Thursday, September 2, 2010

యూనికోడ్ లో అను

అంతర్జాలంలో రాయడానికి మనం రాసే పధ్ధతి యూనికోడ్ అని అంటారు. అలాగే తెలుగు టైపింగ్ కోసం అను సాఫ్ట్ వేర్ వాడేవారికి కంప్యూటర్లో , బ్లాగులలో రాయడానికి లేఖిని, బరహ లాంటి ఫోనెటిక్ లే అవుట్లు వాడాల్సి ఉంటుంది. తమ వృత్తిరీత్యా అను వాడక తప్పనివారికి , ఈ ఫోనెటిక్ లే అవుట్ వాడడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాని ఇదే అను సాఫ్ట్ వేర్ తో యూనికోడ్ లో రాసే వీలు కల్పించారు వీవెన్. అనులో ప్రముఖంగా వాడే మాడ్యులర్ , యాపిల్ కీ బోర్డ్ లే అవుట్లను తయారు చేసారు. ఈ లే అవుట్లను తమ కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకోవడం వల్ల అను సాఫ్ట్ వేర్ తో సులభంగా టైప్ చేసుకోవచ్చు.



ముందుగా ఇక్కడి నుండి మాడ్యులర్ కీ బోర్డ్ లే అవుట్ ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఆ జిప్ ఫెయిల్ ని అన్ జిప్ చేయండి. అందులోని setup ఫైల్ ని రన్ చేయండి. కొద్ది సేపట్లో మీ సిస్టంలో మాడ్యులర్ కీబోర్డ్ లే అవుట్ ఇన్స్టాల్ అవుతుంది. ఇక మీరు పైన ఇచ్చిన చిత్రంలో చూపిన విధంగా టైప్ చేసుకోవచ్చు. Left Alt + Shift. నొక్కి మీరు తెలుగు ఇంగ్లీషు భాషల్లోకి మారవచ్చు. మామూలుగా మీరు అను మాడ్యులర్ తో టైప్ చేసినట్టే కాని కొద్ది మార్పులు చేయాల్సి ఉంటుంది అంతే..



అదే విధంగా కొందరు అనులో ఆపిల్ కీబోర్డ్ వాడుతుంటారు. మరి వాళ్ళు యూనికోడ్ లో టైప్ చేయాలంటే.. దానికి కూడా పరిష్కారం ఉంది.
ముందుగా ఇక్కడి నుండి ఆపిల్ కీబోర్డ్ లే అవుట్ ని డౌన్లోడ్ చేస్కొండి. జిప్ ఫైల్ ని అన్ జిప్ చేసి అందులోని setup ఫైల్ ని రన్ చేయండి. కొద్ది సేపట్లో మీ సిస్టంలో ఆపిల్ కీబోర్డ్ లే అవుట్ ఇన్స్టాల్ అవుతుంది. ఇక మీరు పైన ఇచ్చిన చిత్రంలో చూపిన విధంగా టైప్ చేసుకోవచ్చు.Left Alt + Shift. నొక్కి మీరు తెలుగు ఇంగ్లీషు భాషల్లోకి మారవచ్చు. మామూలుగా మీరు అను ఆపిల్ తో టైప్ చేసినట్టే కాని కొద్ది మార్పులు చేయాల్సి ఉంటుంది అంతే ..ఆపిల్ కీబోర్డ్ గురించి మరికొన్ని వివరాలు ఇక్కడ చూడండి..


అదే విధంగా అను లో మన దగ్గర ఉన్న సమాచారాన్ని చాలా సులువుగా యూనికోడ్ లోకి మార్చుకోవచ్చు. అను2యూనీకోడ్ కన్వర్టర్.

3 వ్యాఖ్యలు:

Angry Bird said...

Is there any software that can let you type using telugu typewriter keyboard format ?

karlapalem Hanumantha Rao said...

జ్యోతి గారు ! మీరు మీ కంప్యూటర్ విజ్ఞానాన్ని తెలుగు వారికి పంచుతున్నందుకు అభినందనలు. ఈ బ్లాగ్ ఎంతో ఉపయోగాకరంగా కూడా వుంది.సరళమయిన భాషలో అందరికి అర్ధమయేవిధంగా చక్కగా వివరిస్తున్నదుకు కృతజ్ఞతలు

kapilaram said...

నేను అను ఫాంట్ :రొమిక్ కీబోర్డ్ వాడుతున్నాను. ఇంచుమించు యూనికో్డ్ కు దగ్గరగా వుంటుంది (స్వరభాషాక్షరములు) రొమిక్ k = క /యునికోడ్ :ka = క
రీమిక్ ka = కా /యునికోడ్ = kaa :కా

Post a Comment