Friday, June 25, 2010

బ్లాగులో కామెంట్లు డిలీట్ చేయాలా??

మీ బ్లాగులో ప్రచార, అనవసర, అసభ్యకరమైన , అభ్యంతరకరమైన కామెంట్లు వస్తున్నాయా?? దానికోసం ప్రతీ బ్లాగరు మాడరేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటారా?? అవసరం లేదంటాను. మనకు ఇష్టం లేని కామెంట్లు చాలా సులువుగా తీసేయొచ్చు. ఇదిగో ఇలా ...



మీ బ్లాగులో వచ్చిన కామెంట్లు డిలీట్ చేయాలంటే ముందుగా మీ బ్లాగులోకి లాగిన్ అవ్వాలి. తర్వాత మీరు తీసేయాలనుకున్న కామెంట్ పక్కన చిన్న బాక్స్ లాంటిది కనిపిస్తుంది . అది క్లిక్ చేయండి.




పైన చిత్రంలో లా కన్పిస్తుంది. డిలీట్ కామెంట్ అంటే కామెంట్ పోతుంది కాని ఆ కామెంట్ రాసినవారి పేరు మీ బ్లాగులో ఉంటుంది. అలా కాకుండా ఆ కామెంట్ మొత్తాన్ని తీసేయాలంటే Remove forever అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కామెంట్ ని డిలీట్ చేయండి. అంటే ఆ కామెంట్ పూర్తిగా మాయమవుతుంది.


ఇక మీరు వేరే బ్లాగులో రాసిన కామెంట్ తీసేయాలనుకుంటే ఇదే విధంగా కామెంట్ కింద కనిపించే చిన్ని బాక్స్ ని క్లిక్ చేసి కామెంట్ తీసేయండి. మీరు రాసిన కామెంట్ పోయినా మీ పేరు మాత్రం ఉంటుంది. అది ఆ బ్లాగు ఓనర్ మాత్రమే తీసేయాలి పైన చెప్పినట్టుగానే.. ఆ హక్కులన్నీ ఆ బ్లాగ్ ఓనర్ కే ఉన్నాయి ఏ కామెంట్ తన బ్లాగులో ఉండాలో, ఉండకూడదో. ..

ఎంజాయ్...

5 వ్యాఖ్యలు:

శరత్ కాలమ్ said...

అలా కామెంట్లు తీసివేసేలోగా ఆ కామెంట్లు అందరూ చదివి పండగ చేసుకుంటారు :))

జ్యోతి said...

శరత్ గారు, ఇలాటి కామెంట్లు రాసేవారిని మార్చలేము. వాళ్లు విద్యావంతులైన మానసిక రోగులు. కాని మన బ్లాగులోని అశుద్దాన్నైతే తీసేయగలం కదా.. ఇది మన చేతిలోని ఉంది . ఏమంటారు??

శరత్ కాలమ్ said...

Prevention is better than cure.

నా బ్లాగులో అశుద్దం పడ్డాక తీసివేయడం కంటే అసలు అశుద్ధం పడకుండానే చూసుకుంటాను. బయటెక్కడో నా గురించి పడితే అది వేరు విషయం అనుకోండి.

ప్రభ అశోక్ said...

థాంక్స్ జ్యోతి గారూ,

ఈ సంగతి తెలియక, పోస్ట్ డిలీట్ చేశాను. ఇప్పుడు కామెంట్ మాడరేషన్ ఎనేబుల్ చేశాననుకోండి...

జ్యోతి said...

ప్రభగారు,
కంప్యూటర్ పైన పని చేస్తున్నప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా గూగులమ్మని అడిగితే సరి. తప్పకుండా సమాధానం వస్తుంది.

Post a Comment