Thursday, September 30, 2010

కొత్త బ్లాగర్లకు సూచనలు

కొత్తగా బ్లాగు మొదలెట్టాలని అనుకున్నారు. మంచిదే. బ్లాగర్ కి వెళ్ళి మీకంటూ ఒక సొంత బ్లాగు మొదలు పెట్టారు. అంతటితో పని పూర్తవ్వలేదుగా.. బ్లాగు రాయాలని నిర్ణయించుకున్నప్పుడు ముందు, తర్వాత కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే మంచిది. అవి ఏంటో యిపుడు చూద్దాం..


ముందుగా బ్లాగు మొదలెడుతున్నాం. దానికోసం మంచి శీర్షిక లేదా టైటిల్ ఆలోచించి పెట్టుకోండి. ఎదో ఒకటి పెడితే ఎలా?. మన బ్లాగు అంటే మన సొంతిల్లు లాంటిది. అందమైన ఇంటికి అందమైన పేరు ఉండాలిగా?. బ్లాగు మొదలుపెట్టేటప్పుడు టైటిల్ ఇంగ్లీషులో ఇచ్చినా తర్వాత సెట్టింగ్స్ లో తెలుగులోకి మార్చుకోవచ్చు. తెలుగు బ్లాగు పేరు కూడా తెలుగులోనే ఉంటే బావుంటుంది కదా. అలాగే దానికో అందమైన ట్యాగ్ లైన్ కూడా పెట్టండి. ఇంకా అందంగా ఉంటుంది. మరో విషయం. మీరు బ్లాగు మొదలుపెట్టేటప్పుడు బ్లాగు అడ్రస్ అదేనండి url కూడా అందరికి మీకు కూడా ఈజీగా గుర్తుండేట్టు, సింపుల్ గా ఉండేట్టు చూసుకోండి.




dashboard నుండి settings Formattingకి వెళ్ళండి. అక్కడ ముందుగా చేయవలసిన ముఖ్యమైన మార్పులు. ప్రతి పేజిలో మూడు నుండి ఐదు పోస్టులు మాత్రమే వచ్చేట్టు చూడండి. ఎక్కువ టపాలు ఉంటే మీ బ్లాగ్ ఓపన్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. తర్వాత మీ పోస్టు ప్రచురించే తేది, సమయం గురించి పైన చెప్పినట్టుగా మార్చుకోండి.



ఇక కొత్త బ్లాగర్లు చేయవలసిన మరో ముఖ్యమైన పని.. కామెంట్లు రాసేవారికి పంటి కింది రాయిలా వచ్చే వర్డ్ వెరిఫికేషన్.
settings > comments విభాగంలో ఈ వర్డ్ వెరిఫికేషన్ కావాలా వద్దా అన్నదగ్గర వద్దు అనండి. అలాగే బ్లాగులో ఎవరైనా కామెంట్ రాయగానే మీకు తెలిసేట్టు మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఒకవేళ మీరు కామెంట్స్ మాడరేషన్ పెట్టుకోవాలనుకుంటే కూడా ఆ విధంగా మార్పు చేసుకోవచ్చు.

ఇక కొత్త బ్లాగర్లకు మరి కొన్ని సూచనలు.

బ్లాగు మొదలుపెట్టినందుకు అభినందనలు. ముందు మీరు ఏయే విషయాలు రాయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. అలా అని ఒకే విధమైన రాతలు రాయాలని కాదు. మీ బ్లాగు మీ ఇష్టం. ఏదైనా విషయం పై టపా రాయాలంటే ముందు దానికి సరిపోయే విధంగా, అందరిని ఆకట్టుకునే విధంగా ఉండేట్టు టైటిల్ ఎంచుకోండి. తర్వాత మీ టపా రాయండి. వీలయితే దానికో చిత్రం పెట్టండి. మర్చిపోకుండా ప్రతి టపాకు లేబిల్ లేదా వర్గం ఇవ్వండి. తర్వాత మీరు కాని మీ బ్లాగు చదివేవారు కానీ పాట టపాలు చదవాలంటే ఆ వర్గాలు చాలా ఉపయోగపడతాయి. మీరు బ్లాగు మొదలుపెట్టగానే అందరూ పొలోమని వచ్చేయరు కదా. మరి ఎలాగంటారా. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే... మీ బ్లాగులోనీ టపా రాసి కూర్చోకుండా మిగతా బ్లాగులకు వెళ్ళి టపాలు చదివి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. లేదంటే ఎందుకు నచ్చలేదో చెప్పండి. అలా చేస్తుంటే మీ గురించి పదిమందికి తెలుస్తుంది. మీ గురించి మీరే ఇరుగు పొరుగుకు పరిచయం చేసుకోవాలన్నమాట. మెల్లిగా ఇతర బ్లాగర్లు ఎవరా ఈ కొత్త వ్యక్తి అని మీ పేరు ఉన్న లంకె పట్టుకుని మీ బ్లాగుకు వచ్చి మీరు రాసిన టపా చదువుతారు. అలాగే మీ గురించి కొన్ని విషయాలు మీ ప్రొఫైల్ లో పెట్టండి. మరీ పర్సనల్ విషయాలు చెప్పొద్దు లెండి..

మరి మీరు రాసిన టపా అందరికి తెలియాలంటే ఎలా.. తెలుసుగా బ్లాగు సంకలినులు లేదా ఆగ్రిగేటర్లలో చేరాలి.


కూడలి ---- support@koodali.org
మాలిక -... admin@maalika.org
జల్లెడ --- http://dir.jalleda.com/index.php?show=add&PID=79

హారం --- http://haaram.com/Join.aspx
తెలుగు బ్లాగర్స్ ... http://www.telugubloggers.com/add-blog/

అగ్రిగేటర్స్ వివరాలు తెలుసుకున్నారుగా. మరి మీకు అప్పుడప్పుడు వచ్చే సందేహాలకు సమాధానాల కోసం , బ్లాగులకు, అంతర్జాలంలో తెలుగుకు సంబంధించిన చర్చలకోసం తెలుగు బ్లాగు గుంపులో చేరండి. http://groups.google.co.in/group/telugublog ఎవరో ఒకరు మీకు సమాధానమిస్తారు. సందేహాలు , సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తారు.

16 వ్యాఖ్యలు:

భాను said...

kothavaallaku meerichin suchanalu chalaa bagunnai jyothi garu.

నీహారిక said...

జ్యోతి గారు,
site feed గురించి, open id గురించి కూడా చెప్పండి.అదెలా ఉపయోగించుకోవాలో నాకు తెలియదు.

GSCHANDRA said...

మీ సలహాలు సూచనలు బావున్నాయి , ఒక చిన్న విన్నపం మీకు ఖాలీ దొరికినప్పుడు ఒకసారి నా బ్లాగ్ నీ చూసి మీ సూచనలు ఇవ్వగలరా? my add www.gschandra.blogspot.com

Admin said...

జ్యోతి గారు ఈ రోజే మీ బ్లాగ్ చూసాను. కొత్తగా బ్లాగ్ పెట్టుకునే వారికి మీ సూచనలు చాల బాగున్నాయి. మరియు స్క్రీన్ షాట్ గురించి నాకు తెలీదు. మీరు చాలా బాగా చెప్పారు. మీకు అభినందనలు.

Mythiliram.g said...

Jyothi garu

With the help of your blog tutorial we could create a blog to some extent.But we are unable to create the labels in Telugu and the appearance of the pages is also not upto the mark. Can you please guide us in this.

జ్యోతి said...

Mythiliram garu,,

You can add the gadget of Labels in Design section and change the title into telugu.. As default you have Labels. delete it and give the name in telugu.. (copy paste from lekhini or direct typing with baraha).. appearances of the pages means i didnt understand.. Make the settings as i told above..that is enough... You start a test blog along with your blog. You can experiment all changes and options in the test blog and when you are successful and happy with the changes you can implement in ur blog..

Mythiliram.g said...

Thank You Jyoti garu

Mythiliram.g said...

Jyoti Madam,

Thank you very much for this post. We have started a blog. If possible please visit once and advise changes / improvements

url: http://chirudeepamu.blogspot.com

pappu sudhir kumar said...

మీ సలహాలు సూచనలు బావున్నాయి , ఒక చిన్న విన్నపం మీకు ఖాలీ దొరికినప్పుడు ఒకసారి నా బ్లాగ్ నీ చూసి మీ సూచనలు ఇవ్వగలరా? http://veelaithenalugumatalu.blogspot.com/

జ్యోతి said...

సుధీర్ గారు,
మీ టెంప్లేట్ బావుంది. ఫాంట్ సైజు పెంచండి. అలాగే సైడ్ విడ్జెట్స్ ఒకదగ్గర లైనుగా పెట్టండి.

pappu sudhir kumar said...

జ్యోతి గారు ధన్యవాదాలు ఫాంట్ సైజు మార్చడం ఎలా మీ పోస్ట్ లో layout అన్నారు కానీ dashbord లో ఆ option లేదు ఫాంట్ సైజు మార్చేందుకు సహాయం చేయగలరు

జ్యోతి said...

సుధీర్ గారు, డీఫాల్ట్ టెంప్లేట్ ఐతే సులువుగా మార్చుకునే వీలుంది.మీరు template designer లో ట్రై చేయండి. లేదంటే edit html లో మార్చాలి. మీకు వీలవుతుందా మరి??

Shloka Sastry( శ్లోకా శాస్త్రి ) said...

good idea.... easy ga create cheskovachu blog ni ee help tho

జ్యోతి said...

ధాంక్ యూ శ్లోక గారు... నేను నేర్చుకున్న విషయాలను ఇలా అందరికి అర్ధమయ్యేలా వివరిస్తున్నారు. అవి కొందరికైనా ఉపయోగపడితే చాలు కదా..

charitha said...

మీ సూచనలు బావున్నాయి జ్యోతి గారు ధన్యవాదాలు.

తెలుగోడు_చైతన్య said...

కొత్తవాళ్ళకి నిజంగా ఒక మంచి అవగాహన కల్పించారు.
http://sskchaithanya.blogspot.com

Post a Comment