Thursday, October 7, 2010

screenshot/తెరపట్టు

నెట్ మీద పని చేస్తున్నపుడు మీకు ఏదైనా మ్యాటర్ కాని చిత్రం కాని నచ్చుతుంది.లేదా అవసరమవుతుంది. అది మీ సిస్టం లో సేవ్ చేసుకోవాలంటే ఎలా?. లేదా మీకు కంప్యూటర్ వాడకంలో వచ్చిన సమస్య ఎవరికైనా చెప్పాలి, చూపించాలి అంటే యిపుడు? వీటన్నింటికి సులువైన సమాధానం screenshot లేదా తెరపట్టు. మీకు కావలసిన అంశాన్ని అలాగే చిత్రంలా మార్చిప్ సేవ్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం..

మీ కీబోర్డ్ లో కుడివైపు అన్నిటికంటే పైన ఉన్న లైన్లో చూడండి. F కీస్ పక్కన printscreen అనే కీ ఉంటుంది. మీకు కావలసిన పేజికి వెళ్ళి కీ ని నొక్కండి. అపుడు పేజి ఒక ఇమేజ్ లా సేవ్ అయిందన్నమాట.






యిపుడు start మెనూలో paint ఓపన్ చేసి అక్కడ మౌసే రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేయండి.ఇంతకు ముందు మీరు screenshot తీసుకున్నా చిత్రం అక్కడ ప్రత్యక్షమవుతుంది. దానికి ఒక పేరు ఇచ్చి సేవ్ చేసుకోండి.


మళ్ళీ ఆ చిత్రాన్ని మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్ లో ఓపన్ చేసి అనవసరమైన భాగం కట్ చేసి సేవ్ చేసుకోండి . యిపుడు మీకు కావలసిన చిత్రం తయారుగా ఉంది. ఒక్క విషయం ఎపుడు కూడా jpeg లేదా png లో సేవ్ చేసుకోండి.




యిపుడు windows7 లో snipping tool సాయంతో ఇంత కష్టపడకుండా చాల సులువుగా screenshot తీసుకోవచ్చు. start మెనూ నుండి snipping tool సెలెక్ట్ చేసుకుని మీకు కావలసిన మ్యాటర్ లేదా చిత్రాన్ని screenshot తీసుకోండి. మీరు ఆ పేజిలోనే కావలసినంత మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు.



మీరు సెలెక్ట్ చేసుకున్నా భాగాన్ని సేవ్ చేసుకోండి అంతే...

5 వ్యాఖ్యలు:

కమల్ said...

చాలా మంచి ఉపయోగకరమైన చిట్కా చెప్పారండి, చాలా థ్యాంక్స్ మీకు.

కంది శంకరయ్య said...

జ్యోతి గారూ,
దయచేసి నా సందేహం తీర్చండి. నేను నా బ్లాగు మొదలు పెట్టిన తర్వాత తెలిసీ తెలియక కొన్ని లేబుళ్ళు ఎక్కువగా చేర్చాను. ఇప్పుడు వాటి అవసరం లేదు. ఆ లేబుళ్ళలో కొన్నిటిని తొలగించాలంటే ఏం చేయాలి? లేబుళ్ళు మరీ ఎక్కువ కావడంతో నా బ్లాగు ముఖ పత్రంపై లేబుళ్ళ గాడ్గెట్ తొలగించాను. సలహా ఇవ్వవలసిందిగా మనవి.

జ్యోతి said...

శంకరయ్యగారు,
ఆ లేబుళ్లు తగ్గించొచ్చు. మీరు edit posts కి వెళ్లి పాత టపాలను మళ్లీ ఓపన్ చేసి వాటికి ఉన్న లేబుల్ కాకుండా ఆల్రెడీ ఉన్న లేబుల్ లో చేర్చి మళ్లీ పబ్లిష్ చేయండి. అంటే ఎక్కువగా ఉన్న లేబుళ్లు తగ్గించి పాత టపాలను ఆయా లేబుల్ ఇచ్చి మళ్లీ పబ్లిష్ చేయాలి. ఇది కాస్త టైమ్ తీసుకుంటుంది. తప్పదు మరి..

GSCHANDRA said...

ధన్య వాదాలు.నేను ఇంతవరకు ప్రింట్ స్క్రీన్ ఉపయోగించి వర్డ్ లో పేస్టు చేసేవాన్ని ఇక నుంచి మీరు చెప్పినట్టు చేస్తాను

పుట్టపర్తి సాహితీ సుధ - పుట్టపర్తి అనూరాధ said...

జ్యోతి గారూ..
నేను ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకొని అందులో కొత్త కొత్త పోస్ట్ లు పంపుకుంటూ ఆనందిస్తున్నాను..మరి నాకు ఒక అందమైన గ్రీటింగ్ కార్డ్ మీదో లేక ఏదైనా డిసైన్ వున్న పేపర్లాంటి దానిపై నా పోస్ట్ అలంకరించి పోస్ట్ చేయాలని వుంటుంది..గూగుల్ లో హౌ టు ఇన్సర్ట్ తెలుగు ఫాంట్ ఒన్ గ్రీటింగ్ కార్డ్స్ అని నానా రకాలుగా ట్రై చేసి చూశాను కానీ ..ఫలితం లేదు నాకు ఈ విషయంలో కాస్త సహకరించరూ..

Post a Comment