Sunday, July 11, 2010

బ్లాగు టపాలో ఆడియో ఎలా పెట్టాలి?

మీ బ్లాగులోని ఏదైనా టపాకి పాట జత చేయాలనుకుంటున్నారా? అది మీ దగ్గర ఉన్న పాట అయినా, నెట్ లో ఉన్న పాట అయినా సరే ,చాలా సులువుగా మన టపాలో చేర్చవచ్చు. దానికోసం esnips, లేదా divshare అనే సైట్లు ఉపయోగపడతాయి.


ముందుగా esnips లో మీ పేరుతొ అకౌంట్ తెరవండి. తర్వాత మీ సిస్టంలో ఉన్న పాటను మీ అకౌంట్ లో అప్లోడ్ చేయండి. దీనికి కొంత సమయం పడుతుంది. పాట అప్లోడ్ అయ్యే సమయంలో ఆ విండోలో వేరే ఏవి ఓపన్ చేయకూడదు. అప్లోడ్ ఆగిపోతుంది.




పాట పూర్తిగా అప్లోడ్ అయ్యాక ఆది ఉన్న ఫోల్డర్ తెరిచి చూస్తే ఇలా కనిపిస్తుంది ప్లేయర్. ఇక్కడ ఇలాగే వినొచ్చు. మరి బ్లాగులో ఎలా పెట్టాలి అంటే.. ఇక్కడ కనిపిస్తున్న mp3 widgets ని సెలెక్ట్ చేసుకోవాలి.



సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన ప్లేయర్ ని ఎంచుకుంటే ఆ ప్లేయర్ యొక్క html కోడ్ వస్తుంది. ఆ కోడ్ ని కాపీ చేసుకుని మీ బ్లాగు టపాలో ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేయండి. ఇలా ఎన్ని పాటలైనా, ఆడియో అయినా టపాలో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మామూలుగా పబ్లిష్ చేయండి. అంతే..


అందమైన ప్లేయర్లో మీకిష్టమైన పాట వినవచ్చు.

అలాగే మీకు కావాల్సిన పాటను,మీరు అప్లోడ్ చేయకున్నా, వేరేవాళ్ళ పాటలైనా కూడా ఇలాగే సెలెక్ట్ చేసుకుని ఆ కోడ్ ని మీ బ్లాగులో పెట్టుకోవచ్చు.