Sunday, January 30, 2011

బ్లాగులో నిశ్చల పేజీలు (static pages)

బ్లాగులో మామూలుగా టపాలు రాసి పబ్లిష్ చేస్తాము. కాని కొన్ని విషయాలు, టపాలు ఎప్పటికి కనపడేలా, కదలకుండా ఉండాలని అనుకుంటాము. వాటిని ఎలా సెట్ చేసుకోవడం. ప్రతీసారి ఆ పేజిని, సమాచారాన్ని వెతుక్కోవాలంటే కష్టం కదా. దానికోసమే బ్లాగులో పేజెస్ అనే సదుపాయం కల్పించబడింది. ఈ పేజీలలో మీకు కావలసిన, ముఖ్యం అనుకున్న సమాచారాన్ని పొందుపరచుకోవచ్చు. ఇది బ్లాగులో ఎప్పటికి కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎన్ని వందల టపాలు రాసినా సరే. ఈ పేజిలలో మీ గురించి, మీ వృత్తి మొదలైన సమాచారం, మిమ్మల్ని సంప్రదించడం ఎలా మొదలైన అంశాలు ఈ పేజీలలో భద్రపరచవచ్చు. మీ బ్లాగు పాఠకులు ఆ పేజీలు క్లిక్ చేయగానే ఆ సమాచారం సులువుగా చదువుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ పేజీలు ఎలా సృష్టించాలో తెలుసుకుందాం...

ముందుగా http://draft.blogger.com/ లో ఎప్పటిలాగే మీ వివరాలు ఇచ్చి లాగిన్ అవ్వండి. తర్వాత edit posts క్లిక్ చేస్తే పైన లా కనిపిస్తుంది కదా. అపుడు edit pages క్లిక్ చేయండి.


ఇప్పుడు new page క్లిక్ చేయండి. ఇక మీరు కొత్త పేజి తయారు చేసుకోవాలి .


ఈ పేజి మనం బ్లాగు రాసినట్టుగానే ఉంటుంది. కాని ఒక్కటే తేడా ఏంటి అంటే తేది, లేబిల్ లేదా వర్గం ఉండదు. బ్లాగు పోస్టు లాగే టైటిల్, కంటెంట్ రాసి పబ్లిష్ చేయండి. ఇందులో చిత్రాలు, లింకులు గట్రా ఇవ్వొచ్చు.


పబ్లిష్ చేసిన తర్వాత మన బ్లాగులో పైన ఇలా కనిపిస్తుంది. అందులో వేర్వేరు పేజీలను క్లిక్ చేస్తే అందులో ఉన్న సమాచారాన్ని చూడవచ్చు.



ఈ పేజీలు సృష్టించాక దాన్ని బ్లాగులో సైడ్ బార్ లేదా పైన హెడర్ కింద కాని, పోస్ట్ పైన కాని పెట్టుకోవచ్చు. ఆ పేజి ఎలిమెంట్ ని మనకు నచ్చినట్టుగా జరుపుకుని సేవ్ చేసుకోవాలి.



మీరు పేజీల లిస్టు చూసినపుడు ఇలా కనిపిస్తుంది. సుమారు పది పేజీల వరకు సృష్టించుకోవచ్చు. కావలసినపుడు edit , delete చేసుకోవచ్చు.


మీరు కాస్త సాంకేతిక నిపుణులు ఐతే ఈ పేజీలకు మార్పులు కూడా చేసుకోవచ్చు. ఇదిగో ఇలా..

మీ బ్లాగు లేబిల్స్ ని పేజీలుగా మార్చాలనుకుంటే ఇది ప్రయత్నించండి. నేను ట్రై చేయలేదు మరి..

Monday, January 17, 2011

బ్లాక్ కోట్స్ - Block quotes

బ్లాగులో మీరు రాసే మాటల్లో కొన్నింటిని హైలైట్ చేసి చెప్పాలనుకుంటారు. మీరు రాసే వ్యాసంలో కొన్ని వాక్యాలు ప్రముఖంగా కనిపించాలని ఉంటుంది. అప్పుడు మీరు ఆ వాక్యాలను కోట్స్ మధ్య పెట్టి , రంగు మార్చి , ఫాంట్ స్టైల్ మారుస్తారు.కాని మీరు టపా రాసేటప్పుడే ఆ భాగాన్ని Block quote అనే ఆప్షన్ ద్వారా ప్రముఖంగా హైలైట్ చేసి చూపించొచ్చు. అది ఎలాగో చూద్దాం..



వర్డ్ ప్రెస్ బ్లాగులో..

మీరు కొత్త టపా రాసేటప్పుడు పైన ఉన్న ఆప్షన్స్ చూడండి. మీరు హైలైట్ చేయాలనుకున్న భాగాన్ని సెలెక్ట్ చేసుకుని b-quote అనే బటన్ ని నొక్కండి.




మీరు ప్రముఖంగా చూపించాలనుకున్న భాగం ఇలా ఉంటుంది..




బ్లాగర్ బ్లాగులో :

మీరు కొత్త టపా రాసేటప్పుడు కావలసిన అంశాన్ని సెలెక్ట్ చేసుకుని పైన కనిపిస్తున్న quotes నొక్కండి. కావాలనుకుంటే ఈ భాగానికి రంగు కూడా మార్చవచ్చు.




ఇలా ఉంటుందన్నమాట..అర్ధమైంది కదా..



ఇలా quotes లో పెట్టాలనుకున్న భాగానికి మరిన్ని హంగులు చేర్చొచ్చు. ఫాంట్ స్టైల్ కూడా నచ్చినట్టుగా పెట్టొచ్చు.

Wednesday, November 10, 2010

మీ బ్లాగు టపాలో అందమైన స్మైలీలు కావాలా???

మీరు గమనించే ఉంటారు. ఈ మధ్య కొన్ని బ్లాగుల్లో అందమైన బుల్లి స్మైలీలు కనపడుతున్నాయి. మరి మీ బ్లాగు టపాల్లో కూడా అలా కావాలనుకుంటున్నారా? ఐతే సరే .. ఇలా కొన్ని మార్పులు చేయండి..

ఇక్కడో తిరకాసు ఉంది. ఈ స్మైలీలు మంటనక్క వాడేవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా బ్రౌజర్లలో కూడా ప్రయత్నించి తర్వాత చెప్తాను.

1. ముందుగా మీరు Firefox బ్రౌజర్ ఓపన్ చేసి Grease Monkey అనే add-on ఇన్స్టాల్ చేసుకోండి. బ్రౌజర్ రీస్టార్ట్ చేయండి.

2.తర్వాత ఈ javascript ఫైల్ ఇన్స్టాల్ చేసుకోండి.

3. ఇప్పుడు మీరు Design విభాగంలోకి వెళ్లి Edit Html కి వెళ్లండి. ఇక్కడ మీరు మీ బ్లాగుయొక్క పూర్తి Html కోడ్ కనిపిస్తుంది . ఇక్కడ మీరు ]]></b:skin> కోడ్ వెతకండి.తొందరగా దొరకట్లేదు. అస్సలేమీ అర్ధం కావట్లేదు అంటారా?? ఒక సులువైన మార్గం చెప్తాను. Edit Html వెళ్లాక Ctrl F నొక్కండి. మీకు సెర్చ్ బాక్స్ వస్తుంది. అందులో పైన చెప్పిన కోడ్ కాపీ పేస్ట్ చేయండి. వెంటనే మీకు అది కనిపిస్తుంది.

4. ఇప్పుడు ఈ క్రింది CSS code ని ఇంతకు ముందు చెప్పిన కోడ్ ( ]]></b:skin> ) పైన పేస్ట్ చేసి సేవ్ చేయండి.

img.emoticon {
padding: 0;
margin: 0;
border: 0;
}

5. అంతే మీ బ్లాగులో ఎన్నో అందమైన స్మైలీలు పెట్టుకునే సులువైన సదుపాయం కల్పించబడింది. కొత్త పోస్ట్ రాసేటప్పుడు, పాత పోస్టు మార్పులు చేసేటప్పుడు ఇలా బాక్స్ కనిపిస్తుంది. మీకు కావలసిన స్మైలీ చేర్చుకోండి.



మరో విధానం కూడా ఉంది.
ఇందాకటి లాగే Design > Edit Html కి వెళ్లండి. అక్కడ Ctrl F తో సెర్చ్ బాక్స్ తెచ్చుకుని head వెతకండి. దానిపైన ఈ కోడ్ పేస్ట్ చేసి సేవ్ చేయండి. అంతే మీ బ్లాగు టపాలో కూల్ కూల్ స్మైలీస్ వస్తాయి..

Thursday, October 7, 2010

screenshot/తెరపట్టు

నెట్ మీద పని చేస్తున్నపుడు మీకు ఏదైనా మ్యాటర్ కాని చిత్రం కాని నచ్చుతుంది.లేదా అవసరమవుతుంది. అది మీ సిస్టం లో సేవ్ చేసుకోవాలంటే ఎలా?. లేదా మీకు కంప్యూటర్ వాడకంలో వచ్చిన సమస్య ఎవరికైనా చెప్పాలి, చూపించాలి అంటే యిపుడు? వీటన్నింటికి సులువైన సమాధానం screenshot లేదా తెరపట్టు. మీకు కావలసిన అంశాన్ని అలాగే చిత్రంలా మార్చిప్ సేవ్ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం..

మీ కీబోర్డ్ లో కుడివైపు అన్నిటికంటే పైన ఉన్న లైన్లో చూడండి. F కీస్ పక్కన printscreen అనే కీ ఉంటుంది. మీకు కావలసిన పేజికి వెళ్ళి కీ ని నొక్కండి. అపుడు పేజి ఒక ఇమేజ్ లా సేవ్ అయిందన్నమాట.






యిపుడు start మెనూలో paint ఓపన్ చేసి అక్కడ మౌసే రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేయండి.ఇంతకు ముందు మీరు screenshot తీసుకున్నా చిత్రం అక్కడ ప్రత్యక్షమవుతుంది. దానికి ఒక పేరు ఇచ్చి సేవ్ చేసుకోండి.


మళ్ళీ ఆ చిత్రాన్ని మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్ లో ఓపన్ చేసి అనవసరమైన భాగం కట్ చేసి సేవ్ చేసుకోండి . యిపుడు మీకు కావలసిన చిత్రం తయారుగా ఉంది. ఒక్క విషయం ఎపుడు కూడా jpeg లేదా png లో సేవ్ చేసుకోండి.




యిపుడు windows7 లో snipping tool సాయంతో ఇంత కష్టపడకుండా చాల సులువుగా screenshot తీసుకోవచ్చు. start మెనూ నుండి snipping tool సెలెక్ట్ చేసుకుని మీకు కావలసిన మ్యాటర్ లేదా చిత్రాన్ని screenshot తీసుకోండి. మీరు ఆ పేజిలోనే కావలసినంత మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు.



మీరు సెలెక్ట్ చేసుకున్నా భాగాన్ని సేవ్ చేసుకోండి అంతే...

Thursday, September 30, 2010

కొత్త బ్లాగర్లకు సూచనలు

కొత్తగా బ్లాగు మొదలెట్టాలని అనుకున్నారు. మంచిదే. బ్లాగర్ కి వెళ్ళి మీకంటూ ఒక సొంత బ్లాగు మొదలు పెట్టారు. అంతటితో పని పూర్తవ్వలేదుగా.. బ్లాగు రాయాలని నిర్ణయించుకున్నప్పుడు ముందు, తర్వాత కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే మంచిది. అవి ఏంటో యిపుడు చూద్దాం..


ముందుగా బ్లాగు మొదలెడుతున్నాం. దానికోసం మంచి శీర్షిక లేదా టైటిల్ ఆలోచించి పెట్టుకోండి. ఎదో ఒకటి పెడితే ఎలా?. మన బ్లాగు అంటే మన సొంతిల్లు లాంటిది. అందమైన ఇంటికి అందమైన పేరు ఉండాలిగా?. బ్లాగు మొదలుపెట్టేటప్పుడు టైటిల్ ఇంగ్లీషులో ఇచ్చినా తర్వాత సెట్టింగ్స్ లో తెలుగులోకి మార్చుకోవచ్చు. తెలుగు బ్లాగు పేరు కూడా తెలుగులోనే ఉంటే బావుంటుంది కదా. అలాగే దానికో అందమైన ట్యాగ్ లైన్ కూడా పెట్టండి. ఇంకా అందంగా ఉంటుంది. మరో విషయం. మీరు బ్లాగు మొదలుపెట్టేటప్పుడు బ్లాగు అడ్రస్ అదేనండి url కూడా అందరికి మీకు కూడా ఈజీగా గుర్తుండేట్టు, సింపుల్ గా ఉండేట్టు చూసుకోండి.




dashboard నుండి settings Formattingకి వెళ్ళండి. అక్కడ ముందుగా చేయవలసిన ముఖ్యమైన మార్పులు. ప్రతి పేజిలో మూడు నుండి ఐదు పోస్టులు మాత్రమే వచ్చేట్టు చూడండి. ఎక్కువ టపాలు ఉంటే మీ బ్లాగ్ ఓపన్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. తర్వాత మీ పోస్టు ప్రచురించే తేది, సమయం గురించి పైన చెప్పినట్టుగా మార్చుకోండి.



ఇక కొత్త బ్లాగర్లు చేయవలసిన మరో ముఖ్యమైన పని.. కామెంట్లు రాసేవారికి పంటి కింది రాయిలా వచ్చే వర్డ్ వెరిఫికేషన్.
settings > comments విభాగంలో ఈ వర్డ్ వెరిఫికేషన్ కావాలా వద్దా అన్నదగ్గర వద్దు అనండి. అలాగే బ్లాగులో ఎవరైనా కామెంట్ రాయగానే మీకు తెలిసేట్టు మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఒకవేళ మీరు కామెంట్స్ మాడరేషన్ పెట్టుకోవాలనుకుంటే కూడా ఆ విధంగా మార్పు చేసుకోవచ్చు.

ఇక కొత్త బ్లాగర్లకు మరి కొన్ని సూచనలు.

బ్లాగు మొదలుపెట్టినందుకు అభినందనలు. ముందు మీరు ఏయే విషయాలు రాయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. అలా అని ఒకే విధమైన రాతలు రాయాలని కాదు. మీ బ్లాగు మీ ఇష్టం. ఏదైనా విషయం పై టపా రాయాలంటే ముందు దానికి సరిపోయే విధంగా, అందరిని ఆకట్టుకునే విధంగా ఉండేట్టు టైటిల్ ఎంచుకోండి. తర్వాత మీ టపా రాయండి. వీలయితే దానికో చిత్రం పెట్టండి. మర్చిపోకుండా ప్రతి టపాకు లేబిల్ లేదా వర్గం ఇవ్వండి. తర్వాత మీరు కాని మీ బ్లాగు చదివేవారు కానీ పాట టపాలు చదవాలంటే ఆ వర్గాలు చాలా ఉపయోగపడతాయి. మీరు బ్లాగు మొదలుపెట్టగానే అందరూ పొలోమని వచ్చేయరు కదా. మరి ఎలాగంటారా. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే... మీ బ్లాగులోనీ టపా రాసి కూర్చోకుండా మిగతా బ్లాగులకు వెళ్ళి టపాలు చదివి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. లేదంటే ఎందుకు నచ్చలేదో చెప్పండి. అలా చేస్తుంటే మీ గురించి పదిమందికి తెలుస్తుంది. మీ గురించి మీరే ఇరుగు పొరుగుకు పరిచయం చేసుకోవాలన్నమాట. మెల్లిగా ఇతర బ్లాగర్లు ఎవరా ఈ కొత్త వ్యక్తి అని మీ పేరు ఉన్న లంకె పట్టుకుని మీ బ్లాగుకు వచ్చి మీరు రాసిన టపా చదువుతారు. అలాగే మీ గురించి కొన్ని విషయాలు మీ ప్రొఫైల్ లో పెట్టండి. మరీ పర్సనల్ విషయాలు చెప్పొద్దు లెండి..

మరి మీరు రాసిన టపా అందరికి తెలియాలంటే ఎలా.. తెలుసుగా బ్లాగు సంకలినులు లేదా ఆగ్రిగేటర్లలో చేరాలి.


కూడలి ---- support@koodali.org
మాలిక -... admin@maalika.org
జల్లెడ --- http://dir.jalleda.com/index.php?show=add&PID=79

హారం --- http://haaram.com/Join.aspx
తెలుగు బ్లాగర్స్ ... http://www.telugubloggers.com/add-blog/

అగ్రిగేటర్స్ వివరాలు తెలుసుకున్నారుగా. మరి మీకు అప్పుడప్పుడు వచ్చే సందేహాలకు సమాధానాల కోసం , బ్లాగులకు, అంతర్జాలంలో తెలుగుకు సంబంధించిన చర్చలకోసం తెలుగు బ్లాగు గుంపులో చేరండి. http://groups.google.co.in/group/telugublog ఎవరో ఒకరు మీకు సమాధానమిస్తారు. సందేహాలు , సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తారు.