Friday, November 9, 2012

కినిగెలో పుస్తకాలు కొనండి "లా"

రాన్రానూ ప్రింట్ పుస్తకాలన్నీ కూడా ఎలక్ట్రానిక్ సోయగాలతో ఈ బుక్స్ గా మారిపోతున్నాయి. కినిగె వాటికి మరింత ప్రాచుర్యం కల్పించి దేశవిదేశాల్లో ఉన్న తెలుగు పుస్తక ప్రియులకు ఎన్నో పుస్తకాలను ఈ బుక్స్ గా మార్చి కొనుక్కొవడానికి, అద్దెకు తీసుకోవడానికి, బహుమతిగా ఇవ్వడానికి అందుబాటులో ఉంచింది..

నాకైతే పుస్తకాలను కంప్యూటర్లో చదవడం అస్సలిష్టం ఉండదు. హాయిగా పుస్తకం పట్టుకుని సోఫాలో తీరిగ్గా కూర్చుని పక్కన పకోడీలో, పునుకులో పెట్టుకుని ఒక్కోటి నములుతూ ఒక్కో పేజి తిప్పుతూ అందులో లీనమైపోయి చదవడం చాలా ఇష్టం. ఏదైనా పని ఉంటే పుస్తకాన్ని చదువుతూనే వెళ్లొచ్చు. వేరే రూమ్ లో కాని, వంటింట్లో కాని చదువుకోవచ్చు.. అస్తమానం కంప్యూటర్ ముందు కూర్చోవాలంటే కుదరదు కదా.. అందుకే కినిగె వారు నాలాటి వారికోసం, అచ్చు పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు వీటిని ఇంటినుండే ఆర్డర్ చేసి కొనుక్కోవచ్చు, మిత్రులకు, హితులకు బహుమతిగా కూడా ఇవ్వొచ్చు. అప్పుడప్పుడు పుస్తకాలమీద డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కినిగెవారు. మరి ఈ  ప్రింట్ పుస్తకాలను ఎలా కొనుగోలు చేయాలో వివరంగా చూద్దాం..



ముందుగా కినిగె సైట్ ఓపన్ చేయండి.. http://kinige.com/  ఇందులో print books, ebooks  ఆప్షన్స్ ఉంటాయి. అందులో print books  సెలెక్ట్ చేసుకోండి. ఒకేసారి ఎన్ని పుస్తకాలైనా తీసుకోవచ్చు. నేను రెండు పుస్తకాలకు ఆర్డర్ పెట్టాను.




కినిగె సైట్లో ఉన్న ప్రింట్ పుస్తకాలన్నీ చెక్ చేసుకుని మీకు నచ్చిన పుస్తకాన్ని లేదా  పుస్తకాలను సెలెక్ట్ చేసుకోండి..






మీరు ఒకటి లేదా రెండు పుస్తకాలు తీసుకునే బదులు ఎక్కువ పుస్తకాలు , కాస్త ఎక్కువ ధర పలికేవి తీసుకుంటే మీకు రవాణా చార్జీలు గిట్టుబాటు అవుతాయి..ఇప్పుడు నేను రెండు పుస్తకాలను సెలెక్ట్ చేసుకున్నాను. ఎప్పటికప్పుడు పుస్తకాలను సెలెక్ట్ చేసుకుని పైన cart (బండిలో)  పడేయండి.





అన్నీ ఎంపిక అయ్యాక cart ని క్లిక్ చేస్తే మీరు తీసుకోవాలనుకున్న పుస్తకాల పేర్లు, డిస్కౌంట్ తర్వాత వాటి ధరలు, రవాణా చార్జీలు కలిపి మొత్తం అమౌంట్ వస్తుంది. క్రింద మీ పుస్తకాలను  పంపాల్సిన చిరునామా ఇచ్చి ఆ సొమ్ముకు రీచార్జ్ చేయాలి.





 ఆ తర్వాత బిల్లింగ్  చిరునామా వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయాలి.




ఇప్పుడు మీరు ఆన్లైన్లో పుస్తకాల అమౌంట్ ను క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టవచ్చు.





డబ్బులు కట్టేసారుగా. మళ్లీ కినిగె సైటుకు రావాలి. ఇక్కడ మీ వివరాలన్ని చెక్ చేసుకుని Cart (బండి) దగ్గరకు వెళ్లి మీ పుస్తకాలకు ఆర్డర్ పూర్తి చేయాలి. అంటే ముందు డబ్బులు కట్టేసారు. ఇప్పుడు ఆర్డర్ పెడుతున్నారన్నమాట..





పైనల్ గా వివరాలు, చిరునామా చెక్ చేసుకుని ఆర్డర్ పెట్టేసేయండి. దాని వివరాలు మీ మెయిల్ కు కూడా వస్తాయి. ఎటువంటి ఆటంకాలు (పండగలు, సెలవులు, బందులు, సమ్మెలు) లేకుంటే  మీ పుస్తకాలు   ఐదురోజుల లోపల  మీ ఇంటికే వచ్చేస్తాయి. హైదరాబాదులో ఉండేవారికి  ఇంకా కొంచెం త్వరగా వస్తాయి..





ఇదిగోండి నేను ఆర్డర్ చేసిన పి. సత్యవతిగారి పుస్తకాలు భద్రంగా పాకింగ్ చేయబడి ,రెండు రోజుల్లో నా చేతిలో ఉన్నాయి.

మీకు క్రెడిట్, డెబిట్ కార్డులు లేవు, నెట్ బాంకింగ్ తెలీదు అంటారా? మీ స్నేహితులు సాయం తీసుకోండి.. ఇంకా మీకు ఎటువంటి సందేహాలు, సమస్యలున్నా ఈ చిరునామాకు మెయిల్ పెట్టండి.  support@kinige.com..

మరో విషయం మీరు ఈ పుస్తకాలను బహుమతిగా కూడా పంపవచ్చు.
kinige.com --> login --> profile --> send gift


 పుస్తకాన్ని మించిన , విలువైన బహుమతి ఏముంటుంది..

Thursday, October 18, 2012

యూనికోడ్ ఫాంట్లు / ఖతులు




అంతర్జాలంలో మనమంతా రాసేది యూనికోడ్ లో.అసలు ఈ యూనీకోడ్ అంటే ఏంటి? అంటే ఇక్కడ చూడండి.. యూనీకోడ్

మన కంప్యూటర్లో అందరికి తెలిసిన ఫాంట్ లేదా ఖతి గౌతమి మాత్రమే. ఇది విండోస్ వాడేవారికి డీఫాల్టుగా ఉంటుంది. అను సాఫ్ట్ వేర్ లో ఎన్నో అందమైన ఖతులు ఉన్నాయి కాని అవి మనం వాడలేము. కాని కొందరు ఔత్సాహికులు యూనికోడ్ లో వాడుకోవడానిక అనువుగా కొన్ని ఖతులు తయారు చేసారు. వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని మన సిస్టమ్ లో వేసుకుంటే మనం రాసుకున్న డాక్యుమెంట్ , పేర్లు, ఇంగ్లీషులోలాగే దాని ఫాంట్/ఖతి మార్చుకోవచ్చు.. మరి ఇవి ఎక్కడ లభిస్తాయి అంటారా?? క్రింద లింకులు చూడంఢి..

గౌతమి  : http://www.microsoft.com/typography/fonts/font.aspx?FMID=1570 

పోతన : http://www.kavya-nandanam.com/dload.htm.old

వేమన : http://www.kavya-nandanam.com/dload.htm.old

లోహిత్ తెలుగు : https://fedorahosted.org/releases/l/o/lohit/lohit-telugu-ttf-2.5.0.tar.gz


జిస్ట్ ఖతులు : http://www.aponline.gov.in/APPortal/TeluguSoftware/GIST-TT-Fonts/Installer.rar

వజ్రం : http://kinige.com/fonts/vajram/

 స్వర్ణ : http://kinige.com/kbook.php?id=1245&name=Suravara+Swarna+free+Telugu+Unicode+font


కొన్ని ఖతుల అందచందాలు పైన చిత్రంలో ఉన్నాయి చూడండి. జిస్ట్ ఖతులలో అమ్మ, అమృత, ఆత్రేయ, చందన,  ద్రౌపది, గోల్కొండ, కృష్ణ, మను, మేనక, పావని,  ప్రియ, రజని, సంజన, సితార, స్వామి, వెన్నెల మొదలైనవి ఉన్నాయి. ఇవి కూడా ఉపయోగించుకోవచ్చు.

ఇక ఈ ఫాంట్స్, ఖతులు ఎలా దింపుకుని మన కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకోవాలో చూద్దాం

1. ఈ లింకులను క్లిక్ చేసి ఆయా ఫాంట్లను డౌన్లోడ్ చేసి మీ సిస్టమ్లో ఒక చోట సేవ్ చేసుకోంఢి. జిప్ చేసి ఉంటే అన్ జిప్ చేసుకోండి..


2. మీ కంప్యూటర్లో  "Start " బటన్ ద్వారా "Control Panel"  లోకి వెళ్ళండి. అక్కడ "Fonts"  అనే ఎంపిక మీద మౌస్ డబల్ క్లిక్ చేయండి.

3. ఇంతకుముందు దింపుకున్న పాంట్లను (True Type Fonts) కాపీ చేసుకుని ఈ "Fonts" లో సేవ్ చేయండి.. అంతే కొత్త ఫాంట్స్/ ఖతులు మీ కంప్యూటర్లోకి వచ్చేసినట్టే..


4 మీకు కావల్సిన అప్ప్లికేషన్‌లో మిగతా ఖతులతో పాటు నూతన ఖతి కూడా ఉంటుంది.
               

చాలా ఈజీగా ఉంది కదా.. ఇంకెందుకు ఆలస్యం. తెచ్చేసుకోండి కొత్త ఖతులు..