Monday, August 23, 2010

వర్డ్ లో తెలుగు రావట్లేదా?

కంప్యూటర్లోగాని, బ్లాగులోగాని తెలుగు రాయడానికి చాలామంది బరహా వాడుతున్నారు. కాని వర్డ్ డాక్యుమెంట్ లో తెలుగులో రాయలేకుండా ఉన్నాం. తెలుగు మ్యాటర్ అంతా చిన్న చిన్న డబ్బాలుగా కనిపిస్తుంది అని, అలాగే ఏదైనా నచ్చిన బ్లాగులలోని మ్యాటర్ ని కాపీ చేసి వర్డ్ లో సేవ్ చేసుకుందామన్నా ఇలాగే డబ్బాలుగా వస్తుందని చాలామంది కంప్లెయింట్ చేస్తున్నారు.

దానికో పరిష్కారం ఉంది. ముందు మీ కంప్యూటర్లో తెలుగు ఎనేబుల్ చేసి ఉందా చెక్ చేసుకోండి. తరవాత Wordలోని Format మెనూలో Styles and Formatting అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన వెంటనే కుడిచేతి వైపు ప్రత్యక్షమయ్యే విభాగంలో New Style అనే బటన్ ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ప్రత్యక్షమయ్యే బాక్సులో Formatting అనే బాక్స్ వద్ద Gautami అనే ఫాంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అదే బాక్స్ లోనే Add to Template అనే ఆప్షన్ టిక్ చేసి పెడితే ఇకపై Styles మెనూలో Style1 పేరిట ఆ కొత్త స్టైల్ వస్తుంది. ఇక ఎప్పుడు తెలుగులో టైప్ చేయాలన్నా ఆ కొత్త స్టైల్ ని ఎంచుకుంటే సరిపోతుంది. తెలుగు నేరుగా వచ్చేస్తుంది. ఇదే కాక క్రింద వీడియోలో చెప్పినట్టు కూడా చేయవచ్చు. ఈ వీడియో తయారు చేసింది శ్రీ నల్లమోతు శ్రీధర్ గారు.





వర్డ్ 2007 లో తెలుగు డబ్బాలుగా కనిపిస్తుందా? ఐతే ఇలా ప్రయత్నించి చూడండి.. వర్డ్ 2007 లో తెలుగు

0 వ్యాఖ్యలు:

Post a Comment