Tuesday, February 2, 2010

pdf ని e - బుక్ చేయాలనుకుంటున్నారా?

ఇంతకు ముందు మన డాక్యుమెంట్ ని పిడిఎఫ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా.. ఇపుడు ఆ పిడిఎఫ్ ఫైల్ ని ఒక అందమైన e బుక్ లా ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ పుస్తకాన్ని ప్రతి పేజి తిరగేస్తు చదవొచ్చు. దానికోసం సైటుకు వెళ్లి మీ అకౌంటు క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గరున్న పిడిఎఫ్ ని అప్లోడ్ చేసి మంచి టైటిల్, మిగతా వివరాలు ఇవ్వండి. కొద్ది సమయంలో మీ పిడిఎఫ్ అందమైన పుస్తకంలా తయారవుతుంది. దాని ఎంబెడ్ కోడ్ తెచ్చి బ్లాగులో కూడా పెట్టుకోవచ్చు. చాలా సులువైన పద్ధతి.. ఇలా ఉంటుంది ఆ పుస్తకం...


గూగుల్ డాక్స్ లో అప్లోడ్ చేసిన పిడిఎఫ్.

Scribd లో అప్లోడ్ చేసిన పిడిఎఫ్.

ఇంటర్నెట్‍లో తెలుగు వెలుగులు on Scribd" href="http://www.scribd.com/doc/3816149/-" style="margin: 12px auto 6px; font: 14px Helvetica,Arial,Sans-serif; display: block; text-decoration: underline;">ఇంటర్నెట్‍లో తెలుగు వెలుగులు

15 వ్యాఖ్యలు:

Unknown said...

ఇలా వేరే వెబ్ సైట్ పై ఆధార పడకుండా ఏదైనా software ఉందా? బ్లాగ్ కనే కాదు, సపోజ్ నాకు ఒక వెబ్ సైట్ ఉండి నేను దాంట్లో వేరే ఎవడికో అడ్వర్టైజ్ చేయటం దేనికి అనుకుంటే? డబ్బులకైనా ఫరవాలేదు, మన స్వంత పేరు వుండేట్టు ఏదైనా software ఉంటే దయచేసి చెప్పండి

Rohiniprasad Kodavatiganti said...

తెలుగు యూనీకోడ్‌లో పీడీఎఫ్ 995 ఫైళ్ళను తెలుగు యూనీకోడ్ MSWord ఫైళ్ళుగా మార్చేందుకేదైనా software ఉందా?

Unknown said...

రోహిణీ ప్రసాద్ గారు,

ఈ లంకె చూడండిః http://www.pdftoword.com/
పీ.డీ.ఎఫ్ కి మరియు పి.డి.ఎఫ్995 కి తేడా లేదనుకుంటా.

జ్యోతి said...

Vimal గారు,
ఇదిగోండి ఈ సాఫ్ట్ వేర్ ప్రయత్నించి చూడండి.

రోహిణిప్రసాద్ గారు,
ఇంగ్లీషులో ఐతే పిడిఎఫ్ నుండి వర్డ్ కి మార్చుకోవచ్చు. కాని తెలుగు సాధ్యం కాదనుకుంటాను. నేను ఎన్నోసార్లు ప్రయత్నించి వదిలేసా. మరి ఈ మధ్య కొత్త సాఫ్ట్ వేర్ చూడలేదు.

Unknown said...

జ్యోతి గారు, చాలా థాంక్స్. సాఫ్ట్ వేర్ చాలా బాగుంది, ఇలాంటివి వేరేవి ఉన్నా కాని చెప్పండి. ఆల్టర్నేటివిస్ అన్ని చూస్తే బాగుంటుంది

జ్యోతి said...

Vimalగారు,

తప్పకుండా చెప్తాను. ఇలాటివే అంటే గూగులమ్మని అడగండి Flip Book Software అని. చాలా మంచిదిలెంఢి. ఎన్నో దారులు చూపిస్తుంది..

sai sravya varali kovvali said...

jyoti gaaru,

very helpful. kaani naado doubt (vere topic gurinchi). naa blog lo header colour badulu naaku O boma pettalni undi. elaa pettaali? template ela maarchaali? kasta chppara please?


email: sravyavarali@yahoo.co.in

Ravi said...

దానికోసం ఈ సైటుకు వెళ్లి మీ అకౌంటు క్రియేట్ చేసుకోండి. <<<<
Which site Madam. I am unable to follow. Pl.help.

జ్యోతి said...

Ravi garu

I have corrected the link now.. chek it..

సవ్వడి said...

జ్యోతి గారు! నేను కొత్త బ్లాగర్ని. కామెంట్లు డిలీట్ చెయ్యాలంటే ఏం చెయ్యాలి. కాస్త చెప్పండి.

కమల్ said...

మీరిచ్చిన సమాచారం చాలా ఉపయోగరమైఅన్ది..చాలా థ్యాంక్స్..! నాకు రెండు సందేహాలు.. 1. పి.డి.ఎఫ్ ఫైల్ ని బుక్‌లోకి చేసాక..దానిని కేవలం మన బ్లాగ్ కో లేక సైట్ కొ తెచ్చుకోగలం..ఇది బానే ఉంది..కాని ఒక ఫైల్ లాగ మన సిస్టంలో డౌన్‌లోడ్ చేసుకోలేము..మళ్ళి పి.డి.ఎఫ్ ఫైల్ కిందనే డౌన్‌లోడ్ అవుతున్నది. అలా కాక, ఆన్‌లైన్ కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడ సిస్టంలోకి పుస్తకం లాగనే డౌన్ లోడ్ చేసుకునే విదంగా చేయడానికి అవకాశం ఉన్నదా..?
2. నేను..ఆఫీస్ వర్డ్‌లో తెలుగులో టైప్ చేసాక ఆ ఫైల్ ని పి.డి.ఎఫ్ లోనికిమార్చాక చూస్తే..తెలుగు అక్షరాలు అందులో కనపడట్లేదు..చుక్కులలాగ కనపడుతున్నాయి./.మరి.. తెలుగులో పి.డి.ఎఫ్ లో కి మారవా ..! దయచేసి చెప్పగలరు

జ్యోతి said...

కమల్ గారు,

పి.డి.ఎప్ ని అంతర్జాలంలో ఒక సైట్ లోఅప్లోడ్ చేసి దాన్ని ఇ-బుక్ లా చూస్తున్నాం.దాన్ని మన సిస్టమ్ లో డౌన్లోడ్ చేస్తే పి.డి.ఎఫ్ లాగే వస్తుంది కదా. నేను కూడా ప్రయత్నించి చూసాను. సొంత సాఫ్ట్ వేర్ కొంటే సిస్టమ్ లోనే ఇ -బుక్ లా చూడొచ్చేమో చూడండి.

మీరు వాడుతున్న ఆఫీస్ వెర్షన్ ఏంటి? పిడిఎప్ గా ఎలా మారుస్తున్నారు? దాన్ని బట్టి సమస్య ఎక్కడుంది అని చెప్పవచ్చు. ఆపీస్ 2007లో వర్డ్ లో పిడిఎప్ addon తో డాక్యుమెంట్ ని పిడిఎఫ్ గా సేవ్ చేసుకోవచ్చు.ఆఫీస్ 2010 లో ఆ addon అవసరం లేదు. ఆ ఆప్షన్ ఆటోమెటిక్ గా ఉంటుంది. మరి మీరు వాడుతున్న వెర్షన్ ఏంటో??

కమల్ said...

జ్యోతి గారు. స్పందించినందుకు చాలా థ్యాంక్స్ అండి..! నేను ఆఫీస్ 2007 వర్డ్‌లోనే addon ద్వారానే పి.డి.ఎఫ్.గా సేవ్ చేస్తున్నా... కాని..తెలుగు అక్షరాలు మాత్రం పి.డి.ఎఫ్‌లో కనపడుటలేదు..ఏవో చుక్కులు వస్తున్నాయి. మామూలుగా ఆంగ్ల అక్షరాలు కనపడుతున్నాయి కాని..తెలుగు ఫాంటే రావట్లేదు.. దయచేసి..తెలుగు ఫాంట్ కనపడాలి అంటే ఏమి చేయాలో తెలుపగలరు..

జ్యోతి said...

కమల్ గారు, అలా కావడానికి వీలులేదే.నేను అలాగే పిడిఎఫ్ చేస్తున్నాను. మీరు నాకు మెయిల్ చేయగలరా? ఒకసారి Teamviewer తో మీ సిస్టమ్ లో చూస్తేగాని అసలు సమస్య ఎక్కడుందని అర్ధం కాదు.

కమల్ said...

మీకు మేయిల్ ఇచ్చాను చూడండి..జ్యోతి గారు

Post a Comment