బ్లాగు మొదలెట్టాము, సెట్టింగులన్నీ చేసాము. ఇక దానికో అందమైన రూపం ఇద్దామా?? బ్లాగు మూస లేదా టెంప్లేట్ మార్చడం ఎలాగో తెలుసుకుందాం.
ముందుగా బ్లాగర్ టెంప్లేట్లు అందించే సైటుకు వెళ్లి మీకు నచ్చిన మూస ఎంచుకోండి. దాని డెమో చూడండి. ఒకె అనుకుంటే డౌన్ లోడ్ చేసుకోండి.అది ఒక జిప్ ఫైల్ గా సేవ్ అవుతుంది.
సేవ్ చేసుకున్న టెంప్లేట్ జిప్ ఫైల్ ని అన్ జిప్ చేయండి. అది ఉన్నదున్నట్టుగా మన బ్లాగులోకి ఎగుమతి/అప్లోడ్ చేయలేము.
అన్ జిప్ చేసిన ఫైలు తెరిచి చూడండి.అందులో Read me అన్న లింకు తెరిచి ఇచ్చిన వివరాలు చదువుకోండి. మన బ్లాగుకు కావలసింది ఆ ఫైలులో ఉన్న xml ఫైల్.
ఇప్పడు బ్లాగులో Layout > Edit html కి వెళ్లండి. అక్కడ browse క్లిక్ చేసి మీ సిస్టమ్ లో ఉన్న టెంప్లేట్ ఫైలులోని xml ని అప్ లోడ్ చేయండి. ఒకవేళ మీరు బ్లాగులోఎవైనా విడ్జెట్లు చేర్చి ఉంటే వాటిని విడిగా సేవ్ చేసుకోండి. ఇలా టెంప్లేట్ మార్చినప్పుడు అవన్నీ పోతాయి. టెంప్లేట్ అప్ లోడ్ అయ్యాక సేవ్ చేయండి. అంతే...
టెంప్లేట్ మారిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు layout కి వెళ్లి విడ్జెట్లు చేర్చండి.
బ్లాగర్ టెంప్లేట్ల కోసం కొన్ని సైట్లు :
http://btemplates.com/
http://blogger-templates.blogspot.com/
http://www.ourblogtemplates.com/
http://eblogtemplates.com/
www.blogbulk.com/
http://www.deluxetemplates.net/
http://finalsense.com/
http://wpbloggerthemes.blogspot.com/
http://www.ipietoon.com/
http://www.bloggerstyles.com/
8 వ్యాఖ్యలు:
http://sahithimala.wordpress.com/
ఇక్కడ వున్న టెంప్లెట్ ని ,నా బ్లాగ్ స్పాట్ లో నేను రెగ్యులర్ గా వాడే సాహితి కి మార్చాలనుకునున్నాను. కాని దీనిని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలీటము లేదు . అలాగే దీని లో హెడ్ బార్ లో , సాహితి లోని బొమ్మను చిన్న సైజ్ చేసి పెట్టవచ్చా ?
వర్డ్ ప్రెస్స్ లో గాడ్జెట్స్ ఆడ్ చేయటము ఎలా ?
అలాగే ,బ్లాగ్ స్పాట్ నుండి , వర్డ్ ప్రెస్స్ కి ఇంపొర్ట్ చేసినప్పుడు స్లైడ్ షో రాలేదేమిటి ? గ్రీటింగ్ కార్డ్స్ లలోకూడా రెండులో వొకటే వచ్చింది.దేనికని ?
మీరేమిటి వర్డ్ వెరిఫికెషన్ పెట్టారు ?
మాలగారు,
మీరు చెప్పిన వర్డ్ ప్రెస్ టెంప్లేట్, బ్లాగర్ కి వాడలేము. నేను ఇచ్చిన లింక్స్ లో అలాటి టెంప్లేట్ ఉందేమో వెతకండి.వర్డ్ ప్రెస్ టెంప్లేట్ లో హెడర్ ఇమేజ్ మార్చుకునే అవకాశం ఉంటే తప్పకుండా మీరు చెప్పిన బొమ్మ పెట్టుకోవచ్చు. వర్డ్ ప్రెస్ లో gadgets పెట్టడం ఓ తలనొప్పి.అందుకే నేను నా పాత బ్లాగులో పెట్టలేదు.
బ్లాగ్ స్పాట్ నుండి వర్డ్ ప్రెస్ కి ఇంపోర్ట్ సంగతి తెలీదండి.బ్లాగు గుంపులోఅడిగి చూడండి..
వర్డ్ వెరిఫికేషన్ ఉన్నట్టు తెలీదు. చూసుకోలేదు. ఇప్పుడే తీసేస్తాను..:)
వర్డ్ ప్రెస్ గురించి కూడా పాఠాలు మొదలుపెట్టాలి ఇక్కడ నాలాంటి వాళ్ళు వెయిటింగ్
చాలా బాగా, ఆసక్తికరముగా, విజ్ఞానదాయకముగా ఉందండీ మీ బ్లాగు.. లలిత గారి పుణ్యమాని మీ బ్లాగుని చేరుకున్నాను.. నేను ఎవరిని అడగాలా, ఎవరిని అడగాలా అనుకుంటున్నా తరుణములో మీ బ్లాగు కనిపించింది. చాలా బాగా ఉపయోగపడే సైటుని నిర్వహిస్తున్నందులకి మీకు నా ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు.
Exlent Jyoti gaaru miru naalanti kottaga blog raase vaallaku ivi chaala use avutaayi chaala chaala thanx.
chala superb andi mam garu
News blogs are the best wellspring of solid reporting on any space of intrigue. There are express blogs expected to cover present as a last resort news, journalism and breaking news from around the globe. These are all around open on the web. medios independientes
Post a Comment