Tuesday, December 29, 2009

జి మెయిల్ లో బొమ్మలు

జిమెయిల్ లో మన ఉత్తరంతో పాటు అప్పుడప్పుడు బొమ్మలు పంపిస్తుంటాము కదా. అలా ఎన్నివిధాలుగా చిత్రాలు పంపవచ్చో తెలుసుకుందాం.




మామూలుగా అందరికి తెలిసినది, ఎంతోకాలంగా ఉపయోగిస్తున్న పద్ధతి... మన సిస్టమ్ లో ఉన్న బొమ్మలను attachment లా పంపిస్తాము. అది అందుకున్నవారు డౌన్లోడ్ చేసుకుని చూస్తారు.

కాని చిత్రాలను విడిగా కాకుండా మెయిల్ లోనే ఎంబెడ్ చేయవచ్చు. గూగులమ్మని బొమ్మలు చూపమని దాని పెద్దసైజు సెలెక్ట్ చేసుకోండి. google images . view full size ... ఆ చిత్రాన్ని మొత్తంగా సెలెక్ట్ చేసుకుని copy (మాత్రమే) చేయాలి.


కాపీ చేసిన చిత్రాన్ని మీ మెయిల్ లో రాసుకునే పెట్టెలో పేస్ట్ చేయండి. అంతే ఆ చిత్రం అచ్చంగా మెయిల్ లో వచ్చేస్తుంది. కాని ఈ పద్ధతి నెట్ లో ఉన్న చిత్రాలకే వీలవుతుంది.మరి మన సిస్టమ్ లో ఉన్న చిత్రాలను అలా పంపాలంటే?? ఎలా??




ఇప్పుడు మెయిల్ లో బొమ్మను ఎంబెడ్ చేసే మరో పద్ధతి చూద్దాం. ఇది మన సిస్టమ్ లో ఉన్న ఏ బొమ్మనైనా పంపవచ్చు. ముంధుగా జిమెయిల్ లో Settings>Labs> లి వెళ్లి ఒక్కో ఆప్షన్ చూసుకుంటూ క్రిందకు వెళ్లండి. అక్కడ Insert image అనే ఆప్షన్ ని enable చేయండి. దీనివల్ల మన మెయిల్ లో బ్లాగుకు మళ్లే బొమ్మలను ఎంబెడ్ చేసే సదుపాయం వస్తుందన్నమాట. మీరు మెయిల్ compose చేసేటప్పుడు Add image అనే ఆప్షన్ (icon) ఉంటుంది. అది క్లిక్ చేసి మీ సిస్టమ్ లో ఉన్న చిత్రాన్ని అప్లోడ్ చేయండి.(బ్లాగులో చేసినట్టే)





ఇలా అప్లోడ్ చేసిన చిత్రం మెయిల్ పెట్టెలో పూర్తిగా వస్తుంది. బావుంది కదా. ఇంకెందుకు ఆలస్యం. ప్రయత్నించండి.

Sunday, December 27, 2009

జల్లెడ - బ్లాగులను జల్లించండి...

తెలుగు బ్లాగుల మరో అగ్రిగేటర్ జల్లెడ. బ్లాగు టపాలు రాయగానే ఇక్కడ అది లింకులతో ప్రత్యక్షమవుతుంది. దాని లంకె పట్టుకుని ఆ బ్లాగుల తలుపు తడతారు నెటిజన్లు. అత్యంత ప్రాముఖ్యం కలిగి, ఎన్నో విశిష్ట ఫీచర్లతో మనకు సేవలందిస్తున్న జల్లెడ గురించి తెలుసుకుందాం.



ఈ జల్లెడలో బ్లాగులు విభాగాల వారిగా జల్లించబడి సులువైన క్యాటగరీలలో మనకు అందించబడతాయి. మనం బ్లాగు టపా రాయగానే ఇచ్చే లేబుల్స్ ఆధారంగా సదరు టపాలు ఇక్కడి వివిధ విభాగాలలో చేరిపోతాయి. ఇందులో ఉన్న విభాగాలు చూద్దాం .. అన్నీ.. కబుర్లు, హాస్యం, రాజకీయం, కవితలు, సాహిత్యం, ఆధ్యాత్మికం, కొత్తబాబులు (కొత్త బ్లాగులు) , స్త్రీ (మహిళా బ్లాగులు మాత్రమే) , సాంకేతికం, సినిమా, పత్రికలూ (అంతర్జాల పత్రికలు).. అంటే కాక ఇందులో తాజా వ్యాఖ్యలు, తాజా టపాలు విడివిడిగా చూడవచ్చు. అంతే కాదు తెలుగు బ్లాగుల జాబితా కూడా లింకులతో సహా ఇందులో చూడవచ్చు. జల్లెడలో ఉన్న మరో విశేషం .. ఇందులో మనం బ్లాగు రచయిత పేరు ఆధారంగా, మనం రాసిన కామెంట్ల ఆధారంగా కూడా టపాలు, బ్లాగులను జల్లించవచ్చు(చూడవచ్చు). దీని ఇంగ్లీషు వెర్షన్ కూడా ఉండండి. భారతీయుల ఇంగ్లీషు బ్లాగులు ఇక్కడ చేర్చబడ్డాయి. జల్లెడను తెలుగులోనే కాక RTS లో కూడా చదవగలిగే అవకాశం ఉంది.


మీరు జల్లెడను ఉపయోగించుకుని అలాగే వెళ్ళిపోకుండా అక్షింతలు వేయాలని ఉందా? తిట్లు, పొగడ్తలు, సలహాలు వగైరా. ఆ అవకాశం కూడా ఉంది..


ఇక ఇన్ని ప్రత్యేకతలు కలిగిన జల్లెడ ఆగ్రిగేటర్లో మీ బ్లాగును చేర్చాలా? అక్కడే ఉన్న ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ అడిగిన వివరాలు ఇచ్చేయండి . అంతే మీ బ్లాగును , చిరునామాను సరిచూసుకుని జల్లెడలో చేర్చేస్తారు నిర్వాహకులు.. ఇక హాయిగా రాసుకోండి.. జల్లెడలో మీ టపా లింక్ చూసి చదువరులు ఆ తీగ పట్టుకుని మీ బ్లాగుకు వచ్చేస్తారు..