Sunday, June 13, 2010

హారం - తెలుగు బ్లాగుల అగ్రిగేటర్



తెలుగు బ్లాగులను ఒక చోట చేర్చి వాటి విశేషాలను మనకు అందించే మరో అగ్రిగేటర్ హారం. భాస్కర్ రామిరెడ్డి నిర్వహిస్తున్న ఈ హారం ఎన్నో ప్రత్యేకతలతో మనను అలరిస్తుంది. ఇటీవల మరిన్ని హంగులతో మనముందుకు వచ్చింది.

హారంలోని వివిధ విభాగాల గురించి తెలుసుకుందాం. హారం మొదటి పేజిలో ఎడమ వైపు భాగంలో రచయితల పేర్లు వారు వ్రాసిన వ్యాసాలు లేదా వ్యాఖ్యల కోసం వినియోగించడం జరిగింది. మధ్య భాగంలో రచయితల వ్యాసాలు, లేదా వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు చూపబడతాయి. కుడి భాగంలో హారం చేసే రకరకాల విశ్లేషణలు చూపబడతాయి.



హారంలో మరిన్ని సదుపాయాలు పొందుపరచడమైనది. అందులో కొన్ని

1) గతవారం రోజుల్లో ఎక్కువగా ఏబ్లాగులు పాఠకులు చదివారో చూపిస్తుంది. ఈ టపాల/వ్యాసాల పట్టిక రోజుకొక సారి మాత్రమే మారు తుంది.
2)అలాగే తక్కువగా వీక్షించిన వ్యాసాలను కూడా క్రోడీకరించి సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. ఇదికూడా రోజుకొక్కసారే మారుతుంది.
3) అంతర్జాల పత్రికలలో వచ్చిన వ్యాసాలను పదిహేను రోజుల పాటు హోమ్ పేజీలో చూడొచ్చు. అంటే చందమామ,జ్యోతి,స్వాతి,భూమి లాంటి పత్రికలు కూడా ఉంటాయి.
4) పద్య, సాహిత్య ,వార్తా బ్లాగులను అలాగే కవితా బ్లాగులను విడిగా చూపడమైనది.
5) వివిధ విభాగాల్లో వ్రాసిన వ్యాసాలను కూడా క్రోడీకరించి [సాధ్యమైనంత తప్పులు లేకుండా ] చూపడానికి కూడా అనువుగా హోమ్ పేజీని డిజైన్ చేయడమైంది. కుడివైపు ఇచ్చిన ఆప్షన్ లో మీకు కావలసిన విభాగంలోని బ్లాగులు చూడవచ్చు. అంటే మీరు చాలా సులభంగా పద్యాలను, పాటలను, సంగీతపు వ్యాసాలను, హాస్య/వ్యంగ్య వ్యాసాలను, సాంకేతిక వ్యాసాలను చదువుకోవచ్చు.
6) కామెంట్ల పేజీలో ప్రత్యేకించి పాటల టపాలను చూపించడం జరిగింది.
7) హారంలో బ్లాగు టపాలే కాక ప్రతిబ్లాగులోని వ్యాఖ్యలు కూడా వేరే పేజిలో తెరిచి చదువుకోవచ్చు. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

10 వ్యాఖ్యలు:

ప్రభ అశోక్ said...

how about the section..
' వీటినీ ఒక లుక్కెయ్యండి!
What is the criteria for a post to appear there?

జ్యోతి said...

ప్రభగారు,
బహుశా అవి తక్కువగా చదివిన టపాలు అయ్యుంటాయి. కనుక్కుని చెప్తాను. క్రైటీరియా అంటే ఏ విభాగంలో మీరనేది. హారంలో ఏ విభాగం కూడా manual గా జరగదు.

భాస్కర రామిరెడ్డి said...

జ్యోతీగారూ, హారం ను పరిచయం చేసినందుకు ముందుగా మీకు అభినందనలు. ఇక్కడ వచ్చే ప్రశ్నలన్నింటికి సమాధానాలివ్వడానికి ప్రయత్నిస్తాను.

భాస్కర రామిరెడ్డి said...

ప్రభ అశోక్ గారూ హారంలో వీటినీ ఓ లుక్కెయ్యండి అనేవి పాఠకులు తక్కువగా చదివిన టపాలు. అంటే దానర్థం మరీ అతి తక్కువగా చదివనవి లేదా ఒకటో రెండో హిట్లు వచ్చినవి కాదు. వీటిని కూడా వీక్షకులు మరీ బాగా కాకుకున్నా ఓ మాదిరి చదివినవి. ఇక ఎన్ని హిట్లు వస్తే అక్కడ వస్తుంది అనేదానికి సమాధానం లేదు. ఈ నంబరు ప్రతిరోజూ మారుతుంది. అయితే మూడు కంటే తక్కువ హిట్స్ [ అంటే ముగ్గురు వేరు వేరు వ్యక్తులు] వచ్చిన టపాలు ఇక్కడ కనిపించవని కచ్చితంగా చెప్పగలను.

జ్యోతి said...

భాస్కర్ గారు, కామెంట్ల విభాగంలో మీరు ఒకే బ్లాగులోని పాటల లింకులు ఇస్తున్నారు. పాటల బ్లాగులు ఎన్నో ఉన్నాయిగా..

భాస్కర రామిరెడ్డి said...

Jyothy, Can you please give me few links. I think am missing links.

ramnarsimha said...

Sir,

Your blog is very fine..

But we may loose our privacy..

భాస్కర రామిరెడ్డి said...

@Ramanarsimha,రామనర్శింహ గారూ, మీ వ్యాఖ్య సరిగా అర్థం చేసుకో లేక పోతున్నాను. Could you please eloborate on that?

rohini said...

భాస్కర్ గారు,నమస్తె,ముందుగా నూతన సం్వత్సర శుభాకాంక్షలు
నేను హారం లో నా బ్లాగ్ ని చేర్చుకోవాలని అనుకుంటున్నాను
నాకు మార్గ దర్సకం చేయగలరని భావిస్తూ మీ సహాయం కోసం
ఎదురుచూస్తు వుంటాను

క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగు said...

https://www.blogger.com/profile/12121701681361463485
అహో

Post a Comment