Sunday, July 11, 2010

బ్లాగు టపాలో ఆడియో ఎలా పెట్టాలి?

మీ బ్లాగులోని ఏదైనా టపాకి పాట జత చేయాలనుకుంటున్నారా? అది మీ దగ్గర ఉన్న పాట అయినా, నెట్ లో ఉన్న పాట అయినా సరే ,చాలా సులువుగా మన టపాలో చేర్చవచ్చు. దానికోసం esnips, లేదా divshare అనే సైట్లు ఉపయోగపడతాయి.


ముందుగా esnips లో మీ పేరుతొ అకౌంట్ తెరవండి. తర్వాత మీ సిస్టంలో ఉన్న పాటను మీ అకౌంట్ లో అప్లోడ్ చేయండి. దీనికి కొంత సమయం పడుతుంది. పాట అప్లోడ్ అయ్యే సమయంలో ఆ విండోలో వేరే ఏవి ఓపన్ చేయకూడదు. అప్లోడ్ ఆగిపోతుంది.




పాట పూర్తిగా అప్లోడ్ అయ్యాక ఆది ఉన్న ఫోల్డర్ తెరిచి చూస్తే ఇలా కనిపిస్తుంది ప్లేయర్. ఇక్కడ ఇలాగే వినొచ్చు. మరి బ్లాగులో ఎలా పెట్టాలి అంటే.. ఇక్కడ కనిపిస్తున్న mp3 widgets ని సెలెక్ట్ చేసుకోవాలి.



సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన ప్లేయర్ ని ఎంచుకుంటే ఆ ప్లేయర్ యొక్క html కోడ్ వస్తుంది. ఆ కోడ్ ని కాపీ చేసుకుని మీ బ్లాగు టపాలో ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేయండి. ఇలా ఎన్ని పాటలైనా, ఆడియో అయినా టపాలో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మామూలుగా పబ్లిష్ చేయండి. అంతే..


అందమైన ప్లేయర్లో మీకిష్టమైన పాట వినవచ్చు.

అలాగే మీకు కావాల్సిన పాటను,మీరు అప్లోడ్ చేయకున్నా, వేరేవాళ్ళ పాటలైనా కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకుని ఆ కోడ్ ని మీ బ్లాగులో పెట్టుకోవచ్చు.

Friday, June 25, 2010

బ్లాగులో కామెంట్లు డిలీట్ చేయాలా??

మీ బ్లాగులో ప్రచార, అనవసర, అసభ్యకరమైన , అభ్యంతరకరమైన కామెంట్లు వస్తున్నాయా?? దానికోసం ప్రతీ బ్లాగరు మాడరేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటారా?? అవసరం లేదంటాను. మనకు ఇష్టం లేని కామెంట్లు చాలా సులువుగా తీసేయొచ్చు. ఇదిగో ఇలా ...



మీ బ్లాగులో వచ్చిన కామెంట్లు డిలీట్ చేయాలంటే ముందుగా మీ బ్లాగులోకి లాగిన్ అవ్వాలి. తర్వాత మీరు తీసేయాలనుకున్న కామెంట్ పక్కన చిన్న బాక్స్ లాంటిది కనిపిస్తుంది . అది క్లిక్ చేయండి.




పైన చిత్రంలో లా కన్పిస్తుంది. డిలీట్ కామెంట్ అంటే కామెంట్ పోతుంది కాని ఆ కామెంట్ రాసినవారి పేరు మీ బ్లాగులో ఉంటుంది. అలా కాకుండా ఆ కామెంట్ మొత్తాన్ని తీసేయాలంటే Remove forever అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కామెంట్ ని డిలీట్ చేయండి. అంటే ఆ కామెంట్ పూర్తిగా మాయమవుతుంది.


ఇక మీరు వేరే బ్లాగులో రాసిన కామెంట్ తీసేయాలనుకుంటే ఇదే విధంగా కామెంట్ కింద కనిపించే చిన్ని బాక్స్ ని క్లిక్ చేసి కామెంట్ తీసేయండి. మీరు రాసిన కామెంట్ పోయినా మీ పేరు మాత్రం ఉంటుంది. అది ఆ బ్లాగు ఓనర్ మాత్రమే తీసేయాలి పైన చెప్పినట్టుగానే.. ఆ హక్కులన్నీ ఆ బ్లాగ్ ఓనర్ కే ఉన్నాయి ఏ కామెంట్ తన బ్లాగులో ఉండాలో, ఉండకూడదో. ..

ఎంజాయ్...

Sunday, June 13, 2010

హారం - తెలుగు బ్లాగుల అగ్రిగేటర్



తెలుగు బ్లాగులను ఒక చోట చేర్చి వాటి విశేషాలను మనకు అందించే మరో అగ్రిగేటర్ హారం. భాస్కర్ రామిరెడ్డి నిర్వహిస్తున్న ఈ హారం ఎన్నో ప్రత్యేకతలతో మనను అలరిస్తుంది. ఇటీవల మరిన్ని హంగులతో మనముందుకు వచ్చింది.

హారంలోని వివిధ విభాగాల గురించి తెలుసుకుందాం. హారం మొదటి పేజిలో ఎడమ వైపు భాగంలో రచయితల పేర్లు వారు వ్రాసిన వ్యాసాలు లేదా వ్యాఖ్యల కోసం వినియోగించడం జరిగింది. మధ్య భాగంలో రచయితల వ్యాసాలు, లేదా వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు చూపబడతాయి. కుడి భాగంలో హారం చేసే రకరకాల విశ్లేషణలు చూపబడతాయి.



హారంలో మరిన్ని సదుపాయాలు పొందుపరచడమైనది. అందులో కొన్ని

1) గతవారం రోజుల్లో ఎక్కువగా ఏబ్లాగులు పాఠకులు చదివారో చూపిస్తుంది. ఈ టపాల/వ్యాసాల పట్టిక రోజుకొక సారి మాత్రమే మారు తుంది.
2)అలాగే తక్కువగా వీక్షించిన వ్యాసాలను కూడా క్రోడీకరించి సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. ఇదికూడా రోజుకొక్కసారే మారుతుంది.
3) అంతర్జాల పత్రికలలో వచ్చిన వ్యాసాలను పదిహేను రోజుల పాటు హోమ్ పేజీలో చూడొచ్చు. అంటే చందమామ,జ్యోతి,స్వాతి,భూమి లాంటి పత్రికలు కూడా ఉంటాయి.
4) పద్య, సాహిత్య ,వార్తా బ్లాగులను అలాగే కవితా బ్లాగులను విడిగా చూపడమైనది.
5) వివిధ విభాగాల్లో వ్రాసిన వ్యాసాలను కూడా క్రోడీకరించి [సాధ్యమైనంత తప్పులు లేకుండా ] చూపడానికి కూడా అనువుగా హోమ్ పేజీని డిజైన్ చేయడమైంది. కుడివైపు ఇచ్చిన ఆప్షన్ లో మీకు కావలసిన విభాగంలోని బ్లాగులు చూడవచ్చు. అంటే మీరు చాలా సులభంగా పద్యాలను, పాటలను, సంగీతపు వ్యాసాలను, హాస్య/వ్యంగ్య వ్యాసాలను, సాంకేతిక వ్యాసాలను చదువుకోవచ్చు.
6) కామెంట్ల పేజీలో ప్రత్యేకించి పాటల టపాలను చూపించడం జరిగింది.
7) హారంలో బ్లాగు టపాలే కాక ప్రతిబ్లాగులోని వ్యాఖ్యలు కూడా వేరే పేజిలో తెరిచి చదువుకోవచ్చు. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

Sunday, May 30, 2010

మీ పోస్ట్ డిలీట్ ఐందా? అయ్యో??


బ్లాగులో టపా రాసారు ..పబ్లిష్ చేసారు. మళ్ళీ ఏదైనా మార్పులు , చేర్పులు చేయాలనుకుని ఆ టపా తెరిచి పని చేస్తుండగా అది డిలీట్ ఐంది. కష్టపడి రాసారు. మళ్ళీ రాయాలంటే కష్టం. అన్నీ పాయింట్లు గుర్తుండవు మళ్ళీ రాద్దామంటే. పెద్దగా కూడా ఉంది. వర్డ్ లో కూడా దాచుకోలేదు. ఎలా . బాధగా ఉంటుంది కదా. పోయిన టపాను వెనక్కి తిరిగి తెచ్చుకోగలమా? అంటే... తెచ్చుకోగలం..

బ్రౌజర్ లో కొత్త ట్యాబ్ తెరవండి. అప్పుడు కంట్రోల్ హెచ్ (Ctrl H ) క్లిక్ చేస్తే పైన చూపించినట్టుగా ఒక టేబిల్ తెరుచుకుంటుంది. అందులో మీరు ఆ రోజు, రెండు రోజులు,వారం రోజులు మీ కంప్యూటర్లో చేసిన పనులన్నీ ఉంటాయి. మీకు కావలసిన తేది,సమయం చూసుకుని అది ఓపెన్ చేస్తే మీరు డిలీట్ చేసిన టపా కూడా ఉంటుంది . అది కాపీ చేసి సేవ్ చేసుకోండి. ఇందులో బ్లాగు టపాలే కాదు. వేరే అంశాలు కూడా తిరిగి తెరుచుకోవచ్చు. తెచ్చుకోవచ్చు. ఐతే యిపుడు హ్యాపీనా. ఎప్పుడైనా బ్లాగు టపా ఎగిరిపోతే ఇలా తిరిగి పట్టుకోండి..

Tuesday, February 2, 2010

pdf ని e - బుక్ చేయాలనుకుంటున్నారా?

ఇంతకు ముందు మన డాక్యుమెంట్ ని పిడిఎఫ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా.. ఇపుడు ఆ పిడిఎఫ్ ఫైల్ ని ఒక అందమైన e బుక్ లా ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ పుస్తకాన్ని ప్రతి పేజి తిరగేస్తు చదవొచ్చు. దానికోసం సైటుకు వెళ్లి మీ అకౌంటు క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గరున్న పిడిఎఫ్ ని అప్లోడ్ చేసి మంచి టైటిల్, మిగతా వివరాలు ఇవ్వండి. కొద్ది సమయంలో మీ పిడిఎఫ్ అందమైన పుస్తకంలా తయారవుతుంది. దాని ఎంబెడ్ కోడ్ తెచ్చి బ్లాగులో కూడా పెట్టుకోవచ్చు. చాలా సులువైన పద్ధతి.. ఇలా ఉంటుంది ఆ పుస్తకం...


గూగుల్ డాక్స్ లో అప్లోడ్ చేసిన పిడిఎఫ్.

Scribd లో అప్లోడ్ చేసిన పిడిఎఫ్.

ఇంటర్నెట్‍లో తెలుగు వెలుగులు on Scribd" href="http://www.scribd.com/doc/3816149/-" style="margin: 12px auto 6px; font: 14px Helvetica,Arial,Sans-serif; display: block; text-decoration: underline;">ఇంటర్నెట్‍లో తెలుగు వెలుగులు