గత టపాలో యూట్యూబ్ నుండి వీడియోలు మన బ్లాగులో ఎలా పెట్టాలో తెలుసుకున్నాము కదా. ఇపుడు యూట్యూబ్ గురించి మరి కొన్ని ట్రిక్కులు, టిప్పులు తెలుసుకుందాం.
యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చూస్తాము.అందులో మనకు కొన్ని చాలా నచ్చుతాయి. వాటిని ఆ సైట్ నుండి నేరుగా డౌన్లోడ్ చేసుకోలేము. కాని కొన్నిఉపకరణాల సాయంతో అది కూడా సులువే..
http://kissyoutube.com/
Youtube downloader
dvdvideosoft
చిన్న ఉదాహరణ ఇక్కడ చూడండి.
మీ వీడియో URL ఇవ్వండి.
మీ సిస్టం లో కావలసిన చోట సేవ్ చేసుకోండి.
ఇక మీకు నచ్చిన వీడియోనుండి ఆడియో మాత్రమే కావాలంటే ఎలా.. దానికీ ఓ చిట్కా ఉంది. http://listentoyoutube.com/ ఈ సైట్ కి వెళ్లి మీకు కావలసిన యూట్యూబ్ URL ఇవ్వండి.
ఇక దాని ఆడియో MP3 సేవ్ చేసుకోండి.
మరో తమాషా చేద్ద్దామా. ఒక వీడియోకి మరో వీడియోలోని ఆడియో మాత్రమే జోడిస్తే ఎలా ఉంటుంది. http://ytdub.com/ ఈ సైట్ సాయంతో అలా చేయొచ్చు.
ముందుగా మీకు కావలసిన రెండు వీడియోలు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మీరు చేయబోయే రీమిక్స్ కి పేరు ఇవ్వండి. Source లో మీ వీడియో ఐడి, మీరు ఇవ్వదలుచుకున్న ఆడియో యొక్క వీడియో ఐడి ఇచ్చి, ఇతర సెట్టింగులు ఎంచుకున్నాక Dubbo అనే బటన్ నొక్కండి. అంతే కొద్దిసేపట్లో మీ రీమిక్స్ రెడీ అవుతుంది.
చిరంజీవి పాత పాటకు చరణ్ లేటెస్ట్ పాట జత చేస్తే ఎలా ఉంటుంది అని నేను చేసిన ప్రయోగం చూడండి.
1 వ్యాఖ్యలు:
Download Tool ని ముందుగా Download చెసుకొవాల ! అది ఎలగో చెప్తారా
Post a Comment