీ ఓ చిట్కా ఉంది. http://listentoyoutube.com/ ఈ సైట్ కి వెళ్లి మీకు కావలసిన యూట్యూబ్ URL ఇవ్వండి.


ఇక దాని ఆడియో MP3 సేవ్ చేసుకోండి.మరో తమాషా చేద్ద్దామా. ఒక వీడియోకి మరో వీడియోలోని ఆడియో మాత్రమే జోడిస్తే ఎలా ఉంటుంది. http://ytdub.com/ ఈ సైట్ సాయంతో అలా చేయొచ్చు.ముందుగా మీకు కావలసిన రెండు వీడియోలు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మీరు చేయబోయే రీమిక్స్ కి పేరు ఇవ్వండి. Source లో మీ వీడియో ఐడి, మీరు ఇవ్వదలుచుకున్న ఆడియో యొక్క వీడియో ఐడి ఇచ్చి, ఇతర సెట్టింగులు ఎంచుకున్నాక Dubbo అనే బటన్ నొక్కండి. అంతే కొద్దిసేపట్లో మీ రీమిక్స్ రెడీ అవుతుంది.


చిరంజీవి పాత పాటకు చరణ్ లేటెస్ట్ పాట జత చేస్తే ఎలా ఉంటుంది అని నేను చేసిన ప్రయోగం చూడండి.Wednesday, October 7, 2009

బ్లాగు టపాలో వీడియో పెట్టడం...

బ్లాగులో రాయడం, చిత్రాలు ,ఆడియో పెట్టడం ఎలాగో తెలుసుకున్నాం కదా.ఇప్పుడు మన టపాలో వీడియో ఎలా పెట్టాలో చూద్దాం. మనం రాసే టపాలో సినిమా పాట అయినా, ఏదైనా కార్యక్రమమైనా పెట్టాలంటే కొన్ని సైట్లలో ఈ సదుపాయం ఉంది. ఉదా... Youtube ..ఇక్కడ మీకు లభించే వీడియోలు మన బ్లాగులో పెట్టడానికి కొన్ని సులువైన పద్ధతులు పాటిస్తే చాలు. అలాగే యూట్యూబ్ లో మీ సొంత వీడియోలు కూడా అప్లోడ్ చేసి బ్లాగులో పెట్టవచ్చు.
యూట్యూబ్ కి వెళ్లి మీకు కావలసిన పాట వెతకండి. ఇక్కడ కుడివైపు కనిపించే Embed ఆప్షన్లో ఉన్న కోడ్ ని కాపీ చేసుకోండి.ఆ కోడ్ ని మీ బ్లాగులో , మీకు కావలసిన చోట పెట్టండి. తర్వాత మీరు రాయాలనుకున్న విషయాన్ని రాసి పబ్లిష్ చేయండి.అంతే ఎంచక్కా వీడియో చూసుకోండి.. ఆనందించండి.

నెట్ లో దొరికే వీడియో ఎలా పెట్టాలో చూసాము కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న వీడియోని బ్లాగు టపాలో ఎలా పెట్టాలో తెలుసుకుందాం. మీరు పోస్ట్ రాసే పేజీలో పైన Add Video అనే బొత్తాము ఉంటుంది . అది క్లిక్ చేసి మీ వీడియోని తగిన పేరు ఇచ్చి అప్లోడ్ చేయండి. అంతే. అది మీ బ్లాగులో కూర్చుంటుంది.

అర్ధమైంది కదా. ఆలస్యమెందుకు . మొదలెట్టండి మరి..

గమనిక: ఎప్పుడు కూడా నెట్ నుండి చిత్రాలు, వీడియోలు గట్రా వాడుకుంటే కాపీరైట్ సమస్యలులేకుండా చూసుకోండి.లేకపోతే గొడవలైపోతాయి మరి ..

Sunday, October 4, 2009

బ్లాగుకు ఫోటోలు జత చేయడం ఎలా?

ఇంతవరకు బ్లాగులో ఎలా రాయాలి , లింకులు ఎలా పెట్టాలి తెలుసుకున్నాము కదా.ఇపుడు మన టపాలకు అందమైన బొమ్మలు ఎలా పెట్టాలి తెలుసుకుందాం.


మీ కంప్యూటర్లో ఉన్న చిత్రం బ్లాగు టపాలో పెట్టాలంటే Add new post లో పైన చూపిన లింకు Add image ని క్లిక్ చేసి మీ కంప్యూటర్లో ఉన్న చిత్రాన్ని అప్లోడ్ చేయండి. ఈ చిత్రం అప్లోడ్ చేసేటప్పుడు అది ఎటువైపు రావాలో ,చిన్నగా, పెద్దగా ఎలా ఉండాలో సెట్ చేయండి.

సేవ్ చేసిన చిత్రం ఇలా అందంగా బ్లాగులో కన్పిస్తుంది.ఒకవేళ మీరు గూగుల్ నుండి చిత్రాలు సేకరించి బ్లాగు టపాలో పెట్టాలనుకుంటున్నారా?ఐతే గూగుల్ ఇమేజెస్ ఓపన్ చేయండి. అందులో మీకు కావలసిన బొమ్మ పేరు టైప్ చేయండి.
మీరు అడిగిన చిత్రాలు ఇలా వస్తాయి.అందులో మీకు నచ్చిన బొమ్మపై రైట్ క్లిక్ చేసి మీ కంప్యూటర్లోకి సేవ్ చేసుకోండి.

మీరు ఇలా సేవ్ చేసుకున్న చిత్రం బ్లాగులో ఇలా కనిపిస్తుంది. చిన్నగా ఉంది కదా.. ఏం చేద్దాం ???మీరు బొమ్మ మీద రైట్ క్లిక్ చేసి సేవ్ చేయకుండా, బొమ్మ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది.అప్పుడు See full size image క్లిక్ చేసి బొమ్మను పెద్దసైజులో సేవ్ చేసుకోండి.
పెద్దసైజులో సేవ్ చేసుకుని బ్లాగులో అప్లోడ్ చేసుకుంటే ఆ బొమ్మ అందంగా పెద్దగా కన్నులకింపుగా కనిపిస్తుంది..మరి మొదలెట్టండి మరి...


ఒకోసారి గూగులమ్మ ఇచ్చే బొమ్మలు కాపీరైట్ సమస్యలు ఉంటాయి. చూసుకోండి..

Tuesday, September 29, 2009

మీరు పాడిన పాటలు బ్లాగులో పెట్టాలా??

ఇంతవరకు బ్లాగులు అంటే మన ఆలోచనలను రాతలలో నిక్షిప్తం చేయడమే అనుకుంటున్నారు.పాటలు, వీడియోలు కావాలంటే జాలంలో చాలా ఉన్నాయి. యూట్యూబ్, ఈస్నిప్స్ గట్రా.. నెట్లో ఉన్న పాటలు వాడుకోవచ్చు లేదా మన దగ్గర ఉన్న పాటలు, వీడియోలు అప్లోడ్ చేసి బ్లాగులో పెట్టొచ్చు. కాని మన స్వంత గొంతుకతో పాడి, మాట్లాడి బ్లాగులో పెట్టాలంటే ఎలా??


దీనికోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి పాటిస్తే చాలా సులువుగా ఆడియో టపాలు పెట్టడం కష్టమేమి కాదు. ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ ఆడియో ఫైళ్ళు mp3 format లో ఉండాలి. మీ దగ్గర రికార్డింగ్ సదుపాయం ఉన్న mp3 ప్లేయర్ ఉంటే మంచిదే. అందులో డైరెక్టుగా పాడేసి,మాట్లాడేసి రికార్డింగ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మన కంప్యూటర్ కి కనెక్ట్ చేసి ఆ ఫైల్ ని సిస్టం లోకి సేవ చేయండి. ఒకవేళ అది wav format లో ఉంటే dBPoweramp music converter సాయంతో mp3 కి మార్చుకోవచ్చు.


మరో సులభమైన ఉపాయం ఉంది. వాయిస్ రికార్డింగ్ సాఫ్ట్ వేర్ వాడడం. ఈ సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. కంప్యూటర్ కి మైక్ అనుసంధానం చేసి ఆ సాఫ్ట్వేర్ సాయంతో రికార్డింగ్ చేయండి. ఇక్కడ మన ఆడియో నేరుగా mp3 లో రికార్డ్ అవుతుంది. ఈజీగా లేదూ..
RecordPad Sound Recording Software


MP3 Voice Recorderఇక వాయిస్ రికార్డింగ్ ఐపోయింది. దాన్ని బ్లాగులో ఎలాపెట్టాలి.. ముందుగా esnips లేదా divshare సైట్లో మీ ఖాతా తెరవండి. అక్కడ మీరు రికార్డింగ్ చేసింది అప్లోడ్ చేసి సేవ్ చేయండి. తరవాత దాని mp3 widget code తీసుకొని మీ బ్లాగులో పెట్టండి. అంతే..


ఒకవేళ మీ టపాలో ఒకటికంటే ఎక్కువ పాటలు, ఆడియో ఒకే ఫైలులా పెట్టాలనుకుంటే మీరు అప్లోడ్ చేసిన పాటలన్నీ playlist లా చేసి ఆ కోడ్ బ్లాగులో పెడితే సరి.. ఇలాగన్నమాట..


అర్ధమైందనుకుంటా??

Monday, September 21, 2009

వ్యాఖ్యల్లో లింకులు ఇవ్వడం

ఇంతకు ముందు బ్లాగు టపాలో వేరే టపా, బ్లాగు, సైట్ లింక్ ఇవ్వడం తెలుసుకున్నాము కదా. ఇప్పుడు బ్లాగుల్లో మనం రాసే వ్యాఖ్యల్లో కూడా ఏదైనా లింక్ ఎలా ఇవ్వాలో చూద్ద్దాం. ఇది అంత కష్టమేమి కాదు.

మనం బ్లాగు టపాలకు మన స్పందన తెలపడానికి వ్యాఖ్యలు రాస్తుంటాము. అప్పుడప్పుడు ఈ వ్యాఖ్యలలో మరో టపా కాని , సైటు కాని ప్రస్తావించవలసి వస్తుంది. ఆ పేజి లింక్ ఇలా ఇవ్వొచ్చు.
అది చదివినవాళ్ళు దాన్ని కాపీ చేసుకుని విడిగా పేస్ట్ చేసి చూడాలి. ఇలా మొత్తం పేజి లింక్ ఇవ్వడం వల్ల ఒక్కోసారి కాపీ చేసుకోవడంలో ఏదైనా మిస్ ఐతే కష్టం కదా. బద్ధకం వల్ల కూడా దాన్ని చూడము. ఇంత పొడుగు చిరునామా చూడడానికి అంత బాగోలేదు కూడా.

అలా కాకుండా బ్లాగు టపాలో ఇచ్చినట్టు వ్యాఖ్యలో కూడా లింక్ లేదా లంకె వేయొచ్చు. ఒక చిన్న కోడ్ ఇస్తే సరి..

<a href='లంకె చిరునామా'>లంకె పాఠ్యం </a>


ఇక్కడ లంకె చిరునామా అన్నచోట మీరు ఇవ్వాలనుకున్న పేజి లింక్ ఇవ్వండి.లంకె పాఠ్యం అన్నచోట మీరు లింకుకు ఇవ్వాలనుకున్న పదం ఇవ్వండి.ఇప్పుడు మీ వ్యాఖ్యలో లింక్ ఇలా వస్తుంది. అది చదివిన వాళ్లు అది క్లిక్ చేయగానే సదరు పేజి ఓపన్ అవుతుంది. మొదట్లో కాస్త తికమకగా, అయోమయంగా ఉండొచ్చు.కాని రెండు మూడుసార్లు చేస్తే అదే అలవాటవుతుంది.