Showing posts with label బ్లాగు పాఠాలు. Show all posts
Showing posts with label బ్లాగు పాఠాలు. Show all posts

Monday, December 12, 2011

బ్లాగ్ ఎంట్రీపాస్ మార్చాలా?

బ్లాగు మొదలెట్టినపుడు ఒక మెయిల్ ఐడి ఇస్తాం కదా. అది జిమెయిల్ కావొచ్చు, యాహూ మెయిల్ లేదా రెడిఫ్ మెయిల్ కావొచ్చు. ఒక్కోసారి ఒకే మెయిల్ ఐడి తో ఎన్ని బ్లాగులైన మొదలెట్టవచ్చు అని తెలీక కూడా వేర్వేరు ఐడిలు క్రియేట్ చేసి బ్లాగులు ఓపన్ చేస్తుంటారు. (నేను మొదట్లో ఇలాగే చేసాను).. మనం జి మెయిల్ లో ఉండి యాహూ ఐడి తో ఉన్న బ్లాగు ఓపన్ చేయాలంటే వేరే బ్రౌజర్ లో ఓపన్ చేయాలి లేదంటే బ్లాగు ఓపన్ చేయగానే జిమెయిల్ ఎగిరిపోతుంది . ఒకటి కంటే ఎక్కువ బ్లాగులు ఉన్నపుడు వేర్వేరు బ్లాగులకు వేర్వేరు ఐడి పాస్వర్డ్ లు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. చిరాకేస్తుంది కూడా. అలాంటప్పుడు ఏం చేయాలి??.. దీనికి పరిష్కారం లేదా అంటే...

ఉంది కింద చెప్పినట్టుగా చేసి మీ బ్లాగులన్నీ ఒకే ఐడి గూటి కిందకు తెచ్చుకోండి..

ముందుగా మీరు మీ ఐడి తో మొదలెట్టిన బ్లాగు లో కి ప్రవేశించండి. లాగిన్ అయ్యాక settings > permissions క్లిక్ చేయాలి. అక్కడ బ్లాగుకు వేర్వేరు author లను ఆడ్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ బ్లాగు లాగిన్ కి చేర్చాలనుకున్న మెయిన్ మెయిల్ ఐడి (gmail, yahoo , rediff) ఇచ్చి ఆహ్వానించండి.

మీ ఇతర ఐడి లోకి వెళ్ళితే ఇలా ఆహ్వానం ఉంటుంది అది అంగీకరించండి.

యిపుడు మీరు మార్చాలనుకున్న ఐడి కి మీ బ్లాగు చేర్చబడింది.


మళ్ళీ వెనక్కి రండి.. మీ పాత బ్లాగు ఐడి తో లాగిన్ ఐన పేజిలోని permissions పేజికి వెళ్ళి మీరు ఇచ్చిన ఇంకో ఐడి కి ఆడ్మిన్ హక్కులు ఇవ్వండి.



ఇప్పుడు ఒకసారి మీ మెయిన్ ఐడి తో లాగిన్ అయ్యి dashboard ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. మీ బ్లాగు ఇక్కడికి క్షేమంగా చేరింది అని నిర్ధారణ అయ్యాక మొదటి మెయిల్ ఐడి పేజిలో ఆ ఐడి తీసేయండి. అంటే మీరు ఒకేసారి రెండు పేజీల్లో పని చేయాల్సి ఉంటుంది. ఒకేసారి చేయడం తికమకగా ఉంటే.. ఇలా అడ్రస్ మార్చాక రెండు రోజులు కొత్త మెయిన్ ఐడి తో లాగిన్ అయ్యి పని చేసుకోండి. తర్వాత పాత ఐడి తీసేయండి..

ఇలా మీరు వేర్వేరు ఐడి లతో ఉన్న బ్లాగులన్నీ ఒకే మెయిల్ ఐడి కి మార్చుకోవచ్చు.

Sunday, January 30, 2011

బ్లాగులో నిశ్చల పేజీలు (static pages)

బ్లాగులో మామూలుగా టపాలు రాసి పబ్లిష్ చేస్తాము. కాని కొన్ని విషయాలు, టపాలు ఎప్పటికి కనపడేలా, కదలకుండా ఉండాలని అనుకుంటాము. వాటిని ఎలా సెట్ చేసుకోవడం. ప్రతీసారి ఆ పేజిని, సమాచారాన్ని వెతుక్కోవాలంటే కష్టం కదా. దానికోసమే బ్లాగులో పేజెస్ అనే సదుపాయం కల్పించబడింది. ఈ పేజీలలో మీకు కావలసిన, ముఖ్యం అనుకున్న సమాచారాన్ని పొందుపరచుకోవచ్చు. ఇది బ్లాగులో ఎప్పటికి కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎన్ని వందల టపాలు రాసినా సరే. ఈ పేజిలలో మీ గురించి, మీ వృత్తి మొదలైన సమాచారం, మిమ్మల్ని సంప్రదించడం ఎలా మొదలైన అంశాలు ఈ పేజీలలో భద్రపరచవచ్చు. మీ బ్లాగు పాఠకులు ఆ పేజీలు క్లిక్ చేయగానే ఆ సమాచారం సులువుగా చదువుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ పేజీలు ఎలా సృష్టించాలో తెలుసుకుందాం...

ముందుగా http://draft.blogger.com/ లో ఎప్పటిలాగే మీ వివరాలు ఇచ్చి లాగిన్ అవ్వండి. తర్వాత edit posts క్లిక్ చేస్తే పైన లా కనిపిస్తుంది కదా. అపుడు edit pages క్లిక్ చేయండి.


ఇప్పుడు new page క్లిక్ చేయండి. ఇక మీరు కొత్త పేజి తయారు చేసుకోవాలి .


ఈ పేజి మనం బ్లాగు రాసినట్టుగానే ఉంటుంది. కాని ఒక్కటే తేడా ఏంటి అంటే తేది, లేబిల్ లేదా వర్గం ఉండదు. బ్లాగు పోస్టు లాగే టైటిల్, కంటెంట్ రాసి పబ్లిష్ చేయండి. ఇందులో చిత్రాలు, లింకులు గట్రా ఇవ్వొచ్చు.


పబ్లిష్ చేసిన తర్వాత మన బ్లాగులో పైన ఇలా కనిపిస్తుంది. అందులో వేర్వేరు పేజీలను క్లిక్ చేస్తే అందులో ఉన్న సమాచారాన్ని చూడవచ్చు.



ఈ పేజీలు సృష్టించాక దాన్ని బ్లాగులో సైడ్ బార్ లేదా పైన హెడర్ కింద కాని, పోస్ట్ పైన కాని పెట్టుకోవచ్చు. ఆ పేజి ఎలిమెంట్ ని మనకు నచ్చినట్టుగా జరుపుకుని సేవ్ చేసుకోవాలి.



మీరు పేజీల లిస్టు చూసినపుడు ఇలా కనిపిస్తుంది. సుమారు పది పేజీల వరకు సృష్టించుకోవచ్చు. కావలసినపుడు edit , delete చేసుకోవచ్చు.


మీరు కాస్త సాంకేతిక నిపుణులు ఐతే ఈ పేజీలకు మార్పులు కూడా చేసుకోవచ్చు. ఇదిగో ఇలా..

మీ బ్లాగు లేబిల్స్ ని పేజీలుగా మార్చాలనుకుంటే ఇది ప్రయత్నించండి. నేను ట్రై చేయలేదు మరి..

Wednesday, November 10, 2010

మీ బ్లాగు టపాలో అందమైన స్మైలీలు కావాలా???

మీరు గమనించే ఉంటారు. ఈ మధ్య కొన్ని బ్లాగుల్లో అందమైన బుల్లి స్మైలీలు కనపడుతున్నాయి. మరి మీ బ్లాగు టపాల్లో కూడా అలా కావాలనుకుంటున్నారా? ఐతే సరే .. ఇలా కొన్ని మార్పులు చేయండి..

ఇక్కడో తిరకాసు ఉంది. ఈ స్మైలీలు మంటనక్క వాడేవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా బ్రౌజర్లలో కూడా ప్రయత్నించి తర్వాత చెప్తాను.

1. ముందుగా మీరు Firefox బ్రౌజర్ ఓపన్ చేసి Grease Monkey అనే add-on ఇన్స్టాల్ చేసుకోండి. బ్రౌజర్ రీస్టార్ట్ చేయండి.

2.తర్వాత ఈ javascript ఫైల్ ఇన్స్టాల్ చేసుకోండి.

3. ఇప్పుడు మీరు Design విభాగంలోకి వెళ్లి Edit Html కి వెళ్లండి. ఇక్కడ మీరు మీ బ్లాగుయొక్క పూర్తి Html కోడ్ కనిపిస్తుంది . ఇక్కడ మీరు ]]></b:skin> కోడ్ వెతకండి.తొందరగా దొరకట్లేదు. అస్సలేమీ అర్ధం కావట్లేదు అంటారా?? ఒక సులువైన మార్గం చెప్తాను. Edit Html వెళ్లాక Ctrl F నొక్కండి. మీకు సెర్చ్ బాక్స్ వస్తుంది. అందులో పైన చెప్పిన కోడ్ కాపీ పేస్ట్ చేయండి. వెంటనే మీకు అది కనిపిస్తుంది.

4. ఇప్పుడు ఈ క్రింది CSS code ని ఇంతకు ముందు చెప్పిన కోడ్ ( ]]></b:skin> ) పైన పేస్ట్ చేసి సేవ్ చేయండి.

img.emoticon {
padding: 0;
margin: 0;
border: 0;
}

5. అంతే మీ బ్లాగులో ఎన్నో అందమైన స్మైలీలు పెట్టుకునే సులువైన సదుపాయం కల్పించబడింది. కొత్త పోస్ట్ రాసేటప్పుడు, పాత పోస్టు మార్పులు చేసేటప్పుడు ఇలా బాక్స్ కనిపిస్తుంది. మీకు కావలసిన స్మైలీ చేర్చుకోండి.



మరో విధానం కూడా ఉంది.
ఇందాకటి లాగే Design > Edit Html కి వెళ్లండి. అక్కడ Ctrl F తో సెర్చ్ బాక్స్ తెచ్చుకుని head వెతకండి. దానిపైన ఈ కోడ్ పేస్ట్ చేసి సేవ్ చేయండి. అంతే మీ బ్లాగు టపాలో కూల్ కూల్ స్మైలీస్ వస్తాయి..

Thursday, September 30, 2010

కొత్త బ్లాగర్లకు సూచనలు

కొత్తగా బ్లాగు మొదలెట్టాలని అనుకున్నారు. మంచిదే. బ్లాగర్ కి వెళ్ళి మీకంటూ ఒక సొంత బ్లాగు మొదలు పెట్టారు. అంతటితో పని పూర్తవ్వలేదుగా.. బ్లాగు రాయాలని నిర్ణయించుకున్నప్పుడు ముందు, తర్వాత కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే మంచిది. అవి ఏంటో యిపుడు చూద్దాం..


ముందుగా బ్లాగు మొదలెడుతున్నాం. దానికోసం మంచి శీర్షిక లేదా టైటిల్ ఆలోచించి పెట్టుకోండి. ఎదో ఒకటి పెడితే ఎలా?. మన బ్లాగు అంటే మన సొంతిల్లు లాంటిది. అందమైన ఇంటికి అందమైన పేరు ఉండాలిగా?. బ్లాగు మొదలుపెట్టేటప్పుడు టైటిల్ ఇంగ్లీషులో ఇచ్చినా తర్వాత సెట్టింగ్స్ లో తెలుగులోకి మార్చుకోవచ్చు. తెలుగు బ్లాగు పేరు కూడా తెలుగులోనే ఉంటే బావుంటుంది కదా. అలాగే దానికో అందమైన ట్యాగ్ లైన్ కూడా పెట్టండి. ఇంకా అందంగా ఉంటుంది. మరో విషయం. మీరు బ్లాగు మొదలుపెట్టేటప్పుడు బ్లాగు అడ్రస్ అదేనండి url కూడా అందరికి మీకు కూడా ఈజీగా గుర్తుండేట్టు, సింపుల్ గా ఉండేట్టు చూసుకోండి.




dashboard నుండి settings Formattingకి వెళ్ళండి. అక్కడ ముందుగా చేయవలసిన ముఖ్యమైన మార్పులు. ప్రతి పేజిలో మూడు నుండి ఐదు పోస్టులు మాత్రమే వచ్చేట్టు చూడండి. ఎక్కువ టపాలు ఉంటే మీ బ్లాగ్ ఓపన్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. తర్వాత మీ పోస్టు ప్రచురించే తేది, సమయం గురించి పైన చెప్పినట్టుగా మార్చుకోండి.



ఇక కొత్త బ్లాగర్లు చేయవలసిన మరో ముఖ్యమైన పని.. కామెంట్లు రాసేవారికి పంటి కింది రాయిలా వచ్చే వర్డ్ వెరిఫికేషన్.
settings > comments విభాగంలో ఈ వర్డ్ వెరిఫికేషన్ కావాలా వద్దా అన్నదగ్గర వద్దు అనండి. అలాగే బ్లాగులో ఎవరైనా కామెంట్ రాయగానే మీకు తెలిసేట్టు మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఒకవేళ మీరు కామెంట్స్ మాడరేషన్ పెట్టుకోవాలనుకుంటే కూడా ఆ విధంగా మార్పు చేసుకోవచ్చు.

ఇక కొత్త బ్లాగర్లకు మరి కొన్ని సూచనలు.

బ్లాగు మొదలుపెట్టినందుకు అభినందనలు. ముందు మీరు ఏయే విషయాలు రాయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. అలా అని ఒకే విధమైన రాతలు రాయాలని కాదు. మీ బ్లాగు మీ ఇష్టం. ఏదైనా విషయం పై టపా రాయాలంటే ముందు దానికి సరిపోయే విధంగా, అందరిని ఆకట్టుకునే విధంగా ఉండేట్టు టైటిల్ ఎంచుకోండి. తర్వాత మీ టపా రాయండి. వీలయితే దానికో చిత్రం పెట్టండి. మర్చిపోకుండా ప్రతి టపాకు లేబిల్ లేదా వర్గం ఇవ్వండి. తర్వాత మీరు కాని మీ బ్లాగు చదివేవారు కానీ పాట టపాలు చదవాలంటే ఆ వర్గాలు చాలా ఉపయోగపడతాయి. మీరు బ్లాగు మొదలుపెట్టగానే అందరూ పొలోమని వచ్చేయరు కదా. మరి ఎలాగంటారా. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే... మీ బ్లాగులోనీ టపా రాసి కూర్చోకుండా మిగతా బ్లాగులకు వెళ్ళి టపాలు చదివి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. లేదంటే ఎందుకు నచ్చలేదో చెప్పండి. అలా చేస్తుంటే మీ గురించి పదిమందికి తెలుస్తుంది. మీ గురించి మీరే ఇరుగు పొరుగుకు పరిచయం చేసుకోవాలన్నమాట. మెల్లిగా ఇతర బ్లాగర్లు ఎవరా ఈ కొత్త వ్యక్తి అని మీ పేరు ఉన్న లంకె పట్టుకుని మీ బ్లాగుకు వచ్చి మీరు రాసిన టపా చదువుతారు. అలాగే మీ గురించి కొన్ని విషయాలు మీ ప్రొఫైల్ లో పెట్టండి. మరీ పర్సనల్ విషయాలు చెప్పొద్దు లెండి..

మరి మీరు రాసిన టపా అందరికి తెలియాలంటే ఎలా.. తెలుసుగా బ్లాగు సంకలినులు లేదా ఆగ్రిగేటర్లలో చేరాలి.


కూడలి ---- support@koodali.org
మాలిక -... admin@maalika.org
జల్లెడ --- http://dir.jalleda.com/index.php?show=add&PID=79

హారం --- http://haaram.com/Join.aspx
తెలుగు బ్లాగర్స్ ... http://www.telugubloggers.com/add-blog/

అగ్రిగేటర్స్ వివరాలు తెలుసుకున్నారుగా. మరి మీకు అప్పుడప్పుడు వచ్చే సందేహాలకు సమాధానాల కోసం , బ్లాగులకు, అంతర్జాలంలో తెలుగుకు సంబంధించిన చర్చలకోసం తెలుగు బ్లాగు గుంపులో చేరండి. http://groups.google.co.in/group/telugublog ఎవరో ఒకరు మీకు సమాధానమిస్తారు. సందేహాలు , సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తారు.

Sunday, July 11, 2010

బ్లాగు టపాలో ఆడియో ఎలా పెట్టాలి?

మీ బ్లాగులోని ఏదైనా టపాకి పాట జత చేయాలనుకుంటున్నారా? అది మీ దగ్గర ఉన్న పాట అయినా, నెట్ లో ఉన్న పాట అయినా సరే ,చాలా సులువుగా మన టపాలో చేర్చవచ్చు. దానికోసం esnips, లేదా divshare అనే సైట్లు ఉపయోగపడతాయి.


ముందుగా esnips లో మీ పేరుతొ అకౌంట్ తెరవండి. తర్వాత మీ సిస్టంలో ఉన్న పాటను మీ అకౌంట్ లో అప్లోడ్ చేయండి. దీనికి కొంత సమయం పడుతుంది. పాట అప్లోడ్ అయ్యే సమయంలో ఆ విండోలో వేరే ఏవి ఓపన్ చేయకూడదు. అప్లోడ్ ఆగిపోతుంది.




పాట పూర్తిగా అప్లోడ్ అయ్యాక ఆది ఉన్న ఫోల్డర్ తెరిచి చూస్తే ఇలా కనిపిస్తుంది ప్లేయర్. ఇక్కడ ఇలాగే వినొచ్చు. మరి బ్లాగులో ఎలా పెట్టాలి అంటే.. ఇక్కడ కనిపిస్తున్న mp3 widgets ని సెలెక్ట్ చేసుకోవాలి.



సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన ప్లేయర్ ని ఎంచుకుంటే ఆ ప్లేయర్ యొక్క html కోడ్ వస్తుంది. ఆ కోడ్ ని కాపీ చేసుకుని మీ బ్లాగు టపాలో ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేయండి. ఇలా ఎన్ని పాటలైనా, ఆడియో అయినా టపాలో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మామూలుగా పబ్లిష్ చేయండి. అంతే..


అందమైన ప్లేయర్లో మీకిష్టమైన పాట వినవచ్చు.

అలాగే మీకు కావాల్సిన పాటను,మీరు అప్లోడ్ చేయకున్నా, వేరేవాళ్ళ పాటలైనా కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకుని ఆ కోడ్ ని మీ బ్లాగులో పెట్టుకోవచ్చు.

Wednesday, October 7, 2009

బ్లాగు టపాలో వీడియో పెట్టడం...

బ్లాగులో రాయడం, చిత్రాలు ,ఆడియో పెట్టడం ఎలాగో తెలుసుకున్నాం కదా.ఇప్పుడు మన టపాలో వీడియో ఎలా పెట్టాలో చూద్దాం. మనం రాసే టపాలో సినిమా పాట అయినా, ఏదైనా కార్యక్రమమైనా పెట్టాలంటే కొన్ని సైట్లలో ఈ సదుపాయం ఉంది. ఉదా... Youtube ..ఇక్కడ మీకు లభించే వీడియోలు మన బ్లాగులో పెట్టడానికి కొన్ని సులువైన పద్ధతులు పాటిస్తే చాలు. అలాగే యూట్యూబ్ లో మీ సొంత వీడియోలు కూడా అప్లోడ్ చేసి బ్లాగులో పెట్టవచ్చు.




యూట్యూబ్ కి వెళ్లి మీకు కావలసిన పాట వెతకండి. ఇక్కడ కుడివైపు కనిపించే Embed ఆప్షన్లో ఉన్న కోడ్ ని కాపీ చేసుకోండి.



ఆ కోడ్ ని మీ బ్లాగులో , మీకు కావలసిన చోట పెట్టండి. తర్వాత మీరు రాయాలనుకున్న విషయాన్ని రాసి పబ్లిష్ చేయండి.



అంతే ఎంచక్కా వీడియో చూసుకోండి.. ఆనందించండి.





నెట్ లో దొరికే వీడియో ఎలా పెట్టాలో చూసాము కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న వీడియోని బ్లాగు టపాలో ఎలా పెట్టాలో తెలుసుకుందాం. మీరు పోస్ట్ రాసే పేజీలో పైన Add Video అనే బొత్తాము ఉంటుంది . అది క్లిక్ చేసి మీ వీడియోని తగిన పేరు ఇచ్చి అప్లోడ్ చేయండి. అంతే. అది మీ బ్లాగులో కూర్చుంటుంది.

అర్ధమైంది కదా. ఆలస్యమెందుకు . మొదలెట్టండి మరి..

గమనిక: ఎప్పుడు కూడా నెట్ నుండి చిత్రాలు, వీడియోలు గట్రా వాడుకుంటే కాపీరైట్ సమస్యలులేకుండా చూసుకోండి.లేకపోతే గొడవలైపోతాయి మరి ..

Sunday, October 4, 2009

బ్లాగుకు ఫోటోలు జత చేయడం ఎలా?

ఇంతవరకు బ్లాగులో ఎలా రాయాలి , లింకులు ఎలా పెట్టాలి తెలుసుకున్నాము కదా.ఇపుడు మన టపాలకు అందమైన బొమ్మలు ఎలా పెట్టాలి తెలుసుకుందాం.


మీ కంప్యూటర్లో ఉన్న చిత్రం బ్లాగు టపాలో పెట్టాలంటే Add new post లో పైన చూపిన లింకు Add image ని క్లిక్ చేసి మీ కంప్యూటర్లో ఉన్న చిత్రాన్ని అప్లోడ్ చేయండి. ఈ చిత్రం అప్లోడ్ చేసేటప్పుడు అది ఎటువైపు రావాలో ,చిన్నగా, పెద్దగా ఎలా ఉండాలో సెట్ చేయండి.





సేవ్ చేసిన చిత్రం ఇలా అందంగా బ్లాగులో కన్పిస్తుంది.



ఒకవేళ మీరు గూగుల్ నుండి చిత్రాలు సేకరించి బ్లాగు టపాలో పెట్టాలనుకుంటున్నారా?ఐతే గూగుల్ ఇమేజెస్ ఓపన్ చేయండి. అందులో మీకు కావలసిన బొమ్మ పేరు టైప్ చేయండి.








మీరు అడిగిన చిత్రాలు ఇలా వస్తాయి.అందులో మీకు నచ్చిన బొమ్మపై రైట్ క్లిక్ చేసి మీ కంప్యూటర్లోకి సేవ్ చేసుకోండి.

మీరు ఇలా సేవ్ చేసుకున్న చిత్రం బ్లాగులో ఇలా కనిపిస్తుంది. చిన్నగా ఉంది కదా.. ఏం చేద్దాం ???







మీరు బొమ్మ మీద రైట్ క్లిక్ చేసి సేవ్ చేయకుండా, బొమ్మ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది.అప్పుడు See full size image క్లిక్ చేసి బొమ్మను పెద్దసైజులో సేవ్ చేసుకోండి.




పెద్దసైజులో సేవ్ చేసుకుని బ్లాగులో అప్లోడ్ చేసుకుంటే ఆ బొమ్మ అందంగా పెద్దగా కన్నులకింపుగా కనిపిస్తుంది..మరి మొదలెట్టండి మరి...


ఒకోసారి గూగులమ్మ ఇచ్చే బొమ్మలు కాపీరైట్ సమస్యలు ఉంటాయి. చూసుకోండి..

Tuesday, September 29, 2009

మీరు పాడిన పాటలు బ్లాగులో పెట్టాలా??

ఇంతవరకు బ్లాగులు అంటే మన ఆలోచనలను రాతలలో నిక్షిప్తం చేయడమే అనుకుంటున్నారు.పాటలు, వీడియోలు కావాలంటే జాలంలో చాలా ఉన్నాయి. యూట్యూబ్, ఈస్నిప్స్ గట్రా.. నెట్లో ఉన్న పాటలు వాడుకోవచ్చు లేదా మన దగ్గర ఉన్న పాటలు, వీడియోలు అప్లోడ్ చేసి బ్లాగులో పెట్టొచ్చు. కాని మన స్వంత గొంతుకతో పాడి, మాట్లాడి బ్లాగులో పెట్టాలంటే ఎలా??


దీనికోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి పాటిస్తే చాలా సులువుగా ఆడియో టపాలు పెట్టడం కష్టమేమి కాదు. ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ ఆడియో ఫైళ్ళు mp3 format లో ఉండాలి. మీ దగ్గర రికార్డింగ్ సదుపాయం ఉన్న mp3 ప్లేయర్ ఉంటే మంచిదే. అందులో డైరెక్టుగా పాడేసి,మాట్లాడేసి రికార్డింగ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మన కంప్యూటర్ కి కనెక్ట్ చేసి ఆ ఫైల్ ని సిస్టం లోకి సేవ చేయండి. ఒకవేళ అది wav format లో ఉంటే dBPoweramp music converter సాయంతో mp3 కి మార్చుకోవచ్చు.


మరో సులభమైన ఉపాయం ఉంది. వాయిస్ రికార్డింగ్ సాఫ్ట్ వేర్ వాడడం. ఈ సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. కంప్యూటర్ కి మైక్ అనుసంధానం చేసి ఆ సాఫ్ట్వేర్ సాయంతో రికార్డింగ్ చేయండి. ఇక్కడ మన ఆడియో నేరుగా mp3 లో రికార్డ్ అవుతుంది. ఈజీగా లేదూ..




RecordPad Sound Recording Software


MP3 Voice Recorder



ఇక వాయిస్ రికార్డింగ్ ఐపోయింది. దాన్ని బ్లాగులో ఎలాపెట్టాలి.. ముందుగా esnips లేదా divshare సైట్లో మీ ఖాతా తెరవండి. అక్కడ మీరు రికార్డింగ్ చేసింది అప్లోడ్ చేసి సేవ్ చేయండి. తరవాత దాని mp3 widget code తీసుకొని మీ బ్లాగులో పెట్టండి. అంతే..


ఒకవేళ మీ టపాలో ఒకటికంటే ఎక్కువ పాటలు, ఆడియో ఒకే ఫైలులా పెట్టాలనుకుంటే మీరు అప్లోడ్ చేసిన పాటలన్నీ playlist లా చేసి ఆ కోడ్ బ్లాగులో పెడితే సరి.. ఇలాగన్నమాట..


అర్ధమైందనుకుంటా??

Monday, September 21, 2009

వ్యాఖ్యల్లో లింకులు ఇవ్వడం

ఇంతకు ముందు బ్లాగు టపాలో వేరే టపా, బ్లాగు, సైట్ లింక్ ఇవ్వడం తెలుసుకున్నాము కదా. ఇప్పుడు బ్లాగుల్లో మనం రాసే వ్యాఖ్యల్లో కూడా ఏదైనా లింక్ ఎలా ఇవ్వాలో చూద్ద్దాం. ఇది అంత కష్టమేమి కాదు.

మనం బ్లాగు టపాలకు మన స్పందన తెలపడానికి వ్యాఖ్యలు రాస్తుంటాము. అప్పుడప్పుడు ఈ వ్యాఖ్యలలో మరో టపా కాని , సైటు కాని ప్రస్తావించవలసి వస్తుంది. ఆ పేజి లింక్ ఇలా ఇవ్వొచ్చు.




అది చదివినవాళ్ళు దాన్ని కాపీ చేసుకుని విడిగా పేస్ట్ చేసి చూడాలి. ఇలా మొత్తం పేజి లింక్ ఇవ్వడం వల్ల ఒక్కోసారి కాపీ చేసుకోవడంలో ఏదైనా మిస్ ఐతే కష్టం కదా. బద్ధకం వల్ల కూడా దాన్ని చూడము. ఇంత పొడుగు చిరునామా చూడడానికి అంత బాగోలేదు కూడా.





అలా కాకుండా బ్లాగు టపాలో ఇచ్చినట్టు వ్యాఖ్యలో కూడా లింక్ లేదా లంకె వేయొచ్చు. ఒక చిన్న కోడ్ ఇస్తే సరి..

<a href='లంకె చిరునామా'>లంకె పాఠ్యం </a>


ఇక్కడ లంకె చిరునామా అన్నచోట మీరు ఇవ్వాలనుకున్న పేజి లింక్ ఇవ్వండి.లంకె పాఠ్యం అన్నచోట మీరు లింకుకు ఇవ్వాలనుకున్న పదం ఇవ్వండి.







ఇప్పుడు మీ వ్యాఖ్యలో లింక్ ఇలా వస్తుంది. అది చదివిన వాళ్లు అది క్లిక్ చేయగానే సదరు పేజి ఓపన్ అవుతుంది. మొదట్లో కాస్త తికమకగా, అయోమయంగా ఉండొచ్చు.కాని రెండు మూడుసార్లు చేస్తే అదే అలవాటవుతుంది.