ఇంతవరకు లేఖిని మొదలైన ఉపకరణాలతో తెలుగు రాయడం తెలుసుకున్నాము. కాని వాటిలో రాసుకుని మనకు కావలసిన చోట కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా బరహ అనే సాఫ్ట్ వేర్ ని డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడైనా నేరుగా తెలుగులో రాయొచ్చు. నెట్ ఉన్నా లేకున్నా కూడా.
ముందుగా బరహ ని మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసుకుని , ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత పైన చూపించినట్టు Baraha direct, Baraha pad ఐకాన్స్ వస్తాయి. మొదటిది తెలుగుని మొదలుపెట్టడానికి. రెండోది మనం రాసుకోవడానికి ఉపయోగపడే ప్యాడ్ అన్నమాట.
Barha direct ని డబల్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కుడివైపు ఒక చిన్న ఐకాన్ వస్తుంది. డీఫాల్ట్ గా కన్నడ ఉంటుంది. దాన్ని రైట్ క్లిక్ చేసి Languages >Telugu> Unicode సెలెక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం ఇంగ్లీషులో టైప్ చేస్తుంటే అది ఆటోమేటిక్ గా తెలుగులోకి మారిపోతుంది. ఇలా మనం ఎక్కడైనా , జాలసంధానం ఉన్నా ,లేకున్నా తెలుగులో రాసుకోవచ్చు. తెలుగు బదులు ఇంగ్లీషులో రాయాలనుకున్నపుడు F11 క్లిక్ చేస్తే చాలు. మనం టైప్ చేసేదంతా ఇంగ్లీషులో వస్తుంది. మళ్ళీ తెలుగులో రాయాలంటే అదే F11 నొక్కాలి. భాషలు మారడానికి F11 మీట నొక్కితే చాలు.
తెలుగుని టైప్ చేయడానికి మనం ఉపయోగించే బరహ సాఫ్ట్ వేర్ తో MS-Wordలో తెలుగు టైప్ చేస్తుంటే సమాచారం బాక్సులుగా వస్తోందని చాలామంది చెబుతుంటారు.. Wordలోని Format మెనూలో Styles and Formatting అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన వెంటనే కుడిచేతి వైపు ప్రత్యక్షమయ్యే విభాగంలో New Style అనే బటన్ ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రత్యక్షమయ్యే బాక్సులో Formatting అనే బాక్స్ వద్ద Gautami అనే ఫాంట్ ని సెట్ చేసుకోవాలి. చివరిగా ఆ New Style డైలాగ్ బాక్స్ లోనే Add to Template అనే ఆప్షన్ టిక్ చేసి పెడితే ఇకపై Styles మెనూలో Style1 పేరిట ఆ కొత్త స్టైల్ వస్తుంది. ఇక ఎప్పుడు తెలుగులో టైప్ చేయాలన్నా ఆ కొత్త స్టైల్ ని ఎంచుకుంటే సరిపోతుంది. తెలుగు నేరుగా వచ్చేస్తుంది.
3 వ్యాఖ్యలు:
జ్యొతిగారు,
మీరు అందించిన సమాచారం చాలా ఉపయొగకరంగా ఉంది.
ఇంతక ముందు నా కంప్యుటరు లొ బరాహ ఇస్తాల్ చేసాను కాని తెలుగు లొ టైపు చేయడం రాలేదు. ఇప్పుడు ఇక్కడ మీ బ్లాగు చదివిన తరువాత తెలుగు టైపు చేయడం చాలా సులువుగా ఉంది.
ధన్యవాదములు,
రాము
జ్యొతి గారు,
నేను కంప్యూటర్ లొ తెలుగు లో రా స్తూన్నానంటే కలిగిన సంతొషం మొత్తం మీదీ ,
శుభాభినందనలు,
ధన్యవాదములు.
వసంత్
వసంత్ గారు, చాలా సంతోషం.. నేను చెప్తూనే ఉన్నాగా చాలా సింపుల్ అని.. మరి బ్లాగు ఎప్పుడు మొదలెడుతున్నారు.. అది కూడా ప్రారంభిస్తే ఓపనైపోతుందిగా...
Post a Comment