Tuesday, September 29, 2009

మీరు పాడిన పాటలు బ్లాగులో పెట్టాలా??

ఇంతవరకు బ్లాగులు అంటే మన ఆలోచనలను రాతలలో నిక్షిప్తం చేయడమే అనుకుంటున్నారు.పాటలు, వీడియోలు కావాలంటే జాలంలో చాలా ఉన్నాయి. యూట్యూబ్, ఈస్నిప్స్ గట్రా.. నెట్లో ఉన్న పాటలు వాడుకోవచ్చు లేదా మన దగ్గర ఉన్న పాటలు, వీడియోలు అప్లోడ్ చేసి బ్లాగులో పెట్టొచ్చు. కాని మన స్వంత గొంతుకతో పాడి, మాట్లాడి బ్లాగులో పెట్టాలంటే ఎలా??


దీనికోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి పాటిస్తే చాలా సులువుగా ఆడియో టపాలు పెట్టడం కష్టమేమి కాదు. ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ ఆడియో ఫైళ్ళు mp3 format లో ఉండాలి. మీ దగ్గర రికార్డింగ్ సదుపాయం ఉన్న mp3 ప్లేయర్ ఉంటే మంచిదే. అందులో డైరెక్టుగా పాడేసి,మాట్లాడేసి రికార్డింగ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని మన కంప్యూటర్ కి కనెక్ట్ చేసి ఆ ఫైల్ ని సిస్టం లోకి సేవ చేయండి. ఒకవేళ అది wav format లో ఉంటే dBPoweramp music converter సాయంతో mp3 కి మార్చుకోవచ్చు.


మరో సులభమైన ఉపాయం ఉంది. వాయిస్ రికార్డింగ్ సాఫ్ట్ వేర్ వాడడం. ఈ సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. కంప్యూటర్ కి మైక్ అనుసంధానం చేసి ఆ సాఫ్ట్వేర్ సాయంతో రికార్డింగ్ చేయండి. ఇక్కడ మన ఆడియో నేరుగా mp3 లో రికార్డ్ అవుతుంది. ఈజీగా లేదూ..




RecordPad Sound Recording Software


MP3 Voice Recorder



ఇక వాయిస్ రికార్డింగ్ ఐపోయింది. దాన్ని బ్లాగులో ఎలాపెట్టాలి.. ముందుగా esnips లేదా divshare సైట్లో మీ ఖాతా తెరవండి. అక్కడ మీరు రికార్డింగ్ చేసింది అప్లోడ్ చేసి సేవ్ చేయండి. తరవాత దాని mp3 widget code తీసుకొని మీ బ్లాగులో పెట్టండి. అంతే..


ఒకవేళ మీ టపాలో ఒకటికంటే ఎక్కువ పాటలు, ఆడియో ఒకే ఫైలులా పెట్టాలనుకుంటే మీరు అప్లోడ్ చేసిన పాటలన్నీ playlist లా చేసి ఆ కోడ్ బ్లాగులో పెడితే సరి.. ఇలాగన్నమాట..


అర్ధమైందనుకుంటా??

Monday, September 21, 2009

వ్యాఖ్యల్లో లింకులు ఇవ్వడం

ఇంతకు ముందు బ్లాగు టపాలో వేరే టపా, బ్లాగు, సైట్ లింక్ ఇవ్వడం తెలుసుకున్నాము కదా. ఇప్పుడు బ్లాగుల్లో మనం రాసే వ్యాఖ్యల్లో కూడా ఏదైనా లింక్ ఎలా ఇవ్వాలో చూద్ద్దాం. ఇది అంత కష్టమేమి కాదు.

మనం బ్లాగు టపాలకు మన స్పందన తెలపడానికి వ్యాఖ్యలు రాస్తుంటాము. అప్పుడప్పుడు ఈ వ్యాఖ్యలలో మరో టపా కాని , సైటు కాని ప్రస్తావించవలసి వస్తుంది. ఆ పేజి లింక్ ఇలా ఇవ్వొచ్చు.




అది చదివినవాళ్ళు దాన్ని కాపీ చేసుకుని విడిగా పేస్ట్ చేసి చూడాలి. ఇలా మొత్తం పేజి లింక్ ఇవ్వడం వల్ల ఒక్కోసారి కాపీ చేసుకోవడంలో ఏదైనా మిస్ ఐతే కష్టం కదా. బద్ధకం వల్ల కూడా దాన్ని చూడము. ఇంత పొడుగు చిరునామా చూడడానికి అంత బాగోలేదు కూడా.





అలా కాకుండా బ్లాగు టపాలో ఇచ్చినట్టు వ్యాఖ్యలో కూడా లింక్ లేదా లంకె వేయొచ్చు. ఒక చిన్న కోడ్ ఇస్తే సరి..

<a href='లంకె చిరునామా'>లంకె పాఠ్యం </a>


ఇక్కడ లంకె చిరునామా అన్నచోట మీరు ఇవ్వాలనుకున్న పేజి లింక్ ఇవ్వండి.లంకె పాఠ్యం అన్నచోట మీరు లింకుకు ఇవ్వాలనుకున్న పదం ఇవ్వండి.







ఇప్పుడు మీ వ్యాఖ్యలో లింక్ ఇలా వస్తుంది. అది చదివిన వాళ్లు అది క్లిక్ చేయగానే సదరు పేజి ఓపన్ అవుతుంది. మొదట్లో కాస్త తికమకగా, అయోమయంగా ఉండొచ్చు.కాని రెండు మూడుసార్లు చేస్తే అదే అలవాటవుతుంది.