Sunday, May 30, 2010
మీ పోస్ట్ డిలీట్ ఐందా? అయ్యో??
బ్లాగులో టపా రాసారు ..పబ్లిష్ చేసారు. మళ్ళీ ఏదైనా మార్పులు , చేర్పులు చేయాలనుకుని ఆ టపా తెరిచి పని చేస్తుండగా అది డిలీట్ ఐంది. కష్టపడి రాసారు. మళ్ళీ రాయాలంటే కష్టం. అన్నీ పాయింట్లు గుర్తుండవు మళ్ళీ రాద్దామంటే. పెద్దగా కూడా ఉంది. వర్డ్ లో కూడా దాచుకోలేదు. ఎలా . బాధగా ఉంటుంది కదా. పోయిన టపాను వెనక్కి తిరిగి తెచ్చుకోగలమా? అంటే... తెచ్చుకోగలం..
బ్రౌజర్ లో కొత్త ట్యాబ్ తెరవండి. అప్పుడు కంట్రోల్ హెచ్ (Ctrl H ) క్లిక్ చేస్తే పైన చూపించినట్టుగా ఒక టేబిల్ తెరుచుకుంటుంది. అందులో మీరు ఆ రోజు, రెండు రోజులు,వారం రోజులు మీ కంప్యూటర్లో చేసిన పనులన్నీ ఉంటాయి. మీకు కావలసిన తేది,సమయం చూసుకుని అది ఓపెన్ చేస్తే మీరు డిలీట్ చేసిన టపా కూడా ఉంటుంది . అది కాపీ చేసి సేవ్ చేసుకోండి. ఇందులో బ్లాగు టపాలే కాదు. వేరే అంశాలు కూడా తిరిగి తెరుచుకోవచ్చు. తెచ్చుకోవచ్చు. ఐతే యిపుడు హ్యాపీనా. ఎప్పుడైనా బ్లాగు టపా ఎగిరిపోతే ఇలా తిరిగి పట్టుకోండి..
Labels:
ట్రిక్కులు
12 వ్యాఖ్యలు:
ఈ ట్రిక్కేదో బలే బాగుంది. నావి అలా చాలా మాయం అయిపోయాయి. తెచ్చుకోవచ్చన్న మాట. ధన్యవాదాలు..
వేరే వేరే బ్లాగుల్లో పబ్లిష్ అయిన వ్యాఖ్యలు హారం లాంటి సైట్లలో కొన్ని మాత్రమే కనిపిస్తున్నాయి.పాతవి అన్నీ దొరకాలంటే ఎలా?
మొన్న నా టపాకి అన్ని హంగులు అద్ది పబ్లిష్ చేద్దాం అనుకునే లోపు కరెంట్ పోయి మొత్తం డెలిట్ అయిపోయింది. Save చేయలేదు మళ్ళీ అంతా టైప్ చేసుకోవలసి వచ్చింది. అటువంటి అంశాలని కూడా ఇలా తెచ్చుకోవచ్చునాండి?
రహమతుల్లాగారు,
జల్లెడలో వ్యాఖ్యల విభాగంలో ఈ ఆప్షన్ ఉండాలండి.. చూడండి..
పద్మగారు, నేను చెప్పినట్టు చేసి చూడండి . మీ టపా ఉంటుంది. వారంరోజుల వరకు మీ డేటా సేవ్ అయ్యి ఉంటుంది..
Valuable suggestion andi.
Jyothi gaaru na BLOG lo slideshow add chesaanu but andulo na pics to slideshow create cheyatam yelaano kaasta salaha istaara...
Thanks in Advance.
కొంచెం మానవత్వంగారు,
Slide.com లేదా picasaలో మీ ఫోటోలతో స్లైడ్ షో చేసుకుని అక్కడినుండి ఎంబెడ్ కోడ్ మీ బ్లాగులో పెట్టండి.. ఆయా సైట్లలో స్లైడ్ షో ఎలా చేయాలో వివరాలు ఉంటాయి చూడండి. లేదా రెండు రోజులు ఆగితే నేను టపా పెడతాను. ఇదే స్లైడ్ షో మీద.
హిస్టరీ డిలెట్ చేయకపోతేనే వుంటాయా? డిలెట్ చేసిన రోజులవి కనిపించడంలేదు. గమనించగలరు..
జ్యోతి గారు మీ టపా కి సంబందం లేని వాక్య రాస్తున్నందుకు సారీ . రెండు రోజుల క్రితం మా ఆఫీస్ ఐ డి కి క్రింద ఉన్న లింక్ మెయిల్ వచ్చింది .
http://www.teamviewer.com/download/TeamViewerQS.exe
దీని ఉపయోగం ఏమిటి ? దయ చేసి కాస్త చెప్పరు plz...
శివరంజని గారు.
అది రిమూట్ డెస్క్ టాప్ షేరింగ్ సాఫ్ట్ వేర్. ఈ సాఫ్ట్వేర్ సాయంతో మనం వేరేవాళ్ల సిస్టమ్ లోకి వెళ్లి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించవచ్చు. దీని సాయంతో ఎంతోమందికి తెలుగు ఎనేబుల్ చేసి, రాయడం నేర్పించా గతంలో.
జల్లెడలో కామెంట్లు ఒక్కొక్కటి నాలుగైదుసార్లు వరసలు తీరి ఉన్నాయి ఏంటి?ఒక్కో కామెంట్ ఒక్కసారి మాత్రమే కనిపిస్తే బాగుండేది.
Thank you andi..
Post a Comment