Monday, November 23, 2009

కూడలి


కూడలి అంటే తెలీని బ్లాగరులు, బ్లాగులు చదివేవాళ్ళు ఉండరేమో. తెలుగు బ్లాగులు 2005 నుండి మొదలయ్యాయి అని చెప్పవచ్చు. కాని ఎవరు ఏ బ్లాగులో ఎప్పుడు రాసారు అని తెలియడం ఎలా?.. ఈ ప్రశ్నకు సమాధానంగా వీవెన్ మహాశయుడు (లేఖిని సృష్టికర్త) 21.6.06 రోజు బ్లాగులన్నీ ఒకచోట ఉండేలా ఒక సంకలిని (aggregator) మొదలుపెట్టారు.

ఇప్పుడు కూడలి విశేషాల గురించి తెలుసుకుందాం..




కూడలిలో వివిధ విభాగాల ఏర్పాటు చేయబడ్డాయి. బ్లాగులు, వార్తా పత్రికలూ, ఫోటో బ్లాగులు, సేకరణలు రాసే బ్లాగులు, చివరిలో తెలుగుబ్లాగర్ల ఇంగ్లీషు బ్లాగులు. అదేవిధంగా అన్నిబ్లాగులలో మరిన్ని విభాగాలు మనకు లభ్యమవుతాయి. సినిమా విశేషాల బ్లాగులు, సాహిత్యానికి సంబంధించిన బ్లాగులు, హాస్యం, సాంకేతికం, రాజకీయాల గురించి తరచూ రాసే బ్లాగులు . మనకు నచ్చిన విభాగంలోని బ్లాగులను చాలా సులువుగా చదవవచ్చు.




కూడలిలో ఉన్నా మరో ప్రత్యేకత ..ఫోటో బ్లాగులు. తెలుగు వారి ఫోటో బ్లాగులు ఇందులో పొందుపరచబడ్డాయి. కూడలి మొదటి పేజీలో ఈ ఫోటో బ్లాగులలోని ఏదో ఒక యాదృచ్చిక చిత్రం కనిపిస్తుంది. దానంతట అదే మారుతుంది కూడా.




ఈ మధ్య బ్లాగర్లందరూ ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారంగా అందించిన కూడలి నిర్వహణ గురించి తెలుసుకుందాం. కూడలి టైటిల్ దగ్గరలో నిర్వహణ అనే బటన్ క్లిక్ చేసి మీకు నచ్చని , చదవడానికి ఇష్టపడని బ్లాగుల చిరునామాలు చేర్చండి. మళ్ళీ మీరు కూడలి తెరిచినపుడు సదరు బ్లాగులు మీకు కూడలిలో కనపడవు. మీకు నచ్చిన బ్లాగులు మాత్రమే మీ కూడలిలో చూడవచ్చు.




మీరు బ్లాగు మొదలెట్టగానే దానిగురించి అందరికి తెలియాలి. మీరు టపా రాసినప్పుడు అందరూ వచ్చి చదవాలిగా.దానికి మీ బ్లాగు చిరునామాను కూడలిలో చేర్చండి. "కొత్త బ్లాగు చేర్చండి" ఆన్న చోట క్లిక్ చేసి అక్కడ చెప్పినట్టు ఫాలో అవ్వండి.


కూడలికి సంబంధించిన వివరాలకు ఇక్కడ చూడండి.

9 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar said...

బాగుంది. కొత్తవాళ్ళకు చాలా ఉపయోగకరం.

cbrao said...

కూడలిలో నాకు నచ్చని అంశం: యాదృచ్ఛిక ఛాయాచిత్రం కింద ఛాయాచిత్రకారుని నామం లేదా బ్లాగు పేరు కనపడకపోవటం. ఈ లోపం సరిదిద్దితే, నేను నా Photo Blog మొదలెట్టటానికి సిద్ధంగా ఉన్నా.

జ్యోతి said...

రావుగారు వీవెన్ గారిని అడగండి మరి ఏమంటారో?

పరిమళం said...

చాలా ఉపయోగకరంగా ఉందండీ

రాధిక(నాని ) said...

baagundi

jaggampeta said...

i am veray happy

vasanth said...

iam new bloger how to add each new post to koodali ijust today send mail to koodali to add my blog

please help me regarding this doubt

జ్యోతి said...

Vasanth

Mail ur blog details to this address..

"కూడలి తోడ్పాటు" ,

RAMPS said...

తెలుగు వారి ఆత్మ ఈ బ్లాగ్ గురువు.

Post a Comment