మీ బ్లాగులోని ఏదైనా టపాకి పాట జత చేయాలనుకుంటున్నారా? అది మీ దగ్గర ఉన్న పాట అయినా, నెట్ లో ఉన్న పాట అయినా సరే ,చాలా సులువుగా మన టపాలో చేర్చవచ్చు. దానికోసం esnips, లేదా divshare అనే సైట్లు ఉపయోగపడతాయి.
ముందుగా esnips లో మీ పేరుతొ అకౌంట్ తెరవండి. తర్వాత మీ సిస్టంలో ఉన్న పాటను మీ అకౌంట్ లో అప్లోడ్ చేయండి. దీనికి కొంత సమయం పడుతుంది. పాట అప్లోడ్ అయ్యే సమయంలో ఆ విండోలో వేరే ఏవి ఓపన్ చేయకూడదు. అప్లోడ్ ఆగిపోతుంది.
పాట పూర్తిగా అప్లోడ్ అయ్యాక ఆది ఉన్న ఫోల్డర్ తెరిచి చూస్తే ఇలా కనిపిస్తుంది ప్లేయర్. ఇక్కడ ఇలాగే వినొచ్చు. మరి బ్లాగులో ఎలా పెట్టాలి అంటే.. ఇక్కడ కనిపిస్తున్న mp3 widgets ని సెలెక్ట్ చేసుకోవాలి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన ప్లేయర్ ని ఎంచుకుంటే ఆ ప్లేయర్ యొక్క html కోడ్ వస్తుంది. ఆ కోడ్ ని కాపీ చేసుకుని మీ బ్లాగు టపాలో ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేయండి. ఇలా ఎన్ని పాటలైనా, ఆడియో అయినా టపాలో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మామూలుగా పబ్లిష్ చేయండి. అంతే..
అందమైన ప్లేయర్లో మీకిష్టమైన పాట వినవచ్చు.
అలాగే మీకు కావాల్సిన పాటను,మీరు అప్లోడ్ చేయకున్నా, వేరేవాళ్ళ పాటలైనా కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకుని ఆ కోడ్ ని మీ బ్లాగులో పెట్టుకోవచ్చు.
7 వ్యాఖ్యలు:
naaku chaala useful post.. thanks a lottttttttt
హమ్మయ్య బతికించారు...మీరు మాకు thanks చెప్పాలి. నేను పప్పుగారే కదా మీరు ఈ టపా పెట్టడానికి కారకులం :P
సౌమ్య నువ్వెప్పుడు అడిగావు?? మొన్న ఒకేరోజు శ్రీనివాస్ గారు,కల్పన ఇదే అడిగారు. ఇలా ఎందమందికి చెప్తూ కూర్చోవాలని ఇక్కడ టపాయించాను. ఇంకా ఏవైనా కావాలంటే నాకు మెయిల్ పెట్టు.. అసలైతే నేను వీడియో, ఆడియో పెట్టడం ఎలాగో రాసేసాననుకున్నాను. :)
హి హి నేను శ్రీనివాస్ గారినడిగితే, ఆయన మిమ్మల్ని అడిగారు...అదీ సంగతి.
ఇది పెట్టి మంచి పని చేసారు. నాకు చాలా సందేహాలు నివృత్తి అయ్యాయి.
మీరిచ్చిన సమాచారం చాలా ఉపయోగరమైనది..చాలా థ్యాంక్స్..! నాకు రెండు సందేహాలు..ప్రస్తుత ఆర్టికల్ సంబందం లేనిది..దయచేసి చెప్పగలర్..PDF గురించి 1. పి.డి.ఎఫ్ ఫైల్ ని బుక్‌లోకి చేసాక..దానిని కేవలం మన బ్లాగ్ కో లేక సైట్ కొ తెచ్చుకోగలం..ఇది బానే ఉంది..కాని ఒక ఫైల్ లాగ మన సిస్టంలో డౌన్‌లోడ్ చేసుకోలేము..మళ్ళి పి.డి.ఎఫ్ ఫైల్ కిందనే డౌన్‌లోడ్ అవుతున్నది. అలా కాక, ఆన్‌లైన్ కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడ సిస్టంలోకి పుస్తకం లాగనే డౌన్ లోడ్ చేసుకునే విదంగా చేయడానికి అవకాశం ఉన్నదా..?
2. నేను..ఆఫీస్ వర్డ్‌లో తెలుగులో టైప్ చేసాక ఆ ఫైల్ ని పి.డి.ఎఫ్ లోనికిమార్చాక చూస్తే..తెలుగు అక్షరాలు అందులో కనపడట్లేదు..చుక్కులలాగ కనపడుతున్నాయి.! .మరి.. తెలుగులో పి.డి.ఎఫ్ లో కి మారవా ..! దయచేసి చెప్పగలరు
how to edit background
మరింకెందుకు ఆలస్యం... పెడితే పోలా...మీరు ఆదిరిపోలా...ధన్యవాదాలు.
http://sskchaithanya.blogspot.com
Post a Comment