Tuesday, August 24, 2010
మాలిక ... తెలుగు బ్లాగుల సంకలిని
ఇటీవల మొదలైన మరో తెలుగు బ్లాగుల సంకలిని మాలిక. బ్లాగులలో ప్రచురించబడ్డ టపాలు, వ్యాఖ్యలు చాలా వేగంగా ఈ సంకలినిలో ప్రత్యక్షమవుతాయి. ఇదే ఈ మాలిక ప్రత్యేకత. అనతికాలంలోనే అత్యంత బ్లాగు ప్రజాదరణ పొందిన మాలిక గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
మాలిక ఓపన్ చేయగానే ముందుగా ఆకర్షించేది అందమైన ఫోటో పక్కనే వెబ్ పత్రిక వివరాలు. ఫోటోలు,వాటిని తీసిన బ్లాగర్ వివరాలు అన్ని పేజీలలో కనబడతాయి. ఈ ఫోటోలతో పాటు వెబ్ పత్రికలు కూడా అన్నిపేజీల్లో వస్తాయి.మాలికలో కనబడే వెబ్ పత్రికల టపాలు "రియల్ టైమ్" లో వస్తాయి. అంటే, అక్కడ వాళ్ళు ప్రచురించిన వెంటనే ఆలస్యం లేకుండా ఇక్కడ కనబడతాయి. ఇంతేకాక, మీరు రీలోడ్ చేసిన ప్రతిసారి పేజీలోని ఫోటో, వెబ్ పత్రికలు మారిపోతూ ఉంటాయి.
మాలికలోని టపాల పేజి క్లిక్ చేయగానే వివిధ బ్లాగుల్లో ప్రచురించబడిన కొత్త టపాల వివరాలు కనిపిస్తాయి. వాటి లంకెలు పట్టుకుని సదరు బ్లాగుకు వెళ్లవచ్చు. టపా రాసిన ఐదు నిమిషాలలోపల మాలికలో కనిపిస్తుంది.
మాలికలో ఉన్న మరో ఫీచర్ వ్యాఖ్యలు.. వివిధ బ్లాగు టపాలకు చదువరుల స్పందన ఇక్కడ చూడవచ్చు. ఈ వ్యాఖ్యలు మొత్తం మాలికలోనే చూడవచ్చు.
మాలికలో తెలుగు ఫోటో బ్లాగులకు ప్రత్యేకమైన విభాగం కేటాయించారు. అందమైన చిత్రాలతో కళకళలాడే బ్లాగులు ఇక్కడ చూడండి.
మీ బ్లాగు ప్రారంభించగానే అందరికి తెలియజేయాలనుకుంటే వెంటనే ఇక్కడ వివరాలు చూడండి. ఎటువంటి బ్లాగులు అనుమతిస్తారో మాలిక నిర్వాహకులు ఖచ్చితంగా చెప్తున్నారు..
బ్లాగు టపాల్లా పెద్ద పెద్ద వ్యాసాలు రాసే ఓపిక, ఆసక్తి లేనివారు ఇక్కడ కేక పెట్టొచ్చు అంటున్నారు. మీ పని చేసుకుంటూనే ఇక్కడ ముచ్చట్లాడుకోండి మరి..
Labels:
అగ్రిగేటర్లు
5 వ్యాఖ్యలు:
క్షమించాలి... కొన్ని మార్పులు.
---
టపా రాసిన రెండు నిమిషాలలోపల మాలికలో కనిపిస్తుంది
----
రెండు నిమిషాలని కాదు గాని, ఐదు నిమిషాల లోపు కనబడుతుంది.(ఇది కూడా బ్యాండ్విడ్త్ ను బట్టి అప్పుడప్పుడు మారుతుంది)
----
పాత వ్యాఖ్యలు కూడా చూసే సౌకర్యం ఉంది.
----
అలాంటి సౌకర్యం ఏమీ ప్రస్తుత మాలికలో లేదు కదా?
:))
ఏకలింగంగారు,
ఏమోనండి నేను టపా రాసిన రెండు నిమిషాల్లోనే మాలికలో కనబడేది అందుకే అలా రాసాను. ఇక పాత వ్యాఖ్యల గురించి రాసింది తప్పైనా ఇలా చేయడానికి అవకాశం ఉందేమో చూడండి. బ్లాగర్లందరికి పనికొస్తుంది.
https://www.blogger.com/profile/12121701681361463485
బాగుందిబ్లాగ్గురువు
Post a Comment