Wednesday, December 28, 2011

Skype - ఎలా ఉపయోగించుకోవాలి??

Skype యిపుడు ఇంటర్నెట్ వాడేవారందరూ ఉపయోగించే మాట . సదుపాయం. ఎవరికైనా కాల్ చేసి మాట్లాడాలంటే ఫోన్ చార్జెస్ పడతాయి. లోకల్ అంటే తక్కువే కాని వేరే ఊర్లలో, రాష్ట్రాలలో , దేశాలలో ఉన్నవారితో ఫోన్లో మాట్లాడాలంటే బిల్లు పేలిపోతుంది. దానితో మన స్నేహితులు, బంధువులతో తరచూ మాట్లాడాలంటే భయమేస్తుంది తర్వాత వచ్చే బిల్లును తలచుకుంటే. కాని ఇంటర్నెట్ ద్వారా చాలా సులువుగా, ఖర్చు లేకుండా ఎంతసేపైన మాట్లాడుకోవచ్చు. ఒకేసారి ఒకరితో కాకుండా నలుగురైదుగురు కలిసి గ్రూప్ గా మాట్లాడ్డం, లేదా చర్చించడం చెయొచ్చు. ఇద్దరికి Skype అకౌంట్ ఉంటే ఫ్రీగా ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. అలాగే చాలా తక్కువ సొమ్ముతో లాండ్ లైన్, మొబైల్స్ కి కూడా కాల్ చెయొచ్చు... అంటే కాదండోయ్.. International Toll Free Numbers కి కూడా ఉచితంగా కాల్ చేసి ముచ్చట్లేసుకోవచ్చు.. ఎలాగంటారా?? అది ఎలాగో చూద్దాం..


ముందుగా Skype సైట్ కి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. http://www.skype.com/intl/en/home


ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవ్వడానికి కొంచం టైం పడుతుంది ఖంగారు పడకండి.. మొత్తం డౌన్లోడ్ అయ్యాక install చేసుకోండి.




ముందుగా మీరు కనెక్ట్ చేసిన హెడ్ ఫాన్స్, మైకు, స్పీకర్స్ అన్ని సరి చూసుకోండి. ఇక తర్వాత రంగంలోకి దిగడమే..

ఆ తర్వాత Skype లో మీకంటూ ఓ అకౌంట్ క్రియేట్ చేసుకోండి.



యిపుడు మీ desktop మీద Skype బొత్తాం (icon) కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకున్న ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.




లాగిన్ అయ్యారుగా ఇక మీ స్నేహితులను ఒక్కొక్కరిని ఆడ్ చేసుకోండి.




అందరిని ఆడ్ చేసుకున్న తర్వాత ఇలా లిస్టు కనిపిస్తుంది. మీరు మాట్లాడాలనుకున్నవారితో అలుపొచ్చేదాకా మాట్లాడండి .

Monday, December 12, 2011

బ్లాగ్ ఎంట్రీపాస్ మార్చాలా?

బ్లాగు మొదలెట్టినపుడు ఒక మెయిల్ ఐడి ఇస్తాం కదా. అది జిమెయిల్ కావొచ్చు, యాహూ మెయిల్ లేదా రెడిఫ్ మెయిల్ కావొచ్చు. ఒక్కోసారి ఒకే మెయిల్ ఐడి తో ఎన్ని బ్లాగులైన మొదలెట్టవచ్చు అని తెలీక కూడా వేర్వేరు ఐడిలు క్రియేట్ చేసి బ్లాగులు ఓపన్ చేస్తుంటారు. (నేను మొదట్లో ఇలాగే చేసాను).. మనం జి మెయిల్ లో ఉండి యాహూ ఐడి తో ఉన్న బ్లాగు ఓపన్ చేయాలంటే వేరే బ్రౌజర్ లో ఓపన్ చేయాలి లేదంటే బ్లాగు ఓపన్ చేయగానే జిమెయిల్ ఎగిరిపోతుంది . ఒకటి కంటే ఎక్కువ బ్లాగులు ఉన్నపుడు వేర్వేరు బ్లాగులకు వేర్వేరు ఐడి పాస్వర్డ్ లు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. చిరాకేస్తుంది కూడా. అలాంటప్పుడు ఏం చేయాలి??.. దీనికి పరిష్కారం లేదా అంటే...

ఉంది కింద చెప్పినట్టుగా చేసి మీ బ్లాగులన్నీ ఒకే ఐడి గూటి కిందకు తెచ్చుకోండి..

ముందుగా మీరు మీ ఐడి తో మొదలెట్టిన బ్లాగు లో కి ప్రవేశించండి. లాగిన్ అయ్యాక settings > permissions క్లిక్ చేయాలి. అక్కడ బ్లాగుకు వేర్వేరు author లను ఆడ్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ బ్లాగు లాగిన్ కి చేర్చాలనుకున్న మెయిన్ మెయిల్ ఐడి (gmail, yahoo , rediff) ఇచ్చి ఆహ్వానించండి.

మీ ఇతర ఐడి లోకి వెళ్ళితే ఇలా ఆహ్వానం ఉంటుంది అది అంగీకరించండి.

యిపుడు మీరు మార్చాలనుకున్న ఐడి కి మీ బ్లాగు చేర్చబడింది.


మళ్ళీ వెనక్కి రండి.. మీ పాత బ్లాగు ఐడి తో లాగిన్ ఐన పేజిలోని permissions పేజికి వెళ్ళి మీరు ఇచ్చిన ఇంకో ఐడి కి ఆడ్మిన్ హక్కులు ఇవ్వండి.



ఇప్పుడు ఒకసారి మీ మెయిన్ ఐడి తో లాగిన్ అయ్యి dashboard ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. మీ బ్లాగు ఇక్కడికి క్షేమంగా చేరింది అని నిర్ధారణ అయ్యాక మొదటి మెయిల్ ఐడి పేజిలో ఆ ఐడి తీసేయండి. అంటే మీరు ఒకేసారి రెండు పేజీల్లో పని చేయాల్సి ఉంటుంది. ఒకేసారి చేయడం తికమకగా ఉంటే.. ఇలా అడ్రస్ మార్చాక రెండు రోజులు కొత్త మెయిన్ ఐడి తో లాగిన్ అయ్యి పని చేసుకోండి. తర్వాత పాత ఐడి తీసేయండి..

ఇలా మీరు వేర్వేరు ఐడి లతో ఉన్న బ్లాగులన్నీ ఒకే మెయిల్ ఐడి కి మార్చుకోవచ్చు.