బ్లాగు మొదలెట్టి అలంకరించడం, అగ్రిగేటర్లలో చేర్చడం అయిపోయిందిగా. ఇక బ్లాగు టపాలు రాయడం చూద్దాం.మనసులో కలిగిన ఆలోచనలు అలా రాసుకుంటూ పోవడమే కాదు.ఆ వాక్యాలను సరియైన క్రమంలో ఉంచాలి. అప్పుడే చదవడానికి, చూడడానికి సులభంగా ఉంటుంది.
బ్లాగులో నేరుగా రాయొచ్చు లేదా నోట్ పాడ్ లో రాయొచ్చు. వర్డ్ లో రాసి ,బ్లాగులో పెట్టి పబ్లిష్ చేస్తే ఒక్కోసారి ఎర్రర్ వస్తుంది . అందుకే నోట్ ప్యాడ్ వాడడం శ్రేయస్కరం. Start menu నుండి Runలో notepad అని టైప్ చేసి ok అంటే అది ఓపన్ అవుతుంది.. అందులో మీ టపా రాసి కాపీ చేసి బ్లాగులో పేస్ట్ చేయండి.
బ్లాగులో అలా రాసుకుంటూ పోవచ్చు. కాని పేరాలు ఇవ్వడం చాలా ముఖ్యం. లేకుంటే గందరగోళంగా ఉంటుంది. పైన చెప్పినట్టు. చదివి అర్ధం చేసుకోవడానికి కూడా అయోమయంగా , కష్టంగా ఉంటుంది.
కాని అదే టపాను పేరాలుగా విడదీసి ,, మధ్యలో స్పేస్ వదిలితే ఎంత అందంగా , చదవడానికి ఎంత సులువుగా ఉందొ చూడండి. మీ టపాకు పేరాలు ఎలా ఇవ్వాలి అని సందేహమొస్తే... ఒక్కసారి మీ స్కూలు పాఠాలు , లేదా పత్రికలలోని కథలు చూడండి. అర్ధమవుతుంది..
0 వ్యాఖ్యలు:
Post a Comment