Wednesday, October 7, 2009

బ్లాగు టపాలో వీడియో పెట్టడం...

బ్లాగులో రాయడం, చిత్రాలు ,ఆడియో పెట్టడం ఎలాగో తెలుసుకున్నాం కదా.ఇప్పుడు మన టపాలో వీడియో ఎలా పెట్టాలో చూద్దాం. మనం రాసే టపాలో సినిమా పాట అయినా, ఏదైనా కార్యక్రమమైనా పెట్టాలంటే కొన్ని సైట్లలో ఈ సదుపాయం ఉంది. ఉదా... Youtube ..ఇక్కడ మీకు లభించే వీడియోలు మన బ్లాగులో పెట్టడానికి కొన్ని సులువైన పద్ధతులు పాటిస్తే చాలు. అలాగే యూట్యూబ్ లో మీ సొంత వీడియోలు కూడా అప్లోడ్ చేసి బ్లాగులో పెట్టవచ్చు.




యూట్యూబ్ కి వెళ్లి మీకు కావలసిన పాట వెతకండి. ఇక్కడ కుడివైపు కనిపించే Embed ఆప్షన్లో ఉన్న కోడ్ ని కాపీ చేసుకోండి.



ఆ కోడ్ ని మీ బ్లాగులో , మీకు కావలసిన చోట పెట్టండి. తర్వాత మీరు రాయాలనుకున్న విషయాన్ని రాసి పబ్లిష్ చేయండి.



అంతే ఎంచక్కా వీడియో చూసుకోండి.. ఆనందించండి.





నెట్ లో దొరికే వీడియో ఎలా పెట్టాలో చూసాము కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న వీడియోని బ్లాగు టపాలో ఎలా పెట్టాలో తెలుసుకుందాం. మీరు పోస్ట్ రాసే పేజీలో పైన Add Video అనే బొత్తాము ఉంటుంది . అది క్లిక్ చేసి మీ వీడియోని తగిన పేరు ఇచ్చి అప్లోడ్ చేయండి. అంతే. అది మీ బ్లాగులో కూర్చుంటుంది.

అర్ధమైంది కదా. ఆలస్యమెందుకు . మొదలెట్టండి మరి..

గమనిక: ఎప్పుడు కూడా నెట్ నుండి చిత్రాలు, వీడియోలు గట్రా వాడుకుంటే కాపీరైట్ సమస్యలులేకుండా చూసుకోండి.లేకపోతే గొడవలైపోతాయి మరి ..

13 వ్యాఖ్యలు:

E.V.Lakshmi said...

కాపీ రైట్స్ గురించికూడా చెప్పండి మరి.

SRRao said...

రెండవ విషయంలో add image బొత్తాము కాదనుకుంటాను. Add video అనుకుంటాను. కరెక్టేనా ?

జ్యోతి said...

e.v.lakshmi, SRRao గారు,,
తప్పులు చూపినందుకు ధన్యవాదాలు.సరిచేసాను. :)

నీహారిక said...

నేనొక పోస్ట్ delete చేసాను దాన్ని తిరిగి పొందగలమా?

జ్యోతి said...

నీహారికగారు, వీలు పడదనుకుంటానండి.

Uyyaala said...

చాలా విలువైన సమాచారాన్ని సులభంగా అర్ధమయ్యే రీతిలో చెబ్తున్నారు . ధన్యవాదాలు.
బ్లాగులో పీడీఎఫ్ ఫైళ్ళను కూడా పెట్టవచ్చా?
పీడీఎఫ్ కన్వర్తర్ల గురించి, పీడీఎఫ్ పుస్తకాలను అందంగా రూపొందించడం గురించి కూడా వివరించ గోర్తాను.
అట్లాగే టెంప్లేట్ శీర్షికలో మనకు ఇష్టమైన ఫోటో / సీన్ ఎలాపెట్టవచ్చో కూడా చెప్పండి.

Anonymous said...

వర్డుప్రెస్సులో అయితే వీడియో ని పెట్టడం చాల సులభం. దానికి ఈ క్రింది విధంగా ఒక లైన్ వ్రాయాలి.
[youtube=URL] అంతే, మీ వీడియో టపా లో వచేస్తుంది.

ex: [youtube=http://www.youtube.com/watch?v=53xUprc8XF8&hl]

ఇదే విధంగా వ్యాఖ్యల్లో కూడా ఇవ్వవచ్చు.

వెన్నెల said...

naa blaagulo telugu enable chesinaa teluguloki maaratam ledu alagea anni settings unnaa post a comment box kanabaduta leadu deeni gurinci konchem chepparaa plz.......

వెన్నెల said...

dinikosam oka saari naa blog cuuDandi http://snehasuda.blogspot.com/

జ్యోతి said...

వెన్నెలగారు,

మీరు చెప్పింది మీ టెంప్లేట్ మహిమ.దానిని సరిదిద్దుకోవచ్చు. లేదా టెంప్లేట్ మార్చుకోవచ్చు. ఇప్పుడు కామెంట్స్ వస్తున్నట్టున్నాయే?? మీకు ఎప్పుడైనా డౌట్ ఉంటే నాకు మెయిల్ చేయొచ్చు.
jyothivalaboju@gmail.com

Anonymous said...

హుర్రే.......నేను నేర్చేసుకున్నానండోయ్ . గురుదక్షిణ చివర్లో ఇచ్చుకుంటాను లెండి. ఇంకా బోల్డు నేర్చుకోవాలికదా!

Unknown said...

నా బ్లాగులో లేఔట్ (layout ) బొత్తాము కనిపించడం లేదు. ఏం చెయ్యాలో కాస్త వివరించండి.

జ్యోతి said...

నాగరాజుగారు,
మీరు క్లాసిక్ టెంప్లేట్ పెట్టినట్టున్నారు. edit HTML కి వెళ్లి క్లాసిక్ టెంప్లెట్ కి వెళ్లి అని అప్ గ్రేడ్ చేసి ఏదో ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. layout కనిపిస్తుంది.

Post a Comment