Showing posts with label ఉపయుక్తమైనవి. Show all posts
Showing posts with label ఉపయుక్తమైనవి. Show all posts

Friday, November 9, 2012

కినిగెలో పుస్తకాలు కొనండి "లా"

రాన్రానూ ప్రింట్ పుస్తకాలన్నీ కూడా ఎలక్ట్రానిక్ సోయగాలతో ఈ బుక్స్ గా మారిపోతున్నాయి. కినిగె వాటికి మరింత ప్రాచుర్యం కల్పించి దేశవిదేశాల్లో ఉన్న తెలుగు పుస్తక ప్రియులకు ఎన్నో పుస్తకాలను ఈ బుక్స్ గా మార్చి కొనుక్కొవడానికి, అద్దెకు తీసుకోవడానికి, బహుమతిగా ఇవ్వడానికి అందుబాటులో ఉంచింది..

నాకైతే పుస్తకాలను కంప్యూటర్లో చదవడం అస్సలిష్టం ఉండదు. హాయిగా పుస్తకం పట్టుకుని సోఫాలో తీరిగ్గా కూర్చుని పక్కన పకోడీలో, పునుకులో పెట్టుకుని ఒక్కోటి నములుతూ ఒక్కో పేజి తిప్పుతూ అందులో లీనమైపోయి చదవడం చాలా ఇష్టం. ఏదైనా పని ఉంటే పుస్తకాన్ని చదువుతూనే వెళ్లొచ్చు. వేరే రూమ్ లో కాని, వంటింట్లో కాని చదువుకోవచ్చు.. అస్తమానం కంప్యూటర్ ముందు కూర్చోవాలంటే కుదరదు కదా.. అందుకే కినిగె వారు నాలాటి వారికోసం, అచ్చు పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు వీటిని ఇంటినుండే ఆర్డర్ చేసి కొనుక్కోవచ్చు, మిత్రులకు, హితులకు బహుమతిగా కూడా ఇవ్వొచ్చు. అప్పుడప్పుడు పుస్తకాలమీద డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కినిగెవారు. మరి ఈ  ప్రింట్ పుస్తకాలను ఎలా కొనుగోలు చేయాలో వివరంగా చూద్దాం..



ముందుగా కినిగె సైట్ ఓపన్ చేయండి.. http://kinige.com/  ఇందులో print books, ebooks  ఆప్షన్స్ ఉంటాయి. అందులో print books  సెలెక్ట్ చేసుకోండి. ఒకేసారి ఎన్ని పుస్తకాలైనా తీసుకోవచ్చు. నేను రెండు పుస్తకాలకు ఆర్డర్ పెట్టాను.




కినిగె సైట్లో ఉన్న ప్రింట్ పుస్తకాలన్నీ చెక్ చేసుకుని మీకు నచ్చిన పుస్తకాన్ని లేదా  పుస్తకాలను సెలెక్ట్ చేసుకోండి..






మీరు ఒకటి లేదా రెండు పుస్తకాలు తీసుకునే బదులు ఎక్కువ పుస్తకాలు , కాస్త ఎక్కువ ధర పలికేవి తీసుకుంటే మీకు రవాణా చార్జీలు గిట్టుబాటు అవుతాయి..ఇప్పుడు నేను రెండు పుస్తకాలను సెలెక్ట్ చేసుకున్నాను. ఎప్పటికప్పుడు పుస్తకాలను సెలెక్ట్ చేసుకుని పైన cart (బండిలో)  పడేయండి.





అన్నీ ఎంపిక అయ్యాక cart ని క్లిక్ చేస్తే మీరు తీసుకోవాలనుకున్న పుస్తకాల పేర్లు, డిస్కౌంట్ తర్వాత వాటి ధరలు, రవాణా చార్జీలు కలిపి మొత్తం అమౌంట్ వస్తుంది. క్రింద మీ పుస్తకాలను  పంపాల్సిన చిరునామా ఇచ్చి ఆ సొమ్ముకు రీచార్జ్ చేయాలి.





 ఆ తర్వాత బిల్లింగ్  చిరునామా వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయాలి.




ఇప్పుడు మీరు ఆన్లైన్లో పుస్తకాల అమౌంట్ ను క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టవచ్చు.





డబ్బులు కట్టేసారుగా. మళ్లీ కినిగె సైటుకు రావాలి. ఇక్కడ మీ వివరాలన్ని చెక్ చేసుకుని Cart (బండి) దగ్గరకు వెళ్లి మీ పుస్తకాలకు ఆర్డర్ పూర్తి చేయాలి. అంటే ముందు డబ్బులు కట్టేసారు. ఇప్పుడు ఆర్డర్ పెడుతున్నారన్నమాట..





పైనల్ గా వివరాలు, చిరునామా చెక్ చేసుకుని ఆర్డర్ పెట్టేసేయండి. దాని వివరాలు మీ మెయిల్ కు కూడా వస్తాయి. ఎటువంటి ఆటంకాలు (పండగలు, సెలవులు, బందులు, సమ్మెలు) లేకుంటే  మీ పుస్తకాలు   ఐదురోజుల లోపల  మీ ఇంటికే వచ్చేస్తాయి. హైదరాబాదులో ఉండేవారికి  ఇంకా కొంచెం త్వరగా వస్తాయి..





ఇదిగోండి నేను ఆర్డర్ చేసిన పి. సత్యవతిగారి పుస్తకాలు భద్రంగా పాకింగ్ చేయబడి ,రెండు రోజుల్లో నా చేతిలో ఉన్నాయి.

మీకు క్రెడిట్, డెబిట్ కార్డులు లేవు, నెట్ బాంకింగ్ తెలీదు అంటారా? మీ స్నేహితులు సాయం తీసుకోండి.. ఇంకా మీకు ఎటువంటి సందేహాలు, సమస్యలున్నా ఈ చిరునామాకు మెయిల్ పెట్టండి.  support@kinige.com..

మరో విషయం మీరు ఈ పుస్తకాలను బహుమతిగా కూడా పంపవచ్చు.
kinige.com --> login --> profile --> send gift


 పుస్తకాన్ని మించిన , విలువైన బహుమతి ఏముంటుంది..

Wednesday, December 28, 2011

Skype - ఎలా ఉపయోగించుకోవాలి??

Skype యిపుడు ఇంటర్నెట్ వాడేవారందరూ ఉపయోగించే మాట . సదుపాయం. ఎవరికైనా కాల్ చేసి మాట్లాడాలంటే ఫోన్ చార్జెస్ పడతాయి. లోకల్ అంటే తక్కువే కాని వేరే ఊర్లలో, రాష్ట్రాలలో , దేశాలలో ఉన్నవారితో ఫోన్లో మాట్లాడాలంటే బిల్లు పేలిపోతుంది. దానితో మన స్నేహితులు, బంధువులతో తరచూ మాట్లాడాలంటే భయమేస్తుంది తర్వాత వచ్చే బిల్లును తలచుకుంటే. కాని ఇంటర్నెట్ ద్వారా చాలా సులువుగా, ఖర్చు లేకుండా ఎంతసేపైన మాట్లాడుకోవచ్చు. ఒకేసారి ఒకరితో కాకుండా నలుగురైదుగురు కలిసి గ్రూప్ గా మాట్లాడ్డం, లేదా చర్చించడం చెయొచ్చు. ఇద్దరికి Skype అకౌంట్ ఉంటే ఫ్రీగా ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. అలాగే చాలా తక్కువ సొమ్ముతో లాండ్ లైన్, మొబైల్స్ కి కూడా కాల్ చెయొచ్చు... అంటే కాదండోయ్.. International Toll Free Numbers కి కూడా ఉచితంగా కాల్ చేసి ముచ్చట్లేసుకోవచ్చు.. ఎలాగంటారా?? అది ఎలాగో చూద్దాం..


ముందుగా Skype సైట్ కి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. http://www.skype.com/intl/en/home


ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవ్వడానికి కొంచం టైం పడుతుంది ఖంగారు పడకండి.. మొత్తం డౌన్లోడ్ అయ్యాక install చేసుకోండి.




ముందుగా మీరు కనెక్ట్ చేసిన హెడ్ ఫాన్స్, మైకు, స్పీకర్స్ అన్ని సరి చూసుకోండి. ఇక తర్వాత రంగంలోకి దిగడమే..

ఆ తర్వాత Skype లో మీకంటూ ఓ అకౌంట్ క్రియేట్ చేసుకోండి.



యిపుడు మీ desktop మీద Skype బొత్తాం (icon) కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకున్న ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.




లాగిన్ అయ్యారుగా ఇక మీ స్నేహితులను ఒక్కొక్కరిని ఆడ్ చేసుకోండి.




అందరిని ఆడ్ చేసుకున్న తర్వాత ఇలా లిస్టు కనిపిస్తుంది. మీరు మాట్లాడాలనుకున్నవారితో అలుపొచ్చేదాకా మాట్లాడండి .

Sunday, February 20, 2011

పెన్ డ్రైవ్ ఎలా తయారు చేస్తారో తెలుసా??

మన రోజువారి కంప్యూటర్ ఉపయోగంలో పెన్ డ్రైవ్ చాలా ప్రముఖమైనది.. డేటా దాచుకోవడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ చిన్ని పెన్ డ్రైవ్ అసలు ఎలా తయారు చేస్తారో తెలుసా.. ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతుంది. మనకు సులువుగా అర్ధమయ్యేలా తెలుగులో వివరిస్తున్నారు శ్రీ నల్లమోతు శ్రీధర్..


Thursday, October 7, 2010

screenshot/తెరపట్టు

నెట్ మీద పని చేస్తున్నపుడు మీకు ఏదైనా మ్యాటర్ కాని చిత్రం కాని నచ్చుతుంది.లేదా అవసరమవుతుంది. అది మీ సిస్టం లో సేవ్ చేసుకోవాలంటే ఎలా?. లేదా మీకు కంప్యూటర్ వాడకంలో వచ్చిన సమస్య ఎవరికైనా చెప్పాలి, చూపించాలి అంటే యిపుడు? వీటన్నింటికి సులువైన సమాధానం screenshot లేదా తెరపట్టు. మీకు కావలసిన అంశాన్ని అలాగే చిత్రంలా మార్చిప్ సేవ్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం..

మీ కీబోర్డ్ లో కుడివైపు అన్నిటికంటే పైన ఉన్న లైన్లో చూడండి. F కీస్ పక్కన printscreen అనే కీ ఉంటుంది. మీకు కావలసిన పేజికి వెళ్ళి కీ ని నొక్కండి. అపుడు పేజి ఒక ఇమేజ్ లా సేవ్ అయిందన్నమాట.






యిపుడు start మెనూలో paint ఓపన్ చేసి అక్కడ మౌసే రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేయండి.ఇంతకు ముందు మీరు screenshot తీసుకున్నా చిత్రం అక్కడ ప్రత్యక్షమవుతుంది. దానికి ఒక పేరు ఇచ్చి సేవ్ చేసుకోండి.


మళ్ళీ ఆ చిత్రాన్ని మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్ లో ఓపన్ చేసి అనవసరమైన భాగం కట్ చేసి సేవ్ చేసుకోండి . యిపుడు మీకు కావలసిన చిత్రం తయారుగా ఉంది. ఒక్క విషయం ఎపుడు కూడా jpeg లేదా png లో సేవ్ చేసుకోండి.




యిపుడు windows7 లో snipping tool సాయంతో ఇంత కష్టపడకుండా చాల సులువుగా screenshot తీసుకోవచ్చు. start మెనూ నుండి snipping tool సెలెక్ట్ చేసుకుని మీకు కావలసిన మ్యాటర్ లేదా చిత్రాన్ని screenshot తీసుకోండి. మీరు ఆ పేజిలోనే కావలసినంత మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు.



మీరు సెలెక్ట్ చేసుకున్నా భాగాన్ని సేవ్ చేసుకోండి అంతే...

Tuesday, September 14, 2010

మహిళలూ - ఇది మీకోసమే...




కంప్యూటర్, అంతర్జాలం సాంకేతిక నిపుణులకు, రచయితలకు, సాహిత్యాభిలాషులకు మాత్రమేనా. మరి ఇంట్లోఉండే మహిళలకు ఈ అంతర్జాలం ఎలా ఉపయోగపడుతుంది. ఇలా అంటే చాలా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఉద్యోగాలు చేసే మహిళలేకాదు ఇంట్లోఉండే గృహిణులు కూడా అంతర్జాలసాయంతో ఎన్నో నేర్చుకోవచ్చు. కాసింత ఆసక్తి, ఓపిక ఉంటే చాలు. ప్రపంచం మన నట్టింట్లో ఉన్నట్టే అని అర్ధమైపోతుంది. :)

మరి ఏమేం నేర్చుకోవచ్చో చూద్దాం.
మీకు గోరింటాకు పెట్టడం, పెట్టించుకోవడం ఇష్టమా? పార్లర్ కి వెళ్లినా. ఎవరితో పెట్టించుకుంటే బోలెడు డబ్బు కావాలి. వివిధరకాలైన గోరింటాకు పద్ధతులు ఇంట్లో ఉండే నేర్చుకుంటే డబ్బు ఆదా, సంతృప్తి లభిస్తుంది.వీడియోలు కూడా ఉన్నాయి..

ఈ సైట్లు చూడండి మీకే అర్ధమవుతుంది.

http://www.mehndistyles.com/

http://www.mehndidesigns.com/

http://www.hennamehndi.in/

http://www.youtube.com/watch?v=IO4RCnf-zD8



ఫ్యాబ్రిక్ పెయింటింగ్

http://www.paintonfabric.com/freepattern.html

http://www.ethnicpaintings.com/painting-media/fabric-painting.html

http://www.metacafe.com/watch/2587818/fabric_painting/

http://www.youtube.com/watch?v=yu6bkKIVYnE

http://mumbai.olx.in/learn-fabric-painting-mueral-painting-pot-painting-and-canvas-painting-iid-9405231


మీకు కుట్లు, అల్లికలు ఇష్టమా? మంచి డిజైన్లు,కొత్త కొత్త కుట్లు నేర్చుకోవాలని ఉందా? ప్రతిదానికి వందలు పెట్టి పుస్తకాలు కొనాలా? అవసరం లేదు. ఇంటర్నెట్టు ముందు కూర్చుని ఓపిగ్గా వెతకండి. పుస్తకాలలో లేని కుట్లు,అల్లికలు డిజైన్లు దొరుకుతాయి. వీడియోలు కూడా చాలా ఉన్నాయి.

http://sadalas.blogspot.com/2010/01/badla-work-designs.html

http://www.embroiderersguild.com/stitch/projects/shisha/index.html

http://hand-embroidery.blogspot.com/2007/02/mirror-work.html

http://www.youtube.com/results?search_query=embroidery+&aq=f

http://www.sewingideas.com/

http://www.freeneedle.com/


మీకు కార్డులు, వాల్ హ్యాంగింగ్స్ లాంటి క్రాప్ట్స్ ఇష్టమా? కొనేబదులు ఇంట్లోనే చేసుకుంటే బావుంటుంది కదా? ఇంకెందుకు ఆలస్యం.


http://www.craftideas.info/

http://www.allfreecrafts.com/

http://www.craftsolutions.com/

http://www.mycraftbook.com/

http://www.craftideas.info/

http://www.webindia123.com/craft/paint/pot/potpaint.html

http://www.squidoo.com/painting-flower-pot


మీరు అందమైన కొవ్వొత్తులు ఇంట్లోనే తయారు చేయాలనుకుంటున్నారా. ఎలాగంటే...

http://www.pioneerthinking.com/candles.html

http://www.webindia123.com/craft/asp/craft.asp?c_id=258

http://www.youtube.com/watch?v=-IvwqjR8cbY

తంజావూరు పెయింటింగులు వేయడం చాలా కష్టం కదా. అసలు వాటిగురించిన సమగ్ర సమాచారం,వాటిని ఎలా వేయాలో తెలుసుకుందాం. అలాగే గ్లాస్ పెయింటింగ్ గురించి కూడా కనుక్కుందాం..

http://tanjorepaintingsart.blogspot.com/2007/11/method-of-making-thanjavur-paintings.html

http://www.youtube.com/watch?v=iDaDXd69--M

http://www.biggersglasspainting.com/

http://www.webindia123.com/craft/paint/glass/stain.html

http://video.google.com/videoplay?docid=-52771094177754212

http://www.ethnicpaintings.com/indian_painting_styles/glass/

ఇక అందరికి ఇష్టమైన వంటల గురించి మనకే తెలియని సైట్లు ఎన్నో ఉన్నాయి. భారతీయ వంటకాలను తెలిపే వివిధ వెబ్ సైట్లు ఇవి.

http://foodworld.redchillies.us/

http://www.sanjeevkapoor.com/

http://www.100topcookingsites.com/

http://www.tarladalal.com/

http://food.sify.com/

http://koodali.org/collections/cookery

ఇవేకాకుండా మీకు కావలసిన సమాచారం గూగులమ్మని అడిగితే వెంటనే ఇచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టండి మీ శోధన....