మీరు గమనించే ఉంటారు. ఈ మధ్య కొన్ని బ్లాగుల్లో అందమైన బుల్లి స్మైలీలు కనపడుతున్నాయి. మరి మీ బ్లాగు టపాల్లో కూడా అలా కావాలనుకుంటున్నారా? ఐతే సరే .. ఇలా కొన్ని మార్పులు చేయండి..
ఇక్కడో తిరకాసు ఉంది. ఈ స్మైలీలు మంటనక్క వాడేవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా బ్రౌజర్లలో కూడా ప్రయత్నించి తర్వాత చెప్తాను.
1. ముందుగా మీరు Firefox బ్రౌజర్ ఓపన్ చేసి Grease Monkey అనే add-on ఇన్స్టాల్ చేసుకోండి. బ్రౌజర్ రీస్టార్ట్ చేయండి.
2.తర్వాత ఈ javascript ఫైల్ ఇన్స్టాల్ చేసుకోండి.
3. ఇప్పుడు మీరు Design విభాగంలోకి వెళ్లి Edit Html కి వెళ్లండి. ఇక్కడ మీరు మీ బ్లాగుయొక్క పూర్తి Html కోడ్ కనిపిస్తుంది . ఇక్కడ మీరు ]]></b:skin> కోడ్ వెతకండి.తొందరగా దొరకట్లేదు. అస్సలేమీ అర్ధం కావట్లేదు అంటారా?? ఒక సులువైన మార్గం చెప్తాను. Edit Html వెళ్లాక Ctrl F నొక్కండి. మీకు సెర్చ్ బాక్స్ వస్తుంది. అందులో పైన చెప్పిన కోడ్ కాపీ పేస్ట్ చేయండి. వెంటనే మీకు అది కనిపిస్తుంది.
4. ఇప్పుడు ఈ క్రింది CSS code ని ఇంతకు ముందు చెప్పిన కోడ్ ( ]]></b:skin> ) పైన పేస్ట్ చేసి సేవ్ చేయండి.
img.emoticon {
padding: 0;
margin: 0;
border: 0;
}
5. అంతే మీ బ్లాగులో ఎన్నో అందమైన స్మైలీలు పెట్టుకునే సులువైన సదుపాయం కల్పించబడింది. కొత్త పోస్ట్ రాసేటప్పుడు, పాత పోస్టు మార్పులు చేసేటప్పుడు ఇలా బాక్స్ కనిపిస్తుంది. మీకు కావలసిన స్మైలీ చేర్చుకోండి.
మరో విధానం కూడా ఉంది.
ఇందాకటి లాగే Design > Edit Html కి వెళ్లండి. అక్కడ Ctrl F తో సెర్చ్ బాక్స్ తెచ్చుకుని head వెతకండి. దానిపైన ఈ కోడ్ పేస్ట్ చేసి సేవ్ చేయండి. అంతే మీ బ్లాగు టపాలో కూల్ కూల్ స్మైలీస్ వస్తాయి..
14 వ్యాఖ్యలు:
మిగత బ్రౌసర్ల లో కూడా చెప్పండి
భానుగారు, తప్పకుండానండి. ఇది నా బ్లాగులో టెస్టింగ్ చేసి సులువైన పద్ధతి చెప్పాను. మిగతా బ్రౌజర్లతో కూడా ప్రయత్నిస్తాను. ఇది Html code తో పని కదా. టైమ్ పడుతుంది నాలాంటి నాన్ టెకీలకు..:)))
వర్డ్ ప్రెస్ బ్కాగర్లను కూడా ద్రుస్టిలోకి తీసుకొని రాయాలి కదా మేడం. యేమంటారు.
వెంకట సుబ్బారావు కావూరి
తెలుగిల్లు
జ్యోతిగారు. మీరు చెప్పినట్లుగానే కాపీ పేస్ట్ చేసాను..కాని నాబ్లాగ్ న్యూ పోస్టింగ్ బాక్స్‌లో మీరు చెప్పినట్లుగా స్మైలీస్ రాలేదు. పైన మీరు చెప్పిన ఆ కోడ్ ]]> మీద కాపీ చేయమన్నారు..అంటే..]]> ఈ కోడను అలానే ఉంచి ఈ కోడ్ పైనా కాపీ చేయాలా లేక ఈ కోడని డిలిట్ చేసి ఈ కోడ్ స్థానంలో మీరు చెప్పిన కోడ్‌ని కాపీ పేస్ట్ చేసినప్పుడూ కొన్ని xml సరిగ్గ క్లోజ్ చేయలేదని మెస్సేజ్ వస్తున్నది. మొత్తానికి నా బ్లాగ్‌లో ఈ స్మైలీస్ రావట్లేదు. అలాగే కొందరు కామెంట్స్‌లలో ఇలాంటి స్మైలీస్ ఎలా పెడుతున్నారు..చెప్పగలరా..?
సుబ్బారావుగారు ,,
నిజం చెప్పాలంటే వర్డ్ ప్రెస్ కు నాకు సరిపడదు.:) కాని తెలుసుకుని తప్పకుండా చెప్తాను..
కమల్ గారు,
ముందుగా గ్రీజ్ మంకీ , జావాస్క్రిప్ట్ ఇన్ స్టాల్ చేసారా? నేను చెప్పిన కోడ్ skin కోడ్ పైన పేస్ట్ చేయాలి.కాపీ పేస్ట్ లో తప్పు జరిగినట్టుంది. మళ్లీ ప్రయత్నించండి. వస్తుంది. కామెంట్స్ లో స్మైలీస్ సంగతి చూసి చెప్తాను..
మీరు చెప్పినట్లు గ్రీజ్‌మంకీ, జావాస్క్రిప్ట్ ఇన్స్టాల్ చేసానండి..మిగతా విదానం కూడ తూ.చ పాటించాంచాను. కాని ఎక్కడో ఏదో లోపం అర్థం కావట్లేదు.
మాకీ అందమైన స్మెల్ లేనీ స్మైలీ లొద్దండీ, మాకు మామూలూ సిల్లీ స్మైలీస్ చాలు :)
అవును జ్యోతిగారు.మిగితా బ్రౌసర్ల సంగతి కొంచెం చూసి చెప్పండీ...నాకు ఈ స్మైలీలు భలే ఇష్టం.ఇన్నాళ్ళూ ఏదో కాపీ పేస్ట్‌లతో సరిపెట్టుకున్నాను.మీరు చెప్పిన పధ్ధతి ఐతే చాల సులువుగా ఉంటుంది :) క్రోం లో ఎలా చెయాలో మీరు చెబుతారని ఆశిస్తున్నాను :)
హలో జ్యోతి గారు .. నమస్తే.. నేను కుడా కమల్ గారి లాగానే మీరు చెప్పింది తు.చ. తప్పకుండా చేసాను.. కాని నాకు కుడా స్మయిలీస్ రావటం లేదు.. మంట నక్క కొత్త వెర్షన్ వాడుతున్నాను.
బ్లాగరు / బ్లాగుస్పాట్ లో పాత ఎడిటరుని ఉపయోగిస్తున్న
వారికే ఈ కోడ్ పనిచేస్తున్నది. సెట్టింగులలో పాత ఎడిటరు
ని ఎన్నుకుని పరీక్షించి చుడండి :) కొత్త ఎడిటరులో కూడా
పనిచేసే కోడ్ కోసం ప్రయత్నించవలసి ఉంది.
క్రోమ్ బ్రౌజరులో గ్రీస్ మెటల్ అనే యుటిలిటీని ఉపయోగించి
గ్రీస్ మంకీ ద్వారా పొందే సౌకర్యాలని ఏర్పరుచుకోవచ్చును.
అసలు గ్రీస్ మెటల్ అవసరం లేకుండా కూడా user.js
ఫైళ్లని క్రోమ్ బ్రౌజరులోకి డ్రాగ్ చేసి ఇనుస్టాలు చేసుకోవచ్చు
అలాగే వర్డుప్రెస్ వాడేవారికి కూడా స్మైలీ విడ్జెట్లు ఉన్నాయి.
ya.. smileys are working with old editor..
జ్యోతి గార్కి,నమస్కారం . పేజీలు ఎలా పెట్టాలో తెలియజేయగలరు -మల్లిశ్రీ
మల్లిగారు,
తప్పకుండా చెప్తాను. నేను వీటిని ఇంతవరకు ఉపయోగించలేదు. వాటి గురించి తెలుసుకుంటున్నాను. ఒకట్రెండు రోజుల్లో పోస్టు పెడతాను.
Post a Comment