Thursday, November 26, 2009

కూడలి కబుర్లు - అంతర్జాతీయ బ్లాగర్ల సమావేశం

కూడలిలో కబుర్లు అనే ఆప్షన్ ఉంది చూసారా? బ్లాగర్లు ఎవరికీ వారు బ్లాగులు రాసుకుంటూ ఉన్నారు.హ్యాపీస్. కాని ఒకరికొకరు కామెంట్ల ద్వారానే పరిచయం, ముచ్చట జరుగుతుంది. కాని బ్లాగర్లు ఒక చోట చేరి చెప్పుకోవడానికి ఒక వేదిక కూడలి కబుర్లు. బ్లాగులకు సంబంధించిన సమస్యలైనా, మీ టపాలకు సంబందించిన సలహాలు, చర్చలు ఇక్కడ చేయవచ్చు. ఎవరికీ వీలైన సమయంలో వారు వచ్చి ఇతరులకు కూడా సాయం చేయవచ్చు.మరి ఈ కబుర్లు ఎక్కడ? ఎలా ? అంటారా? ఇది కూడలి కబుర్లు చిరునామా. http://chat.koodali.org/ ఈ చిరునామాకు వెళ్లి మీపేరు ఇచ్చి లోపలకు వెళ్లండి. కబుర్లు మొదలెట్టండి. కబుర్లకు ఒక ప్రాంగణం ఉంది కదా అని ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్లను నిషేదించబడతారు. వారి ఐ.పి అడ్రస్ తో కంప్లెయింటు చేసే సదుపాయం నిర్వాహకులకు ఉంది. ఈ సదుపాయం దుర్వినియోగం కాకూడదనే సదుద్దేశ్యంతో ఈ ఏర్పాటు చేయబడింది.

ముఖ్య ప్రకటన ::

ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండవ ఆదివారం బ్లాగర్ల దినోత్సవం గా జరుపబడుతుంది. అది హైదరాబాదులో ఘనంగా ఏర్పాటు చేయబడి, హైదరాబాదులో ఉన్నా బ్లాగర్లు వ్యక్తిగతంగా కలిసే అవకాశం కూడా ఈ సందర్భంగా కలుగుతుంది. కాని వేర్వేరు రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న తెలుగు బ్లాగర్ల సంగతేంటి ? అందుకే ఈ కూడలి కబుర్ల ప్రాంగణంలో అంతర్జాతీయ తెలుగు బ్లాగర్ల సమావేశం నిర్వహించబడుతుంది. గత సంవత్సరం విశేషాలు చూడండి.

ఈ సంవత్సరం డిసెంబర్ రెండవ ఆదివారం 13.12.09 హైదరాబాదులో బ్లాగర్ల సమావేశం నిర్వహించబడుతుంది.దానికి బ్లాగర్లు, చదువరులు, తెలుగు భాషాభిమానులు హాజరు కావొచ్చు.

అలాగే డిసెంబర్ నెలలో రెండవ శనివారం 12.12.09 కూడలి కబుర్లలో సాయంత్రం ఆరు గంటలకు (భారతీయ కాలమానం ప్రకారం) అంతర్జాతీయ తెలుగుబ్లాగర్ల సమావేశం ఏర్పాటు చేయడమైనది. అందరూ హాజరు కాగలరు.

Monday, November 23, 2009

కూడలి


కూడలి అంటే తెలీని బ్లాగరులు, బ్లాగులు చదివేవాళ్ళు ఉండరేమో. తెలుగు బ్లాగులు 2005 నుండి మొదలయ్యాయి అని చెప్పవచ్చు. కాని ఎవరు ఏ బ్లాగులో ఎప్పుడు రాసారు అని తెలియడం ఎలా?.. ఈ ప్రశ్నకు సమాధానంగా వీవెన్ మహాశయుడు (లేఖిని సృష్టికర్త) 21.6.06 రోజు బ్లాగులన్నీ ఒకచోట ఉండేలా ఒక సంకలిని (aggregator) మొదలుపెట్టారు.

ఇప్పుడు కూడలి విశేషాల గురించి తెలుసుకుందాం..
కూడలిలో వివిధ విభాగాల ఏర్పాటు చేయబడ్డాయి. బ్లాగులు, వార్తా పత్రికలూ, ఫోటో బ్లాగులు, సేకరణలు రాసే బ్లాగులు, చివరిలో తెలుగుబ్లాగర్ల ఇంగ్లీషు బ్లాగులు. అదేవిధంగా అన్నిబ్లాగులలో మరిన్ని విభాగాలు మనకు లభ్యమవుతాయి. సినిమా విశేషాల బ్లాగులు, సాహిత్యానికి సంబంధించిన బ్లాగులు, హాస్యం, సాంకేతికం, రాజకీయాల గురించి తరచూ రాసే బ్లాగులు . మనకు నచ్చిన విభాగంలోని బ్లాగులను చాలా సులువుగా చదవవచ్చు.
కూడలిలో ఉన్నా మరో ప్రత్యేకత ..ఫోటో బ్లాగులు. తెలుగు వారి ఫోటో బ్లాగులు ఇందులో పొందుపరచబడ్డాయి. కూడలి మొదటి పేజీలో ఈ ఫోటో బ్లాగులలోని ఏదో ఒక యాదృచ్చిక చిత్రం కనిపిస్తుంది. దానంతట అదే మారుతుంది కూడా.
ఈ మధ్య బ్లాగర్లందరూ ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారంగా అందించిన కూడలి నిర్వహణ గురించి తెలుసుకుందాం. కూడలి టైటిల్ దగ్గరలో నిర్వహణ అనే బటన్ క్లిక్ చేసి మీకు నచ్చని , చదవడానికి ఇష్టపడని బ్లాగుల చిరునామాలు చేర్చండి. మళ్ళీ మీరు కూడలి తెరిచినపుడు సదరు బ్లాగులు మీకు కూడలిలో కనపడవు. మీకు నచ్చిన బ్లాగులు మాత్రమే మీ కూడలిలో చూడవచ్చు.
మీరు బ్లాగు మొదలెట్టగానే దానిగురించి అందరికి తెలియాలి. మీరు టపా రాసినప్పుడు అందరూ వచ్చి చదవాలిగా.దానికి మీ బ్లాగు చిరునామాను కూడలిలో చేర్చండి. "కొత్త బ్లాగు చేర్చండి" ఆన్న చోట క్లిక్ చేసి అక్కడ చెప్పినట్టు ఫాలో అవ్వండి.


కూడలికి సంబంధించిన వివరాలకు ఇక్కడ చూడండి.

Saturday, November 7, 2009

పి.డి.ఎఫ్./ PDFPDF అంటే Portable Document Format.
మన దగ్గరున్న ఏదైనా సమాచారం కాని డాక్యుమెంట్ కాని భద్రపరుచుకోవడానికి ,సులువుగా పంపిణీ చేయడానికి ఆ సమాచారాన్ని పి.డి.ఎఫ్ చేస్తాము.అంటే ప్రతీ పేజీని ఒక చిత్రంలా భద్రపరచడం. దాన్ని పుస్తకంలా తయారు చేయడం. ఇలా చేయడం వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం.

* మన సమాచారాన్ని చిత్రంలా బంధించి , భద్రపరిచాము కాబట్టి అవతలి వారి కంప్యూటర్లో సులువుగా చూడగలుగుతారు. వాళ్లు ఎటువంటి సాఫ్ట్ వేర్,ఆపరేటింగ్ సిస్టం వాడినా సరే.

* మన ఫైలులో వాడిన బొమ్మలు,గుర్తులు,ఫాంట్లు ..ఎలాగున్నవి అలాగే మార్పులేకుండా చూడొచ్చు.మామూలు డాక్యుమెంట్ లా పంపిస్తే కొంచం కష్టమవుతుంది.

* ఈ పద్ధతిలో పంపిన సమాచారం ఎటువంటి ప్రింటర్ లో అయినా ప్రింట్ చేసుకోవచ్చు.

* ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్, పుస్తకాల పబ్లిషింగ్ కోసం పిడిఎఫ్ చేయడాం చాలా ఉపయోగకరమైనది.

* అంతర్జాలంలో ముఖ్యమైన సమాచారాన్ని పిడిఎఫ్ రూపంలో పెడితే దానిని కాపీ చేసుకోవడం కుదరదు.అదే మామూలుగా డాక్యుమెంట్ లా ఉంటే సులువుగా కాపీపేస్ట్ చేసుకోవచ్చు. కష్ట పడి తయారు చేసిన సమాచారాన్ని భద్రపరుచుకోవడానికి ఇది సులువైన మార్గం.

* ఇక తెలుగు విషయానికొస్తే... పుస్తకాలు,పత్రికలవాళ్ళు ఉపయోగించేది అను,శ్రీలిపి ఫాంట్లు.అవి యూనికోడ్ లో సరిగ్గా కనిపించవు.మళ్ళీ యునికోడ్ లో రాయాలంటే కష్టం.లేదా అవతలి వారి సిస్టంలో కూడా ఆ సాఫ్ట్ వేర్ ఉండాలి.అదే వ్యాసాలూ పిడిఎఫ్ చేసి పంపిస్తే ఎలాటి ఇబ్బంది లేకుండా చూడగలం. అందుకే పత్రిక రంగంలోని వారికి ఈ పధ్ధతి చాలా ఉపయోగకరమైనది.

* ఎక్స్.పి తర్వాత అన్ని ఆపరేటింగ్ సిస్టంలలో వాడే ఫాంట్ గౌతమి. కాని అంతకు ముందు వాడే ఆపరేటింగ్ సిస్టంలలో ఇది కనిపించదు. మరి ఎలా. మన వ్యాసం కాని ఉత్తరం కాని సమాచారం కాని వాళ్లు చదవాలంటే ఎలా. పిడిఎఫ్ చేసి పంపిస్తే చాలు. ఇందులో రాత మొత్తం బొమ్మలా మార్చబడుతుంది కాబట్టి ఇంచక్కా తెలుగులోనే కనిపిస్తుంది.

* మీరు బ్లాగులో ఒక విషయంపై పది టపాలు రాసారనుకోండి. వాటిని ఒక దగ్గర ప్రోగు చేసి ఒక డాక్యుమెంట్ లా లేదా పుస్తకం లా చేసి పెడితే బావుంటుంది కదా.ఎవరికైనా పంపించవచ్చు. డాక్యుమెంట్ పెద్దగా ఉంటుంది .చదవడం కష్టంగా ఉంటుంది.అదే పిడిఎఫ్ చేసి పంపితే పుస్తకంలా చదువుకుంటారు.

ఈ పిడిఎఫ్ ఎలా చేయాలి. ఎలా చదవాలి అనే విషయాలు ఇపుడు చూద్దాం.

మనకు ఒక పిడిఎఫ్ ఫైల్ వచ్చింది.లేదా చదవాలి . దానికోసం రీడర్ కావాలి. ఇది డౌన్లోడ్ చేసి మీ సిస్టం లో భద్రపరుచుకోండి.


Adobe Reader

Foxit Reader


పిడిఎఫ్ చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి.
1. Microsoft Word లో చిన్న యాడ్ ఆన్ చేరిస్తే మన డాక్యుమెంట్ తయారుకాగానే పిడిఎఫ్ లా వెంటనే చేసుకోవచ్చు.

2. Openoffice లో కూడా మన డాక్యుమెంట్ కాగానే పిడిఎఫ్ లా మార్చుకుని సేవ్ చేసుకోవచ్చు.

౩. Cute PDF writer

3. PDF converter

4. PDF995

5. Primo PDF

6.DoPDF


పిడిఎఫ్ గురించి మరికొన్ని ఉపయోగాలు

Wednesday, November 4, 2009

విస్టా, విండోస్ 7 లో తెలుగు సమస్య

నిన్న మామూలుగా జిమెయిల్ ఓపన్ చేయగానే అయోమయంలో పడ్డాను. అయ్యో తెలుగుకు ఏమైంది. తల, ముక్కు, కాళ్ళు , చేతులు అన్ని విడిపోయి కనిపిస్తున్నాయి. కొంపదీసి మంటనక్కతో ఈ జిమెయిల్ గొడవ పడిందా అని గూగులమ్మని అడిగి Flock తెచ్చుకుని వాడినా అలాగే కనిపిస్తుంది. మెయిల్ తప్ప మిగతా అన్నిచోట్లా తెలుగు బానే కనిపిస్తుంది. ఇదేం గొడవరా అనుకుని .. ఎందుకైనా మంచిది అని IE లో చూసా ( నాకు ఇదంటే అస్సలు పడదు.. నా స్పీడ్ కి తట్టుకోదు .సతాయిస్తుంది) సేమ్ ప్రాబ్లం. ఇప్పుడేంటి దారి. నేను వాడేది విండోస్ 7 , ఈ సమస్య నాకేనా, అది వాడేవారికి అందరికి వస్తుందా అని కొందరిని బుర్ర తినేసి , గెలికేస్తే అసలు సంగతి తెలిసింది.( ఎవరెట్లా పొతే నాకేంటి? నాకు తెలుగు కనపడాలి అంతే) XP లో ఎటువంటి సమస్య లేదు. ఇదిగోండి విస్టా, విండోస్ 7 లో తెలుగు సంబంధించి వస్తున్న సమస్యకు పరిష్కారం..


జీమెయిల్ వాడు తన Stylesheetలో "Arial Unicode MS" ఖతిని వాడటం మెదలుపెట్టాడు. ఆ ఖతిలో తెలుగు పాఠ్యానికి హల్లులు మరియు వత్తులూ విడిపోయి కనిపిస్తాయి.

పరిష్కారాలు:
 • మీ కంప్యూటరు నుండి Arial Unicode MS ఖతిని తొలగించండి. Delete Arial Unicode MS font from your computer.
  1. Type fonts in the Run Command (Windows Key + R or Click on Start menu then click on Run command)
  2. Delete font name Arial Unicode MS (True Type).
 • లేదా, మీ విహారిణికి మీరు చెప్పిన ఖతలను మాత్రమే వాడమని చెప్పండి. Firefoxలో అయితే ఇలా:
  • Goto Tools meu and then click on Options...
  • In the Content tab, click on the Advanced... button under the Fonts & Colors section.
  • From the Fonts For drop down select Telugu.
  • Then, select fonts of your choice from serif, sans-serif, etc dropdowns.
  • Uncheck the "Allow pages to choose their own [..]" check box


Veeven.


ఇది బ్లాగులకు సంబంధించిన విషయం కాకున్నా,మనం వాడే జిమెయిల్ కి తెలుగు సంబందించి వచ్చిన చిన్న తెగులు.