బ్లాగు మొదలెట్టినపుడు ఒక మెయిల్ ఐడి ఇస్తాం కదా. అది జిమెయిల్ కావొచ్చు, యాహూ మెయిల్ లేదా రెడిఫ్ మెయిల్ కావొచ్చు. ఒక్కోసారి ఒకే మెయిల్ ఐడి తో ఎన్ని బ్లాగులైన మొదలెట్టవచ్చు అని తెలీక కూడా వేర్వేరు ఐడిలు క్రియేట్ చేసి బ్లాగులు ఓపన్ చేస్తుంటారు. (నేను మొదట్లో ఇలాగే చేసాను).. మనం జి మెయిల్ లో ఉండి యాహూ ఐడి తో ఉన్న బ్లాగు ఓపన్ చేయాలంటే వేరే బ్రౌజర్ లో ఓపన్ చేయాలి లేదంటే
బ్లాగు ఓపన్ చేయగానే జిమెయిల్ ఎగిరిపోతుంది
. ఒకటి కంటే ఎక్కువ బ్లాగులు ఉన్నపుడు వేర్వేరు బ్లాగులకు వేర్వేరు ఐడి పాస్వర్డ్ లు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. చిరాకేస్తుంది కూడా. అలాంటప్పుడు ఏం చేయాలి??.. దీనికి పరిష్కారం లేదా అంటే...
ఉంది కింద చెప్పినట్టుగా చేసి మీ బ్లాగులన్నీ ఒకే ఐడి గూటి కిందకు తెచ్చుకోండి..

ముందుగా మీరు మీ ఐడి తో మొదలెట్టిన బ్లాగు లో కి ప్రవేశించండి. లాగిన్ అయ్యాక settings > permissions క్లిక్ చేయాలి. అక్కడ బ్లాగుకు వేర్వేరు author లను ఆడ్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ బ్లాగు లాగిన్ కి చేర్చాలనుకున్న మెయిన్ మెయిల్ ఐడి (gmail, yahoo , rediff) ఇచ్చి ఆహ్వానించండి.

మీ ఇతర ఐడి లోకి వెళ్ళితే ఇలా ఆహ్వానం ఉంటుంది అది అంగీకరించండి.

యిపుడు మీరు మార్చాలనుకున్న ఐడి కి మీ బ్లాగు చేర్చబడింది.

మళ్ళీ వెనక్కి రండి.. మీ పాత బ్లాగు ఐడి తో లాగిన్ ఐన పేజిలోని permissions పేజికి వెళ్ళి మీరు ఇచ్చిన ఇంకో ఐడి కి ఆడ్మిన్ హక్కులు ఇవ్వండి.

ఇప్పుడు ఒకసారి మీ మెయిన్ ఐడి తో లాగిన్ అయ్యి dashboard ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. మీ బ్లాగు ఇక్కడికి క్షేమంగా చేరింది అని నిర్ధారణ అయ్యాక మొదటి మెయిల్ ఐడి పేజిలో ఆ ఐడి తీసేయండి. అంటే మీరు ఒకేసారి రెండు పేజీల్లో పని చేయాల్సి ఉంటుంది. ఒకేసారి చేయడం తికమకగా ఉంటే.. ఇలా అడ్రస్ మార్చాక రెండు రోజులు కొత్త మెయిన్ ఐడి తో లాగిన్ అయ్యి పని చేసుకోండి. తర్వాత పాత ఐడి తీసేయండి..
ఇలా మీరు వేర్వేరు ఐడి లతో ఉన్న బ్లాగులన్నీ ఒకే మెయిల్ ఐడి కి మార్చుకోవచ్చు.
10 వ్యాఖ్యలు:
జ్యోతి గురువు గారూ
నమస్కార బాణం.
సరదాకిలెండి.
మీరు నాకొక సహాయం చేసి పెట్టాలి.
భూమిక వెబ్ సైట్ లో ఆర్టికల్స్ అప్ లోడింగ్ చాలా సమస్యాత్మకంగా మారింది.
మొత్తం మేటర్ అప్లోడ్ అవ్వడం లేదు.
ఒకసారి అప్లోడ్ చేసిన ఆర్టికల్స్ డిలీట్ అవ్వడం లేదు.
ప్లీజ్ జ్యోతి గారూ ఒక్క సారి చూస్తారా?
సత్యవతి
www.bhumika.org
మంచి అలోచన . మీరు నేర్చుకున్నవి అందరికీ బొమ్మలతో సహా వివరిస్తున్నారు . అభినందనలు !
Hai Jyothi garu ,
It's very important blog for others...........
and thanks Keep it up.>>>>>>>>>>>
Hai Jyothi garu,
It's a very nice blog to others............Thank you. Keep it up .>>>>>>>>>>>>>>>...
నమస్తే మేడం.. దయచేసి నా సమస్యకి పరిష్కారం చూపగలు. నా బ్లాగ్ లో కొంత మంది ప్రముఖుల ఫోటొస్ పెట్టి ఆ ఫోటోస్ క్లిక్ చేస్తే వారికి సంబంధించిన విషయాలు, వారికి సంబంధించిన మరిన్ని ఫోటోస్ వచ్చేలా చేయడం ఎలా? తెలియచేయగలరు..
ప్రవీణ్ గారు చేయొచ్చు.
మీరు బ్లాగులో ఫోటోలు అన్ని వరుసగా అప్లోడ్ చేసుకుని ఒక్కో ఫోటో సెలెక్ట్ చేసుకుని Add Link క్లిక్ చేసి మీరు ఇవ్వాలనుకున్న వివరాలు పేజ్ url ఇచ్చి సేవ్ చేయండి. ఇలా అన్నింటికి చేసుకుని పోస్టు ఫబ్లిష్ చేయాలి. తర్వాత ఒక్కో ఫోటో క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన లింకుకు వెళుతుంది..
Thank you so much medam...
విలువైన ఇన్ ఫర్మేషన్ ఇచ్చారు, జ్యోతి గారూ!
ఇదివరకు chitralekhanam.blog ను ముద్రించుకున్నాను. కానీ, ఎందువలననో అది క్రాష్ ఐనది, కారణాలు నా చిన్నిబుర్రకు బోధపఢలేదు, నాలుగేళ్ళ కష్టం, ధారపోసిన శ్రమ వృధా ఐనవి, ఉసూరుమనిపించింది.
మరి ఒకే ID మీద అనేకబ్లాగులు చేస్తున్నాము, వాటిలో ఒక బ్లాగు మాత్రమే క్రాష్ ఐనదనుకోండి, అప్పుడు ఐ.డి. కూడా ఏమౌతుంది? మిగతా బ్లాగుల పరిస్థితి క్షేమంగానే ఉంటాయా?
ఇవీ నా డౌట్సు?
మీరు చెప్పిన అడ్రస్ ఒక డమిళ బ్లాగుకు వెళుతుంది. అడ్రస్ కరెక్టేనా?? అసలు బ్లాగు క్రాష్ అయ్యే సమస్యే లేదు..పోతే అన్నీ పోతాయి...
మీరు నాకు మెయిల్ చేయగలరా.. jyothivalaboju@gmail.com
మంచి సమాచారం... ధన్యవాదాలు.. చైతన్య
http://sskchaithanya.blogspot.com
Post a Comment