Wednesday, December 28, 2011

Skype - ఎలా ఉపయోగించుకోవాలి??

Skype యిపుడు ఇంటర్నెట్ వాడేవారందరూ ఉపయోగించే మాట . సదుపాయం. ఎవరికైనా కాల్ చేసి మాట్లాడాలంటే ఫోన్ చార్జెస్ పడతాయి. లోకల్ అంటే తక్కువే కాని వేరే ఊర్లలో, రాష్ట్రాలలో , దేశాలలో ఉన్నవారితో ఫోన్లో మాట్లాడాలంటే బిల్లు పేలిపోతుంది. దానితో మన స్నేహితులు, బంధువులతో తరచూ మాట్లాడాలంటే భయమేస్తుంది తర్వాత వచ్చే బిల్లును తలచుకుంటే. కాని ఇంటర్నెట్ ద్వారా చాలా సులువుగా, ఖర్చు లేకుండా ఎంతసేపైన మాట్లాడుకోవచ్చు. ఒకేసారి ఒకరితో కాకుండా నలుగురైదుగురు కలిసి గ్రూప్ గా మాట్లాడ్డం, లేదా చర్చించడం చెయొచ్చు. ఇద్దరికి Skype అకౌంట్ ఉంటే ఫ్రీగా ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. అలాగే చాలా తక్కువ సొమ్ముతో లాండ్ లైన్, మొబైల్స్ కి కూడా కాల్ చెయొచ్చు... అంటే కాదండోయ్.. International Toll Free Numbers కి కూడా ఉచితంగా కాల్ చేసి ముచ్చట్లేసుకోవచ్చు.. ఎలాగంటారా?? అది ఎలాగో చూద్దాం..


ముందుగా Skype సైట్ కి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. http://www.skype.com/intl/en/home


ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవ్వడానికి కొంచం టైం పడుతుంది ఖంగారు పడకండి.. మొత్తం డౌన్లోడ్ అయ్యాక install చేసుకోండి.




ముందుగా మీరు కనెక్ట్ చేసిన హెడ్ ఫాన్స్, మైకు, స్పీకర్స్ అన్ని సరి చూసుకోండి. ఇక తర్వాత రంగంలోకి దిగడమే..

ఆ తర్వాత Skype లో మీకంటూ ఓ అకౌంట్ క్రియేట్ చేసుకోండి.



యిపుడు మీ desktop మీద Skype బొత్తాం (icon) కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకున్న ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.




లాగిన్ అయ్యారుగా ఇక మీ స్నేహితులను ఒక్కొక్కరిని ఆడ్ చేసుకోండి.




అందరిని ఆడ్ చేసుకున్న తర్వాత ఇలా లిస్టు కనిపిస్తుంది. మీరు మాట్లాడాలనుకున్నవారితో అలుపొచ్చేదాకా మాట్లాడండి .

4 వ్యాఖ్యలు:

Rajendra Devarapalli said...

జ్యోతి గారు నమస్తే,గూగుల్ ఎర్త్ ఎలా ఉపయోగించాలి,దానికి మన సిస్టం రిక్వైర్ మెంట్స్ ఏంటి,అందులో నుంచి వీడియో,ఇమేజెస్ ఎలా కాప్చర్ చెయ్యాలి అన్నవి ఒక టపా వెయ్యాల్సిందిగా మనవి.మా ఆఫీసులో మిగతావాళ్ళకు నేను నేర్పాలి :)

జ్యోతి said...

రాజేంద్రగారు, దానికంటే ముందు నేర్చుకోవాలి కదా. టైమ్ పట్టుద్దేమో. మీరు ట్రై చేయండి. హెల్ప్ ఫైల్ ఉంటుంది. గూగులమ్మ ఉండనే ఉంది. లేదంటే వెయిట్ చేయాల్సిందే..

Rajendra Devarapalli said...

జ్యోతి గారు తప్పకుండా ప్రయత్నిస్తానండి

Disp Name said...

ఈ మధ్య గూగుల్ వాడి జీమెయిల్ లో నే ఈ సులువు లన్నీ వచ్చేక ఈ స్కైప్ ప్రాచుర్యం తగ్గిందని విన్నాను ?

Post a Comment