Thursday, October 18, 2012

యూనికోడ్ ఫాంట్లు / ఖతులు




అంతర్జాలంలో మనమంతా రాసేది యూనికోడ్ లో.అసలు ఈ యూనీకోడ్ అంటే ఏంటి? అంటే ఇక్కడ చూడండి.. యూనీకోడ్

మన కంప్యూటర్లో అందరికి తెలిసిన ఫాంట్ లేదా ఖతి గౌతమి మాత్రమే. ఇది విండోస్ వాడేవారికి డీఫాల్టుగా ఉంటుంది. అను సాఫ్ట్ వేర్ లో ఎన్నో అందమైన ఖతులు ఉన్నాయి కాని అవి మనం వాడలేము. కాని కొందరు ఔత్సాహికులు యూనికోడ్ లో వాడుకోవడానిక అనువుగా కొన్ని ఖతులు తయారు చేసారు. వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని మన సిస్టమ్ లో వేసుకుంటే మనం రాసుకున్న డాక్యుమెంట్ , పేర్లు, ఇంగ్లీషులోలాగే దాని ఫాంట్/ఖతి మార్చుకోవచ్చు.. మరి ఇవి ఎక్కడ లభిస్తాయి అంటారా?? క్రింద లింకులు చూడంఢి..

గౌతమి  : http://www.microsoft.com/typography/fonts/font.aspx?FMID=1570 

పోతన : http://www.kavya-nandanam.com/dload.htm.old

వేమన : http://www.kavya-nandanam.com/dload.htm.old

లోహిత్ తెలుగు : https://fedorahosted.org/releases/l/o/lohit/lohit-telugu-ttf-2.5.0.tar.gz


జిస్ట్ ఖతులు : http://www.aponline.gov.in/APPortal/TeluguSoftware/GIST-TT-Fonts/Installer.rar

వజ్రం : http://kinige.com/fonts/vajram/

 స్వర్ణ : http://kinige.com/kbook.php?id=1245&name=Suravara+Swarna+free+Telugu+Unicode+font


కొన్ని ఖతుల అందచందాలు పైన చిత్రంలో ఉన్నాయి చూడండి. జిస్ట్ ఖతులలో అమ్మ, అమృత, ఆత్రేయ, చందన,  ద్రౌపది, గోల్కొండ, కృష్ణ, మను, మేనక, పావని,  ప్రియ, రజని, సంజన, సితార, స్వామి, వెన్నెల మొదలైనవి ఉన్నాయి. ఇవి కూడా ఉపయోగించుకోవచ్చు.

ఇక ఈ ఫాంట్స్, ఖతులు ఎలా దింపుకుని మన కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకోవాలో చూద్దాం

1. ఈ లింకులను క్లిక్ చేసి ఆయా ఫాంట్లను డౌన్లోడ్ చేసి మీ సిస్టమ్లో ఒక చోట సేవ్ చేసుకోంఢి. జిప్ చేసి ఉంటే అన్ జిప్ చేసుకోండి..


2. మీ కంప్యూటర్లో  "Start " బటన్ ద్వారా "Control Panel"  లోకి వెళ్ళండి. అక్కడ "Fonts"  అనే ఎంపిక మీద మౌస్ డబల్ క్లిక్ చేయండి.

3. ఇంతకుముందు దింపుకున్న పాంట్లను (True Type Fonts) కాపీ చేసుకుని ఈ "Fonts" లో సేవ్ చేయండి.. అంతే కొత్త ఫాంట్స్/ ఖతులు మీ కంప్యూటర్లోకి వచ్చేసినట్టే..


4 మీకు కావల్సిన అప్ప్లికేషన్‌లో మిగతా ఖతులతో పాటు నూతన ఖతి కూడా ఉంటుంది.
               

చాలా ఈజీగా ఉంది కదా.. ఇంకెందుకు ఆలస్యం. తెచ్చేసుకోండి కొత్త ఖతులు..

5 వ్యాఖ్యలు:

శ్రీ said...

dhanyavaadaalu jyoti gaaroo!...@sri

arjun said...

Windows Xp వాడుతున్నాను..తెలుగు ఫాంట్ డౌన్లోడ్ చేశాను...మరి ఆఫీస్ వర్డ్ లో టైప్ చేద్దామంటే ఇంగ్లీష్ లెటర్స్ వస్తున్నాయి...ఎలా చేయ్యాలి.

జ్యోతి said...

Arjunగారు డౌన్లోడ్ చేసాక ఫాంట్స్ లో పెట్టారా.. వర్డ్ లో టైప్ చేసేటప్పుడు ముందు తెలుగు టైపింగ్ టూల్ స్టార్ట్ చేసి, నచ్చిన పాంట్ సెలెక్ట్ చేసుకుని టైప్ చేయండి లేదా టైపింగ్ అయ్యాక మొత్తం మాటర్ సెలెక్ట్ చేసుకుని ఫాంట్ మార్చి సేవ్ చేసుకోండి. మరి మీరెలా చేస్తున్నారో..

aadhi said...

తెలుగు ఫాంట్ ను డౌన్లోడ్ చేయ్సినంత మాత్రన మ.స వర్డ్ లో తెలుగు రాదు .మైక్రో సాఫ్ట్ వారి ఇన్పుట్ టూల్ ఇన్స్టాల్ చ్రేయ్సుకోవాలి .కంట్రోల్ పనెల్ లో సెట్టింగ్స్ ఉంటై.

aadhi said...

తెలుగు ఫాంట్ ను డౌన్లోడ్ చేయ్సినంత మాత్రన మ.స వర్డ్ లో తెలుగు రాదు .మైక్రో సాఫ్ట్ వారి ఇన్పుట్ టూల్ ఇన్స్టాల్ చ్రేయ్సుకోవాలి .కంట్రోల్ పనెల్ లో సెట్టింగ్స్ ఉంటై.

Post a Comment