Thursday, September 30, 2010

కొత్త బ్లాగర్లకు సూచనలు

కొత్తగా బ్లాగు మొదలెట్టాలని అనుకున్నారు. మంచిదే. బ్లాగర్ కి వెళ్ళి మీకంటూ ఒక సొంత బ్లాగు మొదలు పెట్టారు. అంతటితో పని పూర్తవ్వలేదుగా.. బ్లాగు రాయాలని నిర్ణయించుకున్నప్పుడు ముందు, తర్వాత కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే మంచిది. అవి ఏంటో యిపుడు చూద్దాం..


ముందుగా బ్లాగు మొదలెడుతున్నాం. దానికోసం మంచి శీర్షిక లేదా టైటిల్ ఆలోచించి పెట్టుకోండి. ఎదో ఒకటి పెడితే ఎలా?. మన బ్లాగు అంటే మన సొంతిల్లు లాంటిది. అందమైన ఇంటికి అందమైన పేరు ఉండాలిగా?. బ్లాగు మొదలుపెట్టేటప్పుడు టైటిల్ ఇంగ్లీషులో ఇచ్చినా తర్వాత సెట్టింగ్స్ లో తెలుగులోకి మార్చుకోవచ్చు. తెలుగు బ్లాగు పేరు కూడా తెలుగులోనే ఉంటే బావుంటుంది కదా. అలాగే దానికో అందమైన ట్యాగ్ లైన్ కూడా పెట్టండి. ఇంకా అందంగా ఉంటుంది. మరో విషయం. మీరు బ్లాగు మొదలుపెట్టేటప్పుడు బ్లాగు అడ్రస్ అదేనండి url కూడా అందరికి మీకు కూడా ఈజీగా గుర్తుండేట్టు, సింపుల్ గా ఉండేట్టు చూసుకోండి.
dashboard నుండి settings Formattingకి వెళ్ళండి. అక్కడ ముందుగా చేయవలసిన ముఖ్యమైన మార్పులు. ప్రతి పేజిలో మూడు నుండి ఐదు పోస్టులు మాత్రమే వచ్చేట్టు చూడండి. ఎక్కువ టపాలు ఉంటే మీ బ్లాగ్ ఓపన్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. తర్వాత మీ పోస్టు ప్రచురించే తేది, సమయం గురించి పైన చెప్పినట్టుగా మార్చుకోండి.ఇక కొత్త బ్లాగర్లు చేయవలసిన మరో ముఖ్యమైన పని.. కామెంట్లు రాసేవారికి పంటి కింది రాయిలా వచ్చే వర్డ్ వెరిఫికేషన్.
settings > comments విభాగంలో ఈ వర్డ్ వెరిఫికేషన్ కావాలా వద్దా అన్నదగ్గర వద్దు అనండి. అలాగే బ్లాగులో ఎవరైనా కామెంట్ రాయగానే మీకు తెలిసేట్టు మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఒకవేళ మీరు కామెంట్స్ మాడరేషన్ పెట్టుకోవాలనుకుంటే కూడా ఆ విధంగా మార్పు చేసుకోవచ్చు.

ఇక కొత్త బ్లాగర్లకు మరి కొన్ని సూచనలు.

బ్లాగు మొదలుపెట్టినందుకు అభినందనలు. ముందు మీరు ఏయే విషయాలు రాయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. అలా అని ఒకే విధమైన రాతలు రాయాలని కాదు. మీ బ్లాగు మీ ఇష్టం. ఏదైనా విషయం పై టపా రాయాలంటే ముందు దానికి సరిపోయే విధంగా, అందరిని ఆకట్టుకునే విధంగా ఉండేట్టు టైటిల్ ఎంచుకోండి. తర్వాత మీ టపా రాయండి. వీలయితే దానికో చిత్రం పెట్టండి. మర్చిపోకుండా ప్రతి టపాకు లేబిల్ లేదా వర్గం ఇవ్వండి. తర్వాత మీరు కాని మీ బ్లాగు చదివేవారు కానీ పాట టపాలు చదవాలంటే ఆ వర్గాలు చాలా ఉపయోగపడతాయి. మీరు బ్లాగు మొదలుపెట్టగానే అందరూ పొలోమని వచ్చేయరు కదా. మరి ఎలాగంటారా. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే... మీ బ్లాగులోనీ టపా రాసి కూర్చోకుండా మిగతా బ్లాగులకు వెళ్ళి టపాలు చదివి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. లేదంటే ఎందుకు నచ్చలేదో చెప్పండి. అలా చేస్తుంటే మీ గురించి పదిమందికి తెలుస్తుంది. మీ గురించి మీరే ఇరుగు పొరుగుకు పరిచయం చేసుకోవాలన్నమాట. మెల్లిగా ఇతర బ్లాగర్లు ఎవరా ఈ కొత్త వ్యక్తి అని మీ పేరు ఉన్న లంకె పట్టుకుని మీ బ్లాగుకు వచ్చి మీరు రాసిన టపా చదువుతారు. అలాగే మీ గురించి కొన్ని విషయాలు మీ ప్రొఫైల్ లో పెట్టండి. మరీ పర్సనల్ విషయాలు చెప్పొద్దు లెండి..

మరి మీరు రాసిన టపా అందరికి తెలియాలంటే ఎలా.. తెలుసుగా బ్లాగు సంకలినులు లేదా ఆగ్రిగేటర్లలో చేరాలి.


కూడలి ---- support@koodali.org
మాలిక -... admin@maalika.org
జల్లెడ --- http://dir.jalleda.com/index.php?show=add&PID=79

హారం --- http://haaram.com/Join.aspx
తెలుగు బ్లాగర్స్ ... http://www.telugubloggers.com/add-blog/

అగ్రిగేటర్స్ వివరాలు తెలుసుకున్నారుగా. మరి మీకు అప్పుడప్పుడు వచ్చే సందేహాలకు సమాధానాల కోసం , బ్లాగులకు, అంతర్జాలంలో తెలుగుకు సంబంధించిన చర్చలకోసం తెలుగు బ్లాగు గుంపులో చేరండి. http://groups.google.co.in/group/telugublog ఎవరో ఒకరు మీకు సమాధానమిస్తారు. సందేహాలు , సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తారు.

Friday, September 24, 2010

వార్తా పత్రికలలో వ్యాసాలు

వివిధ వార్తా పత్రికలలో ప్రచురించబడిన వ్యాసాలను కాపీ చేసుకుని సేవ్ చేసుకోవాలనుకుంటే కొన్ని సమస్యలున్నాయి. ఎందుకంటే ఆయా పత్రికల వాళ్ళు వాడే ఫాంట్ ,మనం నెట్ లో వాడే యూనికోడ్ వేర్వేరు కాబట్టి. ఆయా పత్రికల ఫాంట్లు దిగుమతి చేసుకుని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటే మనం సులువుగా ఆ తెలుగు లేదా ఏ భాషైనా చదవడానికి అనువుగా ఉంటుంది.


ఆ పత్రికలోని వ్యాసం కాపీ చేసుకుని మన బ్లాగులో కాని, నోట్ పాడ్ లో కాని సేవ్ చేసుకుంటే ఇలా అర్ధం కాని లిపి కనిపిస్తుంది. పేపర్లో చదివితే తెలుగులాగే ఉంటుంది. మరి ఇలా ఎందుకు అయినదంటారా?.. ఫాంట్ సమస్య.. మరి ఏం చేద్దామంటారు.


మంటనక్క వాడే వాళ్ళ కోసం ఒక చిన్న ట్రిక్కు ఉంది. పద్మ అనే ఆడాన్ దించుకుంటే సరి.
మన కంప్యూటర్లో పద్మ ఉన్నంత కాలం వివిధ తెలుగు వ్యాసాలను సులువుగా కాపీ చేసుకుని బ్లాగులో కాని నోట్ పాడ్ లో కాని సేవ్ చేసుకోవచ్చు. అంతే చాలా ఈజీ కదా.అలా కాదు మేము మంటనక్క వాడము అంటారా. ఐతే http://uni.medhas.org/ సైట్ కి వెళ్ళి మీకు కావలసిన పత్రికలను యూనికోడ్ లో చదవండి, కావలసిన వ్యాసాలు హాయిగా కాపీ చేసుకుని సేవ్ చేసుకోండి.


ఇక పత్రికలలో వచ్చిన వ్యాసాలు లేదా చిత్రాలను ఎలా సేవ్ చేసుకోవాలంటారా.. epaper లో పత్రికల పేజీలు ఇమేజ్ రూపంలో ఉంటాయి కాబట్టి ఈ ఫాంట్ గొడవ ఉండదు. మరి మనకు కావలసిన వ్యాసాలు ఎలా సేవ్ చేసుకోవాలంటారా. ముందుగా ఆ పత్రికలో మీకంటూ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత ఆ పేపర్ తెరిచి మీకు కావలసిన పేజికి వెళ్ళండి. అందులో మీకు కావలసిన వ్యాసం మీద క్లిక్ చేయండి. ఆ వ్యాసం మాత్రమే విడిగా కొత్త పేజిలో ఓపన్ అవుతుంది. అప్పుడు ఆ పేజి మీద రైట్ క్లిక్ చేసి ఇమేజ్ లా మీ సిస్టంలోకి సేవ్ చేస్కొండి. తర్వాత ఆ చిత్రాన్ని మామూలుగా మెయిల్ చేసుకోవచ్చు. బ్లాగులో కూడా పెట్టుకోవచ్చు. మొదట్లో కాస్త తికమకగా ఉంటుంది. ఒకటి రెండు సార్లు చేస్తే అదే ఈజీ అవుతుంది.

మరో విషయం.. కొన్ని పత్రికలలో మనకు కావలసిన ఆర్టికల్స్ ఇమేజ్ లా కాకుండా పిడిఎఫ్ వెర్షన్ కూడా సేవ్ చేసుకోవచ్చు. కానీ అన్నింటిలో ముందు మన అకౌంట్ క్రియేట్ చేసుకోవడం తప్పనిసరి..

Tuesday, September 14, 2010

మహిళలూ - ఇది మీకోసమే...
కంప్యూటర్, అంతర్జాలం సాంకేతిక నిపుణులకు, రచయితలకు, సాహిత్యాభిలాషులకు మాత్రమేనా. మరి ఇంట్లోఉండే మహిళలకు ఈ అంతర్జాలం ఎలా ఉపయోగపడుతుంది. ఇలా అంటే చాలా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఉద్యోగాలు చేసే మహిళలేకాదు ఇంట్లోఉండే గృహిణులు కూడా అంతర్జాలసాయంతో ఎన్నో నేర్చుకోవచ్చు. కాసింత ఆసక్తి, ఓపిక ఉంటే చాలు. ప్రపంచం మన నట్టింట్లో ఉన్నట్టే అని అర్ధమైపోతుంది. :)

మరి ఏమేం నేర్చుకోవచ్చో చూద్దాం.
మీకు గోరింటాకు పెట్టడం, పెట్టించుకోవడం ఇష్టమా? పార్లర్ కి వెళ్లినా. ఎవరితో పెట్టించుకుంటే బోలెడు డబ్బు కావాలి. వివిధరకాలైన గోరింటాకు పద్ధతులు ఇంట్లో ఉండే నేర్చుకుంటే డబ్బు ఆదా, సంతృప్తి లభిస్తుంది.వీడియోలు కూడా ఉన్నాయి..

ఈ సైట్లు చూడండి మీకే అర్ధమవుతుంది.

http://www.mehndistyles.com/

http://www.mehndidesigns.com/

http://www.hennamehndi.in/

http://www.youtube.com/watch?v=IO4RCnf-zD8ఫ్యాబ్రిక్ పెయింటింగ్

http://www.paintonfabric.com/freepattern.html

http://www.ethnicpaintings.com/painting-media/fabric-painting.html

http://www.metacafe.com/watch/2587818/fabric_painting/

http://www.youtube.com/watch?v=yu6bkKIVYnE

http://mumbai.olx.in/learn-fabric-painting-mueral-painting-pot-painting-and-canvas-painting-iid-9405231


మీకు కుట్లు, అల్లికలు ఇష్టమా? మంచి డిజైన్లు,కొత్త కొత్త కుట్లు నేర్చుకోవాలని ఉందా? ప్రతిదానికి వందలు పెట్టి పుస్తకాలు కొనాలా? అవసరం లేదు. ఇంటర్నెట్టు ముందు కూర్చుని ఓపిగ్గా వెతకండి. పుస్తకాలలో లేని కుట్లు,అల్లికలు డిజైన్లు దొరుకుతాయి. వీడియోలు కూడా చాలా ఉన్నాయి.

http://sadalas.blogspot.com/2010/01/badla-work-designs.html

http://www.embroiderersguild.com/stitch/projects/shisha/index.html

http://hand-embroidery.blogspot.com/2007/02/mirror-work.html

http://www.youtube.com/results?search_query=embroidery+&aq=f

http://www.sewingideas.com/

http://www.freeneedle.com/


మీకు కార్డులు, వాల్ హ్యాంగింగ్స్ లాంటి క్రాప్ట్స్ ఇష్టమా? కొనేబదులు ఇంట్లోనే చేసుకుంటే బావుంటుంది కదా? ఇంకెందుకు ఆలస్యం.


http://www.craftideas.info/

http://www.allfreecrafts.com/

http://www.craftsolutions.com/

http://www.mycraftbook.com/

http://www.craftideas.info/

http://www.webindia123.com/craft/paint/pot/potpaint.html

http://www.squidoo.com/painting-flower-pot


మీరు అందమైన కొవ్వొత్తులు ఇంట్లోనే తయారు చేయాలనుకుంటున్నారా. ఎలాగంటే...

http://www.pioneerthinking.com/candles.html

http://www.webindia123.com/craft/asp/craft.asp?c_id=258

http://www.youtube.com/watch?v=-IvwqjR8cbY

తంజావూరు పెయింటింగులు వేయడం చాలా కష్టం కదా. అసలు వాటిగురించిన సమగ్ర సమాచారం,వాటిని ఎలా వేయాలో తెలుసుకుందాం. అలాగే గ్లాస్ పెయింటింగ్ గురించి కూడా కనుక్కుందాం..

http://tanjorepaintingsart.blogspot.com/2007/11/method-of-making-thanjavur-paintings.html

http://www.youtube.com/watch?v=iDaDXd69--M

http://www.biggersglasspainting.com/

http://www.webindia123.com/craft/paint/glass/stain.html

http://video.google.com/videoplay?docid=-52771094177754212

http://www.ethnicpaintings.com/indian_painting_styles/glass/

ఇక అందరికి ఇష్టమైన వంటల గురించి మనకే తెలియని సైట్లు ఎన్నో ఉన్నాయి. భారతీయ వంటకాలను తెలిపే వివిధ వెబ్ సైట్లు ఇవి.

http://foodworld.redchillies.us/

http://www.sanjeevkapoor.com/

http://www.100topcookingsites.com/

http://www.tarladalal.com/

http://food.sify.com/

http://koodali.org/collections/cookery

ఇవేకాకుండా మీకు కావలసిన సమాచారం గూగులమ్మని అడిగితే వెంటనే ఇచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టండి మీ శోధన....

Thursday, September 2, 2010

యూనికోడ్ లో అను

అంతర్జాలంలో రాయడానికి మనం రాసే పధ్ధతి యూనికోడ్ అని అంటారు. అలాగే తెలుగు టైపింగ్ కోసం అను సాఫ్ట్ వేర్ వాడేవారికి కంప్యూటర్లో , బ్లాగులలో రాయడానికి లేఖిని, బరహ లాంటి ఫోనెటిక్ లే అవుట్లు వాడాల్సి ఉంటుంది. తమ వృత్తిరీత్యా అను వాడక తప్పనివారికి , ఈ ఫోనెటిక్ లే అవుట్ వాడడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాని ఇదే అను సాఫ్ట్ వేర్ తో యూనికోడ్ లో రాసే వీలు కల్పించారు వీవెన్. అనులో ప్రముఖంగా వాడే మాడ్యులర్ , యాపిల్ కీ బోర్డ్ లే అవుట్లను తయారు చేసారు. ఈ లే అవుట్లను తమ కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకోవడం వల్ల అను సాఫ్ట్ వేర్ తో సులభంగా టైప్ చేసుకోవచ్చు.ముందుగా ఇక్కడి నుండి మాడ్యులర్ కీ బోర్డ్ లే అవుట్ ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఆ జిప్ ఫెయిల్ ని అన్ జిప్ చేయండి. అందులోని setup ఫైల్ ని రన్ చేయండి. కొద్ది సేపట్లో మీ సిస్టంలో మాడ్యులర్ కీబోర్డ్ లే అవుట్ ఇన్స్టాల్ అవుతుంది. ఇక మీరు పైన ఇచ్చిన చిత్రంలో చూపిన విధంగా టైప్ చేసుకోవచ్చు. Left Alt + Shift. నొక్కి మీరు తెలుగు ఇంగ్లీషు భాషల్లోకి మారవచ్చు. మామూలుగా మీరు అను మాడ్యులర్ తో టైప్ చేసినట్టే కాని కొద్ది మార్పులు చేయాల్సి ఉంటుంది అంతే..అదే విధంగా కొందరు అనులో ఆపిల్ కీబోర్డ్ వాడుతుంటారు. మరి వాళ్ళు యూనికోడ్ లో టైప్ చేయాలంటే.. దానికి కూడా పరిష్కారం ఉంది.
ముందుగా ఇక్కడి నుండి ఆపిల్ కీబోర్డ్ లే అవుట్ ని డౌన్లోడ్ చేస్కొండి. జిప్ ఫైల్ ని అన్ జిప్ చేసి అందులోని setup ఫైల్ ని రన్ చేయండి. కొద్ది సేపట్లో మీ సిస్టంలో ఆపిల్ కీబోర్డ్ లే అవుట్ ఇన్స్టాల్ అవుతుంది. ఇక మీరు పైన ఇచ్చిన చిత్రంలో చూపిన విధంగా టైప్ చేసుకోవచ్చు.Left Alt + Shift. నొక్కి మీరు తెలుగు ఇంగ్లీషు భాషల్లోకి మారవచ్చు. మామూలుగా మీరు అను ఆపిల్ తో టైప్ చేసినట్టే కాని కొద్ది మార్పులు చేయాల్సి ఉంటుంది అంతే ..ఆపిల్ కీబోర్డ్ గురించి మరికొన్ని వివరాలు ఇక్కడ చూడండి..


అదే విధంగా అను లో మన దగ్గర ఉన్న సమాచారాన్ని చాలా సులువుగా యూనికోడ్ లోకి మార్చుకోవచ్చు. అను2యూనీకోడ్ కన్వర్టర్.