Thursday, September 17, 2009

లింకులు ఇవ్వడం ఎలా ???

నాలుగు లైన్ల కథకు రెండున్నర గంటల సినిమా చేస్తే దాన్ని ఏమంటారు?? పైగా ఆ సినిమా చూసి భయపడితే ఐదులక్షల బహుమతి.. అది కూడా థియేటర్లోని టికెట్లన్నీ కొని, ఒక్కరే కూర్చుని, కళ్ళు మూసుకోకుండా చూడాలి. మధ్యలో పారిపోకూడదు. ఎవరైనా ప్రయత్నిస్తారా? ఐతే ముందు సినిమా కథ చదవండి. తర్వాత మీ ఇష్టం.


ఇలా
మనం రాసే టపాలలో కొన్ని ఇతర బ్లాగులు, సైట్లలోని పేజీలకు అనుసంధానం, లేదా లింక్ ఇవ్వాలి. ఆ పేజి లింక్ మొత్తం ఇస్తే తికమకగా ఉంటుంది. కాపీ,పేస్ట్ చేయడంలో తప్పులు పోవచ్చు. పెద్ద పని. కాని ఇలా ఒక పదానికి సంబంధిత పేజి లింక్ ఇస్తే సులువుగా ఉంటుంది. అది ఎలాగో చూద్దాం.




New post కి వెళ్లి మీరు రాయాల్సిన టపా రాయండి.అందులో ఏ పదానికి మీరు వేరే పేజి, బ్లాగు లింక్ ఇవాలనుకున్నారో దాని లింక్ కాపీ చేసుకోండి. మీరు లింక్ ఇవ్వాలనుకున్న పదాన్ని సెలెక్ట్ చేసుకొని పైన గొలుసు బొమ్మ ని క్లిక్ చేయండి. అప్పుడు వచ్చే బాక్స్ లో మీరు ఇవ్వాలనుకున్న లింక్ చిరునామాని ఇవ్వండి. అంతే ఆ పదానికి సంబంధిత లింక్ చేర్చబడింది.





మీరు లింక్ ఇచ్చిన పదం బోల్డు చేయండి. దాని రంగు కూడా వేరుగా ఉంటుంది. మీ టపా చదివేవాళ్ళకి తెలుసుకోవడానికి సులువుగా ఉంటుంది.

బ్లాగు టపాలో లింక్ ఇవ్వడం తెలిసింది కదా.. ఎనీ డౌట్స్??

7 వ్యాఖ్యలు:

Poodoori Raji Reddy said...

ఎంత సుళువుగా పాఠాలు చెప్పేస్తున్నారండి!
థాంక్యూ!

P S Prakash said...

ఒక ఠపా నుండి మరొ ఠపాకు లింక్ ఎలా ఇవ్వాలొ తెలియచెయండి .

జ్యోతి said...

సత్యార్ధిగారు,

పైన చెప్పినట్టుగానే ఆ టపా లింకును కాపీ చేసుకుని ఇప్పుడు ఇవ్వాలనుకున్న టపాకు ఇవ్వండి. దీనికోసం మీరు మీ బ్లాగును రెండు టాబ్స్ లో ఓపన్ చేసుకోండి..

వనజ తాతినేని/VanajaTatineni said...

jyothi gaaroo.. namaskaaram. mee gurinchi.. Bhumika.lo.. chadhivaanu.. Aadhi bikshuvu vaadinemi koredhi.. annatlu.. adagakundaane yenni isthunnaaru.. nenu chaalaa.. krottha. kongrottha. mee soochanalu.. chaalaa.. viluvainavi. upayukthamainavi. dhayavadhamulu.. mallee.. mallee.. kalusthoone.. untaanu..

యశోదకృష్ణ said...

nenu link isthe link kanipisthundi. but connect avadam ledu. hand cursor raavatam ledu. test this link ante correct ga veduthundi. problem teliyadam ledu.

జ్యోతి said...

వనజగారు, ధాంక్స్,,,

గీతగారు, మీరు ఎడిటర్ ఆప్షన్ చెక్ చేయండి .. old editor సెలెక్ట్ చేసుకోండి. నేను చెప్పిన విధానం పనిచేస్తుందే..

Srinivas said...

Jyothi Madam, Meeku naa dhyanyavaadaaalu. Mee lanti Guruvu dorakadam Naa Adrustam...RAGHUPATRUNI SRINIVASARAO, SRIKAKULAM

Post a Comment