Sunday, September 6, 2009

తెలుగు ఖతులు - సహాయం

మన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ XP లో డీఫాల్ట్ గా గౌతమి ఫాంటు ఉంటుంది. కాని Windows 2000 , 98 వాడుతున్నప్పుడు ఇది పని చేయదు.

వివిధ ఆపరేటింగ్ సిస్టమ్ లలో తెలుగును స్ధాపించడం, రాయడం. చదవడం కొరకు క్రింది వివరాలు పరిశీలించండి.

Win98
Win2000
Linux
Ubuntu

ఇలా ఖతి లేదా ఫాంటును మన కంప్యూటర్లో స్ధాపించుకున్నాక తెలుగు రాయడానికి గల మరి కొన్ని సాప్ట్ వేర్ల గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పుకున్న ఉపకరణాలలో తెలుగు అక్కడ రాసుకుని కాపీ చేసుకుని ,మనకు కావలసిన చోట పేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాని ఈ సాఫ్ట్ వేర్ల ఉపయోగంతో ఎక్కడైనా నేరుగా (ఇంగ్లీషులా) తెలుగులో సులువుగా రాసుకోవచ్చు. దీనికి అంతర్జాల అనుసంధానం కూడా అవసరం ఉండదు.

ఇన్ స్కిప్ట్
బరహా
అను మాడ్యూలర్ (మీరు ఇప్పటికే అను మాడ్యూలర్ కీబోర్డ్ లేఅవుట్ వాడుతున్నట్లయితే)
అను ఆపిల్ (మీరు ఇప్పటికే అను ఆపిల్ కీబోర్డ్ లేఅవుట్ వాడుతున్నట్లయితే)
అక్షరమాల

మంటనక్క (ఫైర్ ఫాక్స్) కొత్తవెర్షన్ లో తెలుగు బాగానే కనిపిస్తుంది. ఒకవేళ తెలుగు సరిగ్గా కనపడకపోతే ఈ సోపానాలు పాటించండి.అంతకుముందు తెలుగు ఎనేబుల్ చేసారాలేదా చూసుకోండి.

మంటనక్కలో నేరుగా తెలుగు రాయడానికి గల పద్ధతులు :
ఇండిక్ ఇన్ పుట్
పద్మ పొడిగింత (addon)

0 వ్యాఖ్యలు:

Post a Comment