Tuesday, September 29, 2009

మీరు పాడిన పాటలు బ్లాగులో పెట్టాలా??

ఇంతవరకు బ్లాగులు అంటే మన ఆలోచనలను రాతలలో నిక్షిప్తం చేయడమే అనుకుంటున్నారు.పాటలు, వీడియోలు కావాలంటే జాలంలో చాలా ఉన్నాయి. యూట్యూబ్, ఈస్నిప్స్ గట్రా.. నెట్లో ఉన్న పాటలు వాడుకోవచ్చు లేదా మన దగ్గర ఉన్న పాటలు, వీడియోలు అప్లోడ్ చేసి బ్లాగులో పెట్టొచ్చు. కాని మన స్వంత గొంతుకతో పాడి, మాట్లాడి బ్లాగులో పెట్టాలంటే ఎలా??


దీనికోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి పాటిస్తే చాలా సులువుగా ఆడియో టపాలు పెట్టడం కష్టమేమి కాదు. ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ ఆడియో ఫైళ్ళు mp3 format లో ఉండాలి. మీ దగ్గర రికార్డింగ్ సదుపాయం ఉన్న mp3 ప్లేయర్ ఉంటే మంచిదే. అందులో డైరెక్టుగా పాడేసి,మాట్లాడేసి రికార్డింగ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మన కంప్యూటర్ కి కనెక్ట్ చేసి ఆ ఫైల్ ని సిస్టం లోకి సేవ చేయండి. ఒకవేళ అది wav format లో ఉంటే dBPoweramp music converter సాయంతో mp3 కి మార్చుకోవచ్చు.


మరో సులభమైన ఉపాయం ఉంది. వాయిస్ రికార్డింగ్ సాఫ్ట్ వేర్ వాడడం. ఈ సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. కంప్యూటర్ కి మైక్ అనుసంధానం చేసి ఆ సాఫ్ట్వేర్ సాయంతో రికార్డింగ్ చేయండి. ఇక్కడ మన ఆడియో నేరుగా mp3 లో రికార్డ్ అవుతుంది. ఈజీగా లేదూ..




RecordPad Sound Recording Software


MP3 Voice Recorder



ఇక వాయిస్ రికార్డింగ్ ఐపోయింది. దాన్ని బ్లాగులో ఎలాపెట్టాలి.. ముందుగా esnips లేదా divshare సైట్లో మీ ఖాతా తెరవండి. అక్కడ మీరు రికార్డింగ్ చేసింది అప్లోడ్ చేసి సేవ్ చేయండి. తరవాత దాని mp3 widget code తీసుకొని మీ బ్లాగులో పెట్టండి. అంతే..


ఒకవేళ మీ టపాలో ఒకటికంటే ఎక్కువ పాటలు, ఆడియో ఒకే ఫైలులా పెట్టాలనుకుంటే మీరు అప్లోడ్ చేసిన పాటలన్నీ playlist లా చేసి ఆ కోడ్ బ్లాగులో పెడితే సరి.. ఇలాగన్నమాట..


అర్ధమైందనుకుంటా??

2 వ్యాఖ్యలు:

శ్రీలలిత said...

జ్యొతీ,

మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. చాలా బాగుంది. నిన్న నేను గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళినప్పుడు ఒక వెబ్సైట్ కనిపించింది. ఫైల్ డెన్.కాం అన్నది. అందులో అక్కౌంటు ఓపెన్ చేసి నా బ్లాగ్ లో శారదాస్తుతి పాట లింక్ ఇచ్చాను. ఎలా వచ్చిందో చూసి చెప్పగలరు..

Ennela said...

jyothi garu,
konchem blog lo kudali yela pettaalo chepparoo please?....inkaa yee saari naa tapaalo mee perundandoy.... oka saari choodaroo pleae?
ennela

Post a Comment