Wednesday, September 9, 2009

బ్లాగు మొదలెట్టడం

బ్లాగు అనేది మన ఆలోచనలను,అనుభవాలను,అనుభూతులను పదిలంగా దాచుకుని , పంచుకుని చర్చించుకుంటే పుస్తకం ,పత్రిక లాంటిది. మరి బ్లాగు ఎలా మొదలెట్టాలో చూద్దాం..


మందుగా blogger.com కి వెళ్లి మీ జిమెయిల్ , లేదా యాహూ మెయిల్ ఐడి తో బ్లాగు క్రియేట్ చేయండి.




మీ మెయిల్ ఐడి వివరాలు సరి చూసుకున్నాక పైన చూపించినట్టు మీ బ్లాగుకు ఒక అందమైన పేరును ఇవ్వండి. అలాగే దానికి కావలసిన చిరునామా కూడా. పేరు మార్చుకోవచ్చు కాని, చిరునామా మార్చలేము. మీరు అనుకున్న చిరునామా అందుబాటులో లేనప్పుడు మార్చి చూడండి.. అంతర్జాలంలో మీ బ్లాగు చిరునామా ఇదే . ఈ అడ్రస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా , ఎక్కడైనా మీ బ్లాగు తెరచి చూడొచ్చు.


తర్వాత మీ బ్లాగుకు అందమైన రూపాన్ని ఇవ్వండి. ఈ పని తర్వాత కూడా చేయొచ్చు. బ్లాగరు వాడు ఇచ్చిన మూసలే కాక వేరే మూసలు, హంగులు కూడా మన బ్లాగుకు జత చేయొచ్చు.



ఇప్పుడు బ్లాగు లో ఎం రాయాలి . ఎలా రాయాలి తెలుసుకుందాం. పైన బాక్స్ లో మీ టపా(పోస్ట్) కు టైటిల్ లేదా శీషిక ఇవ్వండి. మధ్యలో మీరు రాయాలనుకున్న విషయాలన్నీ రాసుకోండి. కుడివైపు ఉన్నా లేబిల్స్ బాక్స్ లో మీరు రాసే టపాకి ఇవ్వదలుచుకున్న వర్గం ఇవ్వండి. ఇది చాలా ముఖ్యమైనది. ఒక అంశం మీద రాసే టపాలన్నీ ఆ వర్గం లో ఉంటాయి.ఎప్పుడైనా అవసరం పడితే ,చదవాలనుకుంటే ఆ వర్గం లో వెతికితే సరి.. మొత్తం అయ్యాకా పబ్లిష్ అనే మీటను నొక్కండి. లేదా ఒక వేళ మీరు టపాని పూర్తి చేయలేదు, ఇంకా రాయాల్సి ఉంది అనుకుంటే డ్రాఫ్ట్ లా సేవ చేసుకోవచ్చు కూడా. మీ ఇష్టం.



పబ్లిష్ చేసాక మీ టపా ఇలా కనిపిస్తుంది. :)

2 వ్యాఖ్యలు:

pmrao said...

VERY CLEAR.THANK YOU

Unknown said...

very useful

Post a Comment