Friday, September 24, 2010

వార్తా పత్రికలలో వ్యాసాలు

వివిధ వార్తా పత్రికలలో ప్రచురించబడిన వ్యాసాలను కాపీ చేసుకుని సేవ్ చేసుకోవాలనుకుంటే కొన్ని సమస్యలున్నాయి. ఎందుకంటే ఆయా పత్రికల వాళ్ళు వాడే ఫాంట్ ,మనం నెట్ లో వాడే యూనికోడ్ వేర్వేరు కాబట్టి. ఆయా పత్రికల ఫాంట్లు దిగుమతి చేసుకుని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటే మనం సులువుగా ఆ తెలుగు లేదా ఏ భాషైనా చదవడానికి అనువుగా ఉంటుంది.


ఆ పత్రికలోని వ్యాసం కాపీ చేసుకుని మన బ్లాగులో కాని, నోట్ పాడ్ లో కాని సేవ్ చేసుకుంటే ఇలా అర్ధం కాని లిపి కనిపిస్తుంది. పేపర్లో చదివితే తెలుగులాగే ఉంటుంది. మరి ఇలా ఎందుకు అయినదంటారా?.. ఫాంట్ సమస్య.. మరి ఏం చేద్దామంటారు.


మంటనక్క వాడే వాళ్ళ కోసం ఒక చిన్న ట్రిక్కు ఉంది. పద్మ అనే ఆడాన్ దించుకుంటే సరి.




మన కంప్యూటర్లో పద్మ ఉన్నంత కాలం వివిధ తెలుగు వ్యాసాలను సులువుగా కాపీ చేసుకుని బ్లాగులో కాని నోట్ పాడ్ లో కాని సేవ్ చేసుకోవచ్చు. అంతే చాలా ఈజీ కదా.



అలా కాదు మేము మంటనక్క వాడము అంటారా. ఐతే http://uni.medhas.org/ సైట్ కి వెళ్ళి మీకు కావలసిన పత్రికలను యూనికోడ్ లో చదవండి, కావలసిన వ్యాసాలు హాయిగా కాపీ చేసుకుని సేవ్ చేసుకోండి.


ఇక పత్రికలలో వచ్చిన వ్యాసాలు లేదా చిత్రాలను ఎలా సేవ్ చేసుకోవాలంటారా.. epaper లో పత్రికల పేజీలు ఇమేజ్ రూపంలో ఉంటాయి కాబట్టి ఈ ఫాంట్ గొడవ ఉండదు. మరి మనకు కావలసిన వ్యాసాలు ఎలా సేవ్ చేసుకోవాలంటారా. ముందుగా ఆ పత్రికలో మీకంటూ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత ఆ పేపర్ తెరిచి మీకు కావలసిన పేజికి వెళ్ళండి. అందులో మీకు కావలసిన వ్యాసం మీద క్లిక్ చేయండి. ఆ వ్యాసం మాత్రమే విడిగా కొత్త పేజిలో ఓపన్ అవుతుంది. అప్పుడు ఆ పేజి మీద రైట్ క్లిక్ చేసి ఇమేజ్ లా మీ సిస్టంలోకి సేవ్ చేస్కొండి. తర్వాత ఆ చిత్రాన్ని మామూలుగా మెయిల్ చేసుకోవచ్చు. బ్లాగులో కూడా పెట్టుకోవచ్చు. మొదట్లో కాస్త తికమకగా ఉంటుంది. ఒకటి రెండు సార్లు చేస్తే అదే ఈజీ అవుతుంది.

మరో విషయం.. కొన్ని పత్రికలలో మనకు కావలసిన ఆర్టికల్స్ ఇమేజ్ లా కాకుండా పిడిఎఫ్ వెర్షన్ కూడా సేవ్ చేసుకోవచ్చు. కానీ అన్నింటిలో ముందు మన అకౌంట్ క్రియేట్ చేసుకోవడం తప్పనిసరి..

9 వ్యాఖ్యలు:

అశోక్ పాపాయి said...

మీకు చాల కృతజ్ఞతలండి ఈ పోస్ట్ నాకు చాల ఉపయోగకరం..నిజంగానే మీరు బ్లాగ్ గురువు జ్యోతి గారు.

రాధిక(నాని ) said...

మీ సలహాలు చాలా బాగుంటాయి .థాంక్స్ జ్యోతి గారు.

Gouthamaraju said...

మహాకవి శ్రీశ్రీ


శ్రీశ్రీ ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.

~ లీడర్ ~ said...

కృతజ్ఞతలు. చాలా ఉపయోగ కరంగా ఉంది.

Apparao said...

thankyou

జ్యోతి said...

అశోక్, రాధిక, లీడర్,అప్పారావుగారు ... ధన్యవాదాలు..

kavikulam said...

Nice points!
Thank you జ్యోతి గారు!

jaggampeta said...

jyothi gaaru nannu marchipoyinattunaaru

జ్యోతి said...

లేదండి. పేజెస్ గురించే కదా. గుర్తుంది. కాని నాకే అర్ధం కావట్లేదు.అందుకే ఈ ఆలస్యం..తప్పకుండా రాస్తాను. అందరికి సులువుగా అర్ధమయ్యేలా.

Post a Comment