మీ బ్లాగులో టపా రాయాలంటే దానికి సమయం కేటాయించి కూర్చుని రాయాలి.పబ్లిష్ చేయాలి. ఒక్కోసారి అలా కుదరకపోవచ్చు. ఇపుడు రాసి పెట్టి ,రెండు రోజుల తర్వాత లేదా మీకు కావలసిన రోజు పబ్లిష్ అయ్యేలా చేస్తే ఎలా ఉంటుంది. బావుంటుంది కదా. సౌకర్యంగా కూడా ఉంటుంది. ఒకేసారి పది టపాలు కూడా అలా సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఒక్కో టపా ఒక్కో నిర్ధారిత సమయంలో,తేదీలో ప్రచురింపబడేట్టు.. దానికోసం చిన్న చిట్కా బ్లాగులోనే దొరుకుతుంది.
మామూలుగా మనం బ్లాగులోకి లాగిన్ కావాలంటే http://www.blogger.com/ కి వెళతాము కదా. ఇలా మన టపాను మరో రోజు,సమయంలో పబ్లిష్ చేయాలంటే http://www.draft.blogger.com/లో లాగిన్ కావాలి. ఎప్పటిలాగే మీ టపాను రాసుకుని క్రింద ఎడమవైపు post options అని ఉంటుంది.అది క్లిక్ చేసి మీకు కావలసిన తేది, సమయం ఇచ్చి పబ్లిష్ చేయండి. ఆగండాగండి.. మీ టపా వెంటనే పబ్లిష్ కాదు. ఫలానా టైం కి మనం schedule చేసి పెట్టామన్నమాట. అది సరిగ్గా ఆ టైం కి పబ్లిష్ అవుతుంది మీరు కంప్యూటర్ ముందు లేకున్నా. మీ కంప్యూటర్ ఆఫ్ చేసి ఉన్నాకూడా. ఇలా సెట్ చేసి నిశ్చింతగా మీ పనులు చేసుకోవచ్చు. అలారం పెట్టినట్టు మీరు ఇచ్చిన సమయానికి మీ టపా బ్లాగులో ప్రత్యక్షమవుతుంది.. భలే ఉంది కదూ..
11 వ్యాఖ్యలు:
బాగా ఉపయోగపడే సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు.
ఓహ్ చాలా కాలంగా అనుకుంటున్నా ఇలాంటిదేదైనా ఉంటే బాగుండునని. మీరు చెప్పి మహోపకారం చేశారు. ధన్యవాదాలు.
నాకింకో సందేహం. మా ఇంట్లో టైం ఒకటైతే, నా బ్లాగు టైం వేరొకటి. పోనీ బ్లాగులన్నిటి టైం ఒకటి కాదు. ఒక్కో బ్లాగులో ఒక్కో టైం చెప్తోంది. ఏమిటో అంతా గందరగోళంగా ఉంటుంది.
ఇంతకీ నేను హైదరాబదులో సమయాన్ని నా బ్లాగుకి సెట్ చేసుకోవడ మెలాగో తెలియడం లేదు. కాస్త తెలిపగలరు.
విశ్వప్రేమికుడుగారు,
మీరు సెట్టింగ్స్ లో చిన్న మార్పులు చేసుకుంటే మీ బ్లాగులో, మీ ఇంట్లో టైమ్ తో సెట్ చేసుకోవచ్చు.
settings >formatting>Timezone >>>
(GMT + 5.30)Indian Standard Time) గా మార్చండి.. అంతే..
బాగుంది. ఉపయోగకరమైన చిట్కాను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
జ్యోతి గారు, ఇది నిజంగా బాగా ఉపయోగపడే సమాచారం, నాకే కాదు చాలా మందికి! థాంక్యూ!
naenu time set chaesi publish clik cheyagaane ventanae publish ayyndi . ekkada porapaataindi ?
ippudu lekhini nundi copy chesi ,ikkada paest chestae paste kaaledu . endukani ?
టైమ్ సరి చేసుకున్నాను. ధన్యవాదాలు :)
nnaaku kavaalsina time lo kavalsi post raasaaru..thanks jyothigaaru.
జ్యొతిగారు,
చుశాను..కాని కుదరట౦ లేదు.
.పోటోలు అప్ లోడ్ చెయటానికి లేదు ఆప్షన్ లేదు.పోటోలు పెట్టడ౦ కుదరదా???
మాలగారు,
మీరు మీ బ్లాగులో టైమ్ సెట్టింగ్స ఒకసారి చూసుకోండి.పైన నేను చెప్పినట్టు ఉందా?? అలాగే మీరు టైమ్ సెట్ చేసేటప్పుడు నెల,తేదీ.సమయం AM , PM సరిగ్గా చెక్ చేసుకోండి. ఇక్కడే ఏదో తప్పు జరిగి ఉంటుంది.
సుభద్ర,
అలా కావడానికి లేదు. ఒకోసారి ఇలా సమస్య వస్తే మామూలుగా blogger.com నుండి లాగిన్ అయ్యి పోస్ట్ రాసి సేవ్ చేసి పెట్టు. మళ్లీ draft.blogger.com నుండి లాగిన్ అయ్యి పోస్ట్ schedule చేయి. నేను ఎన్నోసార్లు ఇలాగే చేసాను. ఏ సమస్యా ఉండదు..
నిజంగా చాలా మందికి ఉపయోగపడే సమాచారం. ధన్యవాదాలు.
ద్రావిడ యునివెర్సిటీ వారు ప్రచురించిన 'తెలంగాణా పదకోశం ' పి.డి.ఎఫ్. ఫైల్ ఎవరి వద్ద నైనా ఉంటె దయచేసి amarcpm@gmail.com మెయిల్ కు పంపండి.
Post a Comment