Friday, September 11, 2009

బ్లాగు విజిటర్స్ మీటర్



బ్లాగు మొదలెట్టాము. కావలసిన హంగులు, సెట్టింగులు చేసాము. ఇక మన బ్లాగుకు వచ్చే సందర్శకులు ఎంత మంది అని ఎలా తెలుస్తూంది. దానికోసం ఒక మీటర్ పెట్టుకోవాలి. దానికోసం మనకు ఎన్నో రకాల సైట్ మీటర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ సైటులో మీ అకౌంట్ మొదలుపెట్టి అడిగిన వివరాలు ఇచ్చి మీకు నచ్చిన సైట్ మీటర్ ఎంచుకోండి. తర్వాత దాని HTML Code కాపీ చేసుకుని , మీ బ్లాగు లో Layout > Add a widget > Html & Javascript ఎంచుకుని క్లిక్ చేసి వచ్చిన బాక్స్ లో ఆ కోడ్ పేస్ట్ చేయండి. దానికి టైటిల్ ఇవ్వండి. తర్వాత సేవ చేస్తే సరి. మీ బ్లాగుకు ఎంతమంది వస్తున్నారో ఖచ్చితంగా తెలుస్తూంది. క్రింద చెప్పిన లింకులలో వివిధ రకాల సైట్ మీటర్లు ఉంటాయి. చూడండి.




http://www.blogcounter.com/

http://www.statcounter.com/

http://www.expertcounter.com/

http://www.blogpatrol.com/

http://sitemeter.com



ఎప్పుడైనా మీ బ్లాగులో మీటర్ పొరపాటున డిలీట్ ఐతే, కనపడకుంటే ఆ సైట్ కి వెళ్లి మీరు క్రియేట్ చేసుకున్న అకౌంట్ కి వెళ్లి మీ సైట్ మీటర్ కోడ్ మళ్ళీ తెచ్చి బ్లాగులో పేస్ట్ చేయండి. అంతే..

4 వ్యాఖ్యలు:

Lakshmi Raghava said...

jyoti,
ee roju blog meter pettukunnanu mee patalato...ila time vunnappudu okkokkati nerchukunta..

Bindu said...

జ్యోతి గారికి నమస్కారం, మేడం మీరు చెప్పిన పాఠాలతో చాల నేర్చుకుంటున్నాను వీలైతె నా బ్లాగ్ ని చూసి సలహలు ఇవ్వగలరు, ఇస్తారని ఆశీస్తు...... నా బ్లాగ్ అడ్రస్స్ http://swapnama.blogspot.com
మీకు మరోక సారి ధన్యవాదములు...........

తెలుగోడు_చైతన్య said...

మీటెర్ ఉంటే రీడింగ్ తెలుస్తుంది.. లేకుంటే ఇలా పేజీవిక్షణలు చెక్ చేసుకోవాలి రీలోడ్ చేసి...ధన్యవాదాలు.

విన్నకోట నరసింహా రావు said...

డిలీట్ అయిన మీటర్ ను సదరు మీటరుసైటుకు వెళ్ళి మళ్ళీ బ్లాగులోకి తెచ్చుకుంటే పాత రీడింగ్ తో సహా వస్తుందా లేక రీడింగ్ మళ్ళీ జీరో నుండి మొదలవుతుందా?

Post a Comment