Wednesday, September 2, 2009

కంప్యూటర్లో తెలుగు రాయడం

మన కంప్యూటర్ కు తెలుగు నేర్పించాము కదా. ఇక తెలుగులో ఎలా రాయాలో తెలుసుకుందాం.

ముందుగా మనం అంతర్జాలంలో ఎటువంటి డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా సులువుగా తెలుగులో రాయగలిగే పద్ధతులు ఎన్ని ఉన్నాయో చూద్ధామా??

లేఖిని



గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ


క్విల్ పాడ్



స్వేచ్ఛ



యంత్రం


ఈ ఉపకరణాలన్నీ కూడా అంతర్జాల సంధానం ఉన్నప్పుడే పనిచేస్తాయి. ఇందులో ఇంగ్లీషులో రాస్తుంటే అవే తెలుగులోకి మారిపోతాయి. ఇలా రాసుకున్నదాన్ని కాపీ చేసుకుని మనకు అవసరమైన చోట పేస్ట్ చేసుకుని సేవ్ చేయాలి. కంప్యూటర్లో కొత్తగా తెలుగు రాయడం మొదలుపెట్టినవారికి ఇవి చాలా ఉపయోగకరమైనవి, సులభమైనవి కూడా.

1 వ్యాఖ్యలు:

Unknown said...

its good

Post a Comment