మీ కీబోర్డ్ లో కుడివైపు అన్నిటికంటే పైన ఉన్న లైన్లో చూడండి. F కీస్ పక్కన printscreen అనే కీ ఉంటుంది. మీకు కావలసిన పేజికి వెళ్ళి ఆ కీ ని నొక్కండి. అపుడు ఆ పేజి ఒక ఇమేజ్ లా సేవ్ అయిందన్నమాట.
యిపుడు start మెనూలో paint ఓపన్ చేసి అక్కడ మౌసే రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేయండి.ఇంతకు ముందు మీరు screenshot తీసుకున్నా చిత్రం అక్కడ ప్రత్యక్షమవుతుంది. దానికి ఒక పేరు ఇచ్చి సేవ్ చేసుకోండి.
మళ్ళీ ఆ చిత్రాన్ని మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్ లో ఓపన్ చేసి అనవసరమైన భాగం కట్ చేసి సేవ్ చేసుకోండి . యిపుడు మీకు కావలసిన చిత్రం తయారుగా ఉంది. ఒక్క విషయం ఎపుడు కూడా jpeg లేదా png లో సేవ్ చేసుకోండి.
యిపుడు windows7 లో snipping tool సాయంతో ఇంత కష్టపడకుండా చాల సులువుగా screenshot తీసుకోవచ్చు. start మెనూ నుండి snipping tool సెలెక్ట్ చేసుకుని మీకు కావలసిన మ్యాటర్ లేదా చిత్రాన్ని screenshot తీసుకోండి. మీరు ఆ పేజిలోనే కావలసినంత మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు.మీరు సెలెక్ట్ చేసుకున్నా భాగాన్ని సేవ్ చేసుకోండి అంతే...
