Wednesday, November 4, 2009

విస్టా, విండోస్ 7 లో తెలుగు సమస్య

నిన్న మామూలుగా జిమెయిల్ ఓపన్ చేయగానే అయోమయంలో పడ్డాను. అయ్యో తెలుగుకు ఏమైంది. తల, ముక్కు, కాళ్ళు , చేతులు అన్ని విడిపోయి కనిపిస్తున్నాయి. కొంపదీసి మంటనక్కతో ఈ జిమెయిల్ గొడవ పడిందా అని గూగులమ్మని అడిగి Flock తెచ్చుకుని వాడినా అలాగే కనిపిస్తుంది. మెయిల్ తప్ప మిగతా అన్నిచోట్లా తెలుగు బానే కనిపిస్తుంది. ఇదేం గొడవరా అనుకుని .. ఎందుకైనా మంచిది అని IE లో చూసా ( నాకు ఇదంటే అస్సలు పడదు.. నా స్పీడ్ కి తట్టుకోదు .సతాయిస్తుంది) సేమ్ ప్రాబ్లం. ఇప్పుడేంటి దారి. నేను వాడేది విండోస్ 7 , ఈ సమస్య నాకేనా, అది వాడేవారికి అందరికి వస్తుందా అని కొందరిని బుర్ర తినేసి , గెలికేస్తే అసలు సంగతి తెలిసింది.( ఎవరెట్లా పొతే నాకేంటి? నాకు తెలుగు కనపడాలి అంతే) XP లో ఎటువంటి సమస్య లేదు. ఇదిగోండి విస్టా, విండోస్ 7 లో తెలుగు సంబంధించి వస్తున్న సమస్యకు పరిష్కారం..


జీమెయిల్ వాడు తన Stylesheetలో "Arial Unicode MS" ఖతిని వాడటం మెదలుపెట్టాడు. ఆ ఖతిలో తెలుగు పాఠ్యానికి హల్లులు మరియు వత్తులూ విడిపోయి కనిపిస్తాయి.

పరిష్కారాలు:
  • మీ కంప్యూటరు నుండి Arial Unicode MS ఖతిని తొలగించండి. Delete Arial Unicode MS font from your computer.
    1. Type fonts in the Run Command (Windows Key + R or Click on Start menu then click on Run command)
    2. Delete font name Arial Unicode MS (True Type).
  • లేదా, మీ విహారిణికి మీరు చెప్పిన ఖతలను మాత్రమే వాడమని చెప్పండి. Firefoxలో అయితే ఇలా:
    • Goto Tools meu and then click on Options...
    • In the Content tab, click on the Advanced... button under the Fonts & Colors section.
    • From the Fonts For drop down select Telugu.
    • Then, select fonts of your choice from serif, sans-serif, etc dropdowns.
    • Uncheck the "Allow pages to choose their own [..]" check box


Veeven.


ఇది బ్లాగులకు సంబంధించిన విషయం కాకున్నా,మనం వాడే జిమెయిల్ కి తెలుగు సంబందించి వచ్చిన చిన్న తెగులు.

11 వ్యాఖ్యలు:

వెంకట రమణ said...

సమస్య సృష్టించింది గూగుల్ వాడయితే పరిష్కరించాల్సింది కూడా వాడే కదా. వాడికి ఈ సమస్య గురించి ఓ మెయిలు చేస్తే ఆ పాంటు సెట్టింగు మార్చడమో, లేదా పరిష్కరించడానికి మరోటేదైనా చెయ్యడమో చేయాలి. తెలుగులో జిమెయిలు వాడే వాళ్లున్నారని తెలిస్తే, ఈసారినుండి ఇలాంటి మార్పులు చేసేటప్పుడు తెలుగులో ఎలా కనపడుందో పరిశీలించి చేస్తాడు.

Ravi said...

Many Many thanks. Since two days... I have been struggling with this issue since 3 days. Thanks for the solution.

సిరిసిరిమువ్వ said...

జ్యోతి గారు, నిన్న XP లో కూడా ఈ సమస్య వచ్చింది తరువాత దానంతటదే పోయింది.

కన్నగాడు said...

ఆ ఫాంటు పేరు చూసారా MS అంటా, అంటే మైక్రోసాఫ్టు వాడిది. ఎవడు ఏది చేసినా మన దిమ్మ తిరుగుతుందో వాడే మైక్రోసాఫ్టు. నేను నా మాక్ ఓ.ఎస్. లో సఫారీ బ్రౌజర్ తో ఇలాంటి సమస్య ఉండి ఫైర్।ఫాక్స్ వాడే వాడిని, ఒక రోజు దానికి పరిష్కారం కనుక్కూందామని రెండు గంటలు గూగులమ్మని బుజ్జగిస్తే చెప్పింది, తప్పంతా మైక్రోసాఫ్టు ఆఫీసులో ఉందని, అది ఇన్స్టాల్ అయ్యేటప్పుడు తనవెంట కొన్ని ఫాంట్లను తెచ్చి లోకల్ ఫాంట్లను ప్రభావితం చేస్తుందని. వెంటనే ఆఫిస్ తీసేసా

Anil Dasari said...

@కన్నగాడు:

నా మాక్‌బుక్‌లో ఎమ్మెస్ ఆఫీస్ ఉంది. నేను సఫారీ వాడతాను. అందులో తెలుగక్షరాలు శుభ్రంగా పనిచేస్తాయి. అనవసరంగా ఎమ్మెస్‌ని ఆడిపోసుకుంటున్నారేమో :-)

జ్యోతి said...

వెంకటరమణగారు,

ప్రమదావనంలో ఓ అమ్మాయి గూగుల్ లోనే పనిచేస్తుంది. తనకు ఈ సమస్య గురించి చెప్పాను.మాట్లాడతానంది.

రవిచంద్రగారు,
సంతోషం. మీ సమస్య పరిష్కారమైనందుకు.నాకు మొన్నే ఈ సమస్య వచ్చింది.

వరూధినిగారు,
నాకు తెలిసి XP లో ఈ సమస్య లేదనుకుంటా. పోనీలెండి దానంతట అదే పోయింది. విస్టాలో చాలామందికి ఈ సమస్య వచ్చింది నిన్న.

కన్నగారు,

అలా ఐతే ఆపీస్ వేసినప్పుడే ఈ సమస్య రావాలిగా. అది కాదనుకుంటాలెండి. దీనిగురించి నిపుణులు ఏమంటారో చూడాలి. నాకైతే ఎమ్.ఎస్.ఆపీస్ బాగా అలవాటైపోయింది.

శ్రీలలిత said...

హుర్రే గురువుగారూ, సమస్య మీ సమాధానంతో మబ్బులా విడిపోయింది. ధన్యవాదాలు.

Gopal said...

మైక్రో సాఫ్ట్ లో మీకు తెలుగు కావలసివస్తే గౌతమీయే దిక్కు. MS Arial Unicode లో అన్ని భాషలకు సంబంధించిన ఖతులు పెట్టాలి. హిందీ పనిచేస్తుంది. కానీ తెలుగు పూర్తిగా అందులో చేర్చలేదు. ఉత్తి అక్షరాలు మాత్రమే పెట్టాడు. అందువల్ల అల్లా వస్తుంది. హిందీకి మాత్రం మంగల్ మరియు MS Arial Unicode రెండింటిలోనూ ఖతులు బాగుంటాయి, మరియు రెండూ రెండురకాల ఖతులు. మంగల్ కాస్త గుండ్రంగా ఉంటే ఏరియల్ లో మాములుగా మనం సాధారణంగా వాడే ఫాంట్ల లా ఉంటాయి.

వేణు గోపాల్

కన్నగాడు said...

ఆఫీస్ వేసినప్పటినుండీ ఈ సమస్య ఉండేది (అంటే నేను సఫారీ ఎక్కువగా వాడను కాబట్టి వెంటనే గమనించలేదు) ఆఫీస్ తీసివేసి రీస్టార్ట్ చేయగానే తెగులు పోయింది.
@అబ్రకదబ్ర: ఇలాంటి వాటికి సమాధానం కొంచెం కష్టమే.

మరువం ఉష said...

Thanks Veven garu. It helps me am a FF fan and a vivid telugu font user. so many thanks to you ... :)

భావన said...

నాకు XP లో కూడా ఇదే సమస్య వచ్చింది, నేను చెప్పిన ఫాంట్ లే వాడమని, జ్యోతి గారు చెప్పినట్టు గుంట నక్క ను ఆరడి పెట్టేను సమస్య తీరి పోయింది. ధన్యవాదాలండి.

Post a Comment